Jabardasth: జబర్దస్త్ షోకి సిరిహనుమంత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? రష్మి, అనసూయల కంటే ఎక్కువే!

బుల్లితెరపై ప్రత్యేక ఆదరణ పొందిన షోల్లో ఒకటి జబర్దస్త్. దశాబ్ద కాలంగా బుల్లితెరపై నవ్వులు పంచుతూ.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తుంది. ఇక ఈ షోకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే ఈ షోకు మొదట యాంకర్స్ గా అనసూయ, రష్మి ఉన్న సంగతి తెలిసిందే. ఇక అనసూయ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాకా బుల్లితెర షోకు గుడ్ బై చెప్పేసింది. ఇక ఆమె ప్లేస్ లో సౌమ్య రావు రాగా.. ఇటీవల ఆమె కూడా షోకు గుడ్ బై చెప్పేసింది. అయితే ఆమె ప్లేస్ లో బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ వచ్చింది. అయితే ఆమె రెమ్యూనరేషన్ తెలుసుకుని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. రష్మి, అనసూయల కంటే డబుల్ ఛార్జ్ చేస్తుందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

బుల్లితెరపై జబర్దస్త్ షోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ షో కోసం ప్రేక్షకులు ప్రతి వారం ఎదురు చూస్తుంటారు. ఇక దానికి తగ్గట్లుగా రేటింగ్ సంపాదించుకుంటూ.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదట ఈ షో రోజా, నాగా బాబు జడ్జ్ లుగా ఉండే వారు. ప్రస్తుతం ఈ షోకి ఇంద్రజ, భగవాన్ న్యాయమూర్తులుగా ఉన్నారు.

Siri Hanumanth will get double remuneration than Rashmi and Anasuya for anchoring Jabardasth show.

ఒకప్పుడు అనసూయ, రష్మి.. జబర్దస్త్ షోకి యాంకర్లుగా ఉండే వారు. ఇక అనసూయ, రష్మీ పోటా పోటీగా యాంకరింగ్ చేస్తూ.. ఎంటర్టైన్ చేసేవారు. అంతే కాదు పోటా పోటీగా అందాలు ఆరబోస్తూ.. వారి మాటలతో మాయచేసేవారు. ఇక అనసూయకు సినిమా ఛాన్సులు రావడంతో.. ఆమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది. ఇక ఆమె ప్లేస్ లోకి సౌమ్య రావు వచ్చింది.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ ఇటీవల జబర్దస్త్ కొత్త యాంకర్ గా వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో అదరగొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ గా మారిపోయింది. ఈ బ్యూటీ సౌమ్య రావు ప్లేస్ లోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సిరి హనుమంత్ రెమ్యూనరేషన్ భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Siri Hanumanth will get double remuneration than Rashmi and Anasuya for anchoring Jabardasth show.

సిరిహనుమంత్... ఒక్కొక్క ఎపిసోడ్ కి రూ. 3.50 లక్షళు ఛార్జ్ చేస్తుందని తెలుస్తోంది. నిజానికి అనసూయ, రష్మి ఇంతకన్నా తక్కువగా తీసుకునేవారని తెలుస్తోంది. కేవలం రూ.1.50 లక్షలు తీసుకునే వారట. అయితే సిరి హనుమంతు మాత్రం ఏకంగా దానికి డబల్ రేంజ్ లో ఛార్జ్ చేస్తుందని సమాచారం. దానికి కారణం ఆమె కున్న క్రేజ్ అని తెలుస్తోంది. అనసూయ, రష్మీలని మించి రెమ్యూనరేషన్ తీసుకోవడంతో.. నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

ఇక సిరి హనుమంత్ విషయానికి వస్తే.. ఇటీవల బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటించింది. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయగా.. ఈ బ్యూటీకీ మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ భామ జబర్దస్త్ లో అలరించడానికి సిద్ధం అయింది. చూడాలి మరి మున్ముందు ఏం చేయనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X