Brahmamudi October 11th:రాజ్ బండారం తెలిసి సీతారామయ్య షాక్.. అబార్షన్ కోసం స్వప్న వేసిన ప్లాన్ రివర్స్

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో కావ్య గుడిలో ఉన్న విషయం సీతారామయ్య, ఇందిరాదేవి తెలుసుకుంటారు. ఇక అక్కడి వెళ్లి కావ్య ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిందో తెలుసుకుంటారు. ఇక రాజ్ చీటీలో రాసిన రహాస్యం తెలుసుకుని షాక్ అవుతారు. ఇక కావ్య ఇంటికి వస్తుందా... ఇంటికి వచ్చాకా రాజ్ వారికి ఏం సమాధానం చెబుతారు.. అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావ్య ఇంట్లోంచి వెళ్లిపోవడంపై కనకం, మూర్తి దుగ్గిరాల కుటుంబంపై విరుచుకుపడుతారు. ఇక ఇందిరా దేవి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంత మందిని ఇబ్బంది పెట్టి ఈ కళావతి ఎక్కడికి వెళ్లిందని రాజ్ మనసులో అనుకుంటాడు. ఇక కావ్య ఓ గుడిలో నిస్సహయంగా కూర్చుంటుంది. అక్కడి గుడి పంతులు వచ్చి పిలిచినా పలకకుండా అలాగే కూర్చుంటుంది. ఇక పంతులు సీతారామయ్యకు కాల్ చేస్తాడు. మీ మనవరాలు గుడిలో కూర్చుందని అసలు విషయం చెప్తాడు.

Brahmamudi October 11th:

శర్మగారు మీరు చాలా పెద్దసాయం చేశారు.. జాగ్రత్తగా మా మనవరాలిని చూసుకోండి అంటూ సీతారామయ్య పంతులకు చెప్తాడు. ఇక ఇందిరా దేవికి చెప్తాడు.. అందరికి చెప్దాం అంటే వద్దు చిట్టి.. ముందు మనమే ఏం జరిగిందో తెలుసుకోవాలి అని సీతారామయ్య చెప్తాడు. ఇక కావ్య ఒంటరిగా గుడిలో కూర్చోని ఉంటుంది. ఏమైంది అని ఇందిరా దేవి అడుగుతుంది. ఇక్కడ ఉన్నావ్ ఏంటి అని అడిగితే.. ఎక్కడికి వెళ్లాలో తెలియకా అని కావ్య చెప్తుంది.

ఇక కాసేపు మాట్లాడుకున్నాకా రాజ్ రాసిన చీటీని సీతారామయ్యకు ఇస్తుంది కావ్య. రాజ్ రాసిన చీటీని సీతారామయ్య చదువుతాడు. ఏంటిది అని ఇందిరా దేవి అడుగుతుంది. అది చదివి ఇందిరాదేవి కూడా షాక్ అవుతుంది. కళావతితో మంచిగా ఉన్నట్లు నటిస్తున్న అంటూ రాసుకొచ్చిన రాజ్ చీటీని చదువుతారు. ఇక కావ్య ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అమ్మా అని సీతారామయ్య అడిగితే.. నేను ఇక్కడికి భక్తితో రాలేదు.. విరక్తితో వచ్చాను అంటూ చెప్తుంది.

Brahmamudi October 11th:

ఇంట్లో మేం ఉన్నాం కదా మాతో చెప్పొచ్చు కదా అని సీతారామయ్య అంటాడు. మీరు దేవుడి కంటే గొప్పవారా తాతయ్య అంటుంది కావ్య. నేను మందలిస్తాను కదా అని అంటాడు సీతారామయ్య. దానికి మీరు మందలించినందుకే కదా లేని ప్రేమను ప్రదర్శించింది... అంటూ కావ్య చెప్తుంది. సిఫార్సులతో భర్యాను భర్తను గదిలో ఉంచగలరేమో కానీ... మదిలో ఉంచలేరు అంటుంది, అమ్మలేని పుట్టిల్లు.. భర్త ప్రేమలేని అత్తిల్లు రెండు ఒక్కటే అంటుంది కావ్య.

నా భవిష్యత్తు నాకు శూన్యంలా కనిపిస్తుంది. ఏం చూసుకుని నేను ఆశగా బతకాలి.. నిరాశ తప్ప నాకేం మిగిలింది. ఒక ఆడపిల్ల ఒక అత్తారింట్లో ఇంతకంటే అణుకవగా ఎలా ఉండాలి.. ఇంతకంటే సహానంగా ఎలా ఉండాలి. భర్త ప్రేమ లేదు. అత్తగారి ఆదరణ లేదు.. అలాగని పుట్టింటికి చేరి ఏ మచ్చ తీసుకు రాలేను. అది మా వాళ్లకు గౌరవం కాదు.. నా అత్తింటికి కూడా గౌరవం కాదు.. ఏ దారి లేక ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అంటూ కావ్య బోరున విలపిస్తుంది.

ఆ పంతులు ద్వారా నువ్వు ఇక్కడ ఉన్నావని మాకు దేవుడు సందేశం పంపించారు. నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం రా అమ్మ అని ఇందిరాదేవి, సీతారామయ్య బతిమిలాడుతారు. ఇక అతిథిలాగా ఆ ఇంట్లో ఉండలేనని చెప్తుంది కావ్య. ఇప్పటికీ ఆ కుటుంబంలో ఓ సభ్యురాలిని కాలేకపోతున్నాను అంటూ కావ్య అడుగుతుంది. ఏ హక్కుతో రావాలి అని ప్రశ్నిస్తుంది. సీతారామయ్య... ఆ రోజు మందలించడం వల్ల ఇలాచేశాడు.. దీన్ని ఇలాగే వదిలేస్తే మా పెద్దరికానికి అర్థం లేదు అంటాడు. ఏం చేస్తారు తాతాయ్య మళ్లి మందలిస్తారు అంతే కదా అంటుంది కావ్య.

Brahmamudi October 11th:

కావ్యకు ఇందిరాదేవి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆడది తలుచుకుంటే.. ఏదైనా సాధ్యమే. మా మనవడిలో మార్పుకోసం మీకు అండగా ఉంటామంటూ కావ్యకు దైర్యాన్ని ఇస్తారు. ఆ ఇంట్లో ఉండటం నీ హక్కు... భర్త నీడలో ఉండటం భార్య హక్కు.. ఆ హక్కును వదిలి రావడం కూడా తప్పే.. అంటూ ఇందిరా దేవి చెప్తుంది. రాజ్ నా మనవడు.. ముర్ఖుడు కాదు... వాడికి తప్పు, ఒప్పు అన్ని తెలుసు... వాడి ప్రేమను ఓ మాయ కమ్మేసింది.. ఆ మాయను తొలగిస్తే.. మనిషి అవుతాడు.. అని చెప్తింది. ఇక రాజ్ ఎంట్రీ ఇస్తాడు.

రమ్మని బతిమిలాడుతారా.. అయినా రాను అంటుంది.. రాజ్ వచ్చి.. కావ్యపై విరుచుకుపడుతాడు. కావ్యను కొట్టబోతాడు కూడా. ఆగిపోయావేంట్రా కొట్టు అని చెప్తుంది ఇందిరాదేవి. లేకపోతే ఏంటి నానమ్మ... వీళ్ల అమ్మనాన్న నన్ను దోషిని చేశారు.. అమ్మను అన్నారు.. నాన్నను అన్నారు.. అంటూ కోప్పాడుతాడు. రాత్రాంతా పిచ్చొళ్లాలాగా తిరిగాం.. అంటాడు రాజ్. ఈ తింగరబుచ్చినే అడుగుతున్నాను అంటూ రాజ్ కావ్యను అంటాడు. ఏం సమాధానం చెప్పవేంటి అంటూ రాజ్ అరుస్తాడు.

ఏదో మొక్కులేరా అని సీతారామయ్య కవర్ చేస్తాడు. ఇక నీ భార్యను నువ్వే ప్రేమగా ఇంటికి తీసుకువెళ్లు అని చెప్తుంది ఇందిరాదేవి. అక్కడికి ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్ట్స్ ఎపిసోడ్ లో స్వప్న మెట్ల మీద నుంచి కిందకు పడుతుంది. కావ్య పట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆమె కాలు బెనుకుతుంది. రాజ్ చూసి ఏమైంది అని అడిగితే కాలు బెనికిందని చెప్తుంది. ఇక రాజ్ కావ్య కాలును పట్టుకుని మసాజ్ చేస్తాడు. ఆమెతో ప్రేమగా ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే... రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X