షణ్ముఖ్‌తో కెమెరాలో అలా కనిపిస్తే.. బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతా.. సిరి హన్మంతు షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో మూడో ఎలిమినేషన్ మరోసారి రచ్చ రాజేసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన లహరి షారి తనను నామినేట్ చేసిన షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంతు‌పై లహరి ఘాటుగా స్పందించింది. అయితే తనను టార్గెట్ చేస్తూ మాట్లాడిన లహరి షారిపై సిరి హన్మంతు ఇంటిలో సంచలన వ్యాఖ్యలు చేసింది. లహరి షారి చేసిన కామెంట్లపై సిరి హన్మంతు స్పందిస్తూ..

లహరిని నామినేట్ చేసిన సిరి, షణ్ముఖ్

లహరిని నామినేట్ చేసిన సిరి, షణ్ముఖ్

గతవారం నామినేషన్ల సందర్భంగా లహరి షారిని సిరి హన్మంతు, షణ్ముఖ్ హన్మంతు నామినేట్ చేశారు. ఆ కారణంగానే ఆమె ఎలిమినేషన్‌ ఎదుర్కొన్నారు. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్‌లో తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే తనను మీరు కావాలని, వ్యూహాత్మకంగా నామినేట్ చేశారు అని ఎలిమినేషన్ తర్వాత లహరి షారి అనడం కనిపించింది. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఎవరో ఒకరు మాట్లాడినట్టు స్టేజ్ మీద నుంచి మాట్లాడను అని లహరి చెప్పింది.

షణ్ముఖ్‌తో నా రిలేషన్ గురించి

షణ్ముఖ్‌తో నా రిలేషన్ గురించి

తన ఎలిమినేషన్‌కు కారణం ఆమె అంటూ లహరి చేసిన కామెంట్లపై సిరి హన్మంతుగా ఘాటుగా స్పందించింది. అందరూ షణ్ముఖ్, నా రిలేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడు కలిసి ఆడుతున్నారంటూ పాట పడుతున్నారు. మేమిద్దరం కలిసి ఉన్నట్టు.. గంట సేపు కూర్చిన ఉన్నట్టు కనిపించినా.. ఏ ఒక్క కెమెరాలో కనిపించినా.. లేదా లహరి గురించి మాట్లాడినట్టు అనిపించినా.. బిగ్‌బాస్ ఇంటి నుంచి వెళ్లిపోతాను అని సిరి హన్మంతు అన్నారు.

లహరిపై సిరి హన్మంతు ఆగ్రహం

లహరిపై సిరి హన్మంతు ఆగ్రహం

ఎలిమినేషన్ తర్వాత మీ వల్లే నేను బయటకు వెళ్తున్నాను అంటూ లహిరి చెప్పిన విషయాలపై సిరి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా ఎలా చెప్పి వెళ్లిపోతారు. బయటకు వెళ్లేటప్పుడు వాళ్లు అలా మాట్లాడితే ఇంట్లో ఉన్నవాళ్లు ఎలా హర్ట్ అవుతారో తెలుసా? ఒకరు నామినేట్ చేశారని నీవు నామినేట్ చేస్తావా అంటూ సిరి ఆవేశంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. నేను ఎవరితో కలిసి గేమ్ ఆడటం లేదు అని సిరి అంటూ కనిపించింది.

సిరి.. ఆవేశపడకు అంటూ యాంకర్ రవి

సిరి.. ఆవేశపడకు అంటూ యాంకర్ రవి

సిరి హన్మంతు ఆవేశంగా మాట్లాడుతుంటే యాంకర్ రవి సముదాయించాడు. ఆమె అభిప్రాయం ఆమె చెప్పింది.. మీరు కాస్త కామ్ ఉంటే సరిపోతుందని అంటే.. ఆమె స్టేజ్ మీద చెప్పను అని ఎలా అంటుంది. నా గేమ్ నచ్చకనే షణ్ముఖ్ నాతో గొడవ పడ్డారు. అలాంటప్పుడు మేమిద్దరం ఎలా గొడవపడ్డారని చెబుతుంది అని ఆవేశంగా సిరి అంటుంటే.. ఎక్కువగా రియాక్ట్ అవ్వొద్దు.. నీవేమి చిన్నపిల్లవి కావు.. ఒకరి కోసం నీవు నీ ఫ్రెండ్ షిప్ మానుకోవద్దు. నీ రిలేషన్స్‌ను వదులు కోవాల్సిన అవసరం లేదు అని యాంకర్ రవి అంటూ కనిపించాడు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Shannu కి క్లారిటీ ఉందా? Lahari Elimination కి రీజన్స్ || Oneindia Telugu
ఏంటిరా.. షణ్ముఖ్ అంటూ లహరి

ఏంటిరా.. షణ్ముఖ్ అంటూ లహరి

హోస్ట్ నాగ్‌తో కలసి వేదిక మీద నుంచి లహరి షారి మాట్లాడుతూ.. సిరి హన్మంతు వేసిందని నువ్వు వేసేశాడు.. నీవు నన్ను నామినేట్ చేయడం.. ఏంటిరా ఇది.. నీవు ఇలా చేస్తావని అనుకోలేదు అంటూ లహరి చెప్పింది. అందుకే నీవు అక్కడ ఉన్నావు.. నేను ఎవరు నిన్ను బయటకు పంపించడానికి అంటూ షణ్ముఖ్ చెప్పారు. నీవు ఎంత చెప్పిన అదే విధంగా మళ్లీ మాట్లాడటం లేదు అని షణ్ముఖ్ చెప్పడంతో అంతా మీ మంచి గురించే చెబుతున్నాను అని లహరి షారి చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X