పవర్ స్టార్ పాటతో శివ బాలాజీ ఎంట్రీ, రేణు దేశాయ్ షోలో టెన్షన్!
బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ నీతోనే డాన్స్ షోలో ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
Recommended Video

'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షో... తెలుగులో ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ షో టీఆర్పీ రేటింగుల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ షో తొలి సీజన్ విన్నర్‌గా నిలిచి.... తన స్టార్ ఇమేజ్ మరింత పెంచుకున్నాడు నటుడు శివ బాలాజీ.
బిగ్ బాస్ ముగిసిన తర్వాత టీఆర్పీ రేటింగులు తగ్గకుండా ఉండటానికి మాటీవీ వారు రేణు దేశాయ్ జడ్జిగా 'నీతోనే డాన్స్' అనే రియాల్టీ షోను ప్రారంభించారు. రేణు దేశాయ్, జానీ మాస్టర్, అదా శర్మ న్యాయ నిర్ణేతలుగా సాగుతున్న ఈ షోలో...... శివ బాలాజీ-మధుమిత దంపతులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.

శివ బాలాజీ ఎంట్రీతో పోటీ దారుల్లో టెన్షన్
శివ బాలాజీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నీతోనే డాన్స్ షోలో టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇందుకు సంబంధించిన ప్రోమో చూస్తే పోటీ దారులు శివ బాలాజీ ఎంట్రీ చూసి టెన్షన్ పడ్డట్లు స్పష్టమవుతోంది.

పవర్ స్టార్ పాటతో ఎంట్రీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు' సినిమాలో తమ్ముడి పాత్రలో శివ బాలాజీ నటించిన సంగతి తెలిసిందే. ‘నీతోనే డాన్స్' షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయంలో కాటమరాయుడు టైటిల్ సాంగుతో శివ బాలాజీ షోలోకి ప్రవేశించారు.

గట్టి పోటీ ఖాయం
శివ బాలాజీ, మధుమిత ఇద్దరూ సినిమా నటులే. ఇద్దరూ డాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్నవారే. ఈ నేపథ్యంలో ఈ జంట ఇతర పోటీదారులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ వారం ప్రసారం కానున్న షో
శివ బాలాజీ-మధుమిత వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన షో ఈ వీకెండ్ శని, ఆది వారాల్లో ప్రసారం కానున్న ‘నీతోనే డాన్స్' షోలో చూడొచ్చు.

అంచనాలు పెరిగాయి
బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత శివ బాలాజీ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆయన ‘నీతోనే డాన్స్' షోలో ఎంట్రీ అవ్వడంతో షోపై అంచనాలు మరింత పెరిగాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











