కౌశల్‌తో ముడిపెడుతూ గాలి వార్తలు.. చెక్ పెట్టిన శివబాలాజీ, అనుకునేస్తే ఎలా, ఏమైనా జరగొచ్చు!
బిగ్ బాస్ తొలి సీజన్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయింది. తొలి సీజన్ లో నటుడు శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఆ సమయంలో ప్రేక్షకుల నుంచి శివబాలాజీకి పెద్ద ఎత్తున మద్దత్తు లభించింది. ప్రస్తుతం జరుగుతున్న రెండవ సీజన్ లో నాని హోస్ట్. ఈ సీజన్ కూడా బాగా జోరుగా సాగుతోంది. ఇప్పటికే 50 ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. అప్పుడే ఈ సీజన్ విజేత ఎవరు అంటూ ప్రేక్షకుల్లో ఊహాగానాలు మొదలైపోయాయి.
Recommended Video


పోటాపోటీగా
బిగ్ బాస్ 2 లో ఇంటి సభ్యులు విజేతగా నిలవడం కోసం పోటా పోటీగా గేమ్ ఆడుతున్నారు. జనాల్లో ఎక్కువగా నానుతున్నది మాత్రం కౌశల్, గీతా మాధురి. వీరిద్దరూ చివరి వరకు ఉంటారా అంటే అది గ్యారెంటీ లేదు.

వైరల్ న్యూస్
కౌశల్ తో ముడిపెడుతూ బిగ్ బాస్ మాజీ విజేత శివ బాలాజీ గురించి సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. తొలి సీజన్ లో నేను కూడా కౌశల్ లాగే గేమ్ అడా, అందువలనే విజేతగా నిలిచా. ఈ సారి విజేత తప్పకుండ కౌశల్ అంటూ శివబాలాజీ స్పందించినట్లు న్యూస్ వైరల్ అవుతోంది.

గాలివార్తలకు చెక్
ఈ వార్తలపై నటుడి శివబాలాజీ స్పందించాడు. అదంతా గాలివార్తలని కొట్టిపారేశాడు. కౌశల్ పెర్ఫామెన్స్ చూసి అతడికి కౌశల్ ఆర్మీగా అభిమానులు ఏర్పడ్డారు. కౌశల్ నిజాయతీగా ఆడుతున్నాడనే ప్రశంసలు దక్కుతున్నాయి.

ఏమైనా జరగొచ్చు
కౌశల్ కు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. గీతా మాధురి, తనీష్ కూడా రేసులో ఉన్నారు. అంత మాత్రాన వీరే చివరి వరకు ఉండి విజేత అవుతారని మాత్రం అనుకోలేం. ఎందుకంటే ఏమైనా జరగొచ్చు అంటూ నాని ఇస్తున్న ట్విస్టులు అలా ఉన్నాయి.

డబుల్ ఎలిమినేషన్ అంట
గతవారం ఎలిమినేషన్ కత్తి కౌషల్ మెడపై కూడా వేలాడింది. ఈ వారం ఎలిమినేషన్ లేదని నాని చెప్పడంతో కౌశల్, సునైనా ఊపిరి పీల్చుకున్నారు. అనూహ్యంగా ఎలిమినేట్ అయిన వారిలో ఇద్దరిని తిరిగి హౌస్ లోకి పంపుతున్నారు. డబుల్ ఎంట్రీలు, డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉండవచ్చని చెప్పి ఉత్కంఠ పెంచేశాడు. ఈ లెక్కన బిగ్ బాస్ హౌస్ లో ఎవరి సీటూ పదిలం కాదని అర్థం అయిపోయింది.


Click it and Unblock the Notifications











