Don't Miss!
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- News
student: న్యూడ్ వీడియోతో షాక్ అయిన కాలేజ్ విద్యార్థి, బ్లాక్ మెయిల్ చేసిన శాడిస్టు లేడీ, క్లైమాక్స్ లో?
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Siri Hanumanth: ప్రియుడితో కలిసి ఖరీదైన కారును కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. దాని ధర ఎంతంటే?
సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకున్న సిరి హనుమంత్ ఆ తర్వాత బిగ్ బాస్ 5వ సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె సోషల్ మీడియాలో చాలా హడావిడిగా కనిపించే ప్రయత్నం చేస్తుంది. ఒక రీసెంట్ గా సిరి ప్రత్యేకంగా తనకు ఇష్టమైన ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసింది. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ తో కూడా ఫోటోలు దిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా..
బిగ్ బాస్ కంటే ముందు సిరి హనుమంత్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా యూట్యూబ్ లో మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఆ తర్వాత ఆమె షణ్ముఖ్ జశ్వంత్ తో కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసింది. అలాగే మరి కొంతమంది యూట్యూబర్స్ తో కలిసి కొన్ని ప్రత్యేకమైన పాటలలో డ్యాన్సులు కూడా చేసి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంది.

షన్నుతో అలా..
ఇక ఎప్పుడైతే సిరి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిందో అప్పటినుంచి ఆమెకు మరింత క్రేజ్ ఏర్పడింది అనే చెప్పాలి. ఆ రియాలిటీ షో ద్వారా ఆమె కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా అందుకుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా షణ్ముఖ్ జస్వంత్ ఆమె క్లోజ్ గా కొనసాగింది. ఒక విధంగా వారి అనుబంధంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా బాగానే నడుచుంది. కలిసి గేమ్ ఆడినట్లు విమర్శలు కూడా వచ్చాయి.

అందుకే బ్రేకప్స్
బిగ్ బాస్ 5 ప్రభావం కారణంగానే షణ్ముఖ్ జస్వంత్ తన ప్రేయసి దీప్తి సునైనా తో కూడా తెగదుంపలు చేసుకున్నట్లుగా ఆ మధ్య ఒక టాక్ వినిపించిన విషయం తెలిసిందే. దీప్తి సునయన, షన్ను, సిరి మధ్యలో ఉన్న అనుబంధం కారణంగా.. కోపంగానే షణ్ముఖ్ జస్వంత్ కు బ్రేకప్ చెప్పినట్లుగా టాక్ అయితే వినిపించింది.

అవన్నీ అబద్ధాలు
మరొక టాక్ ప్రకారం సిరి కూడా తన బాయ్ ఫ్రెండ్ నుంచి కూడా విడిపోయినట్లు అనేక రకాల కథనాలు అయితే వచ్చాయి. సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ ప్రేయసి బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు మాత్రం బాగానే సపోర్ట్ చేశాడు. ఇక హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రేకప్ రూమర్స్ బాగానే వచ్చినప్పటికీ ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పోటోలకు స్టిల్స్ ఇవ్వడంతో అవన్నీ కూడా అబద్ధాలు అని తేలిపోయాయి.

ఖరీదైన కారును కొన్న సిరి
ఇక రీసెంట్ గా సిరి హనుమంతు తనకు ఎంతో ఇష్టమైన ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసింది. 16 లక్షల విలువైన MG కారును ఇటీవల సిరి హనుమంత్ హైదరాబాదులో కొనుగోలు చేసింది. ఎప్పటి నుంచో ఈ కారును ఆమె కొనాలని అనుకుంటుందట. ఇక ఫైనల్ గా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి అమ్మడు మొదటి కారును కొన్న సందర్భంగా ప్రత్యేకంగా ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక సిరి బాయ్ ఫ్రెండ్ కూడా బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఉన్నట్లు మరో కొత్త టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.