Bigg Boss Telugu 7: శివాజికి మరో ప్రమాదం.. అత్యవసర చికిత్సకు తరలింపు.. బిగ్ బాస్ సంచలన ప్రకటన
ప్రేక్షకుల నుంచి బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలు అన్నీంటికీ ఆదరణ లభిస్తుందని చెప్పలేం. అలాంటిది ఏదైనా కొత్త కంటెంట్‌తో రూపొందిన షో వస్తే.. అసలు అది క్లిక్ అవుతుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అస్సలు పరిచయమే లేని కంటెంట్‌తో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన షోనే బిగ్ బాస్. తెలుగులో సూపర్ సక్సెస్ అయిన ఇది.. ఇప్పుడు ఏడో సీజన్‌ను నడుపుకుంటోంది. ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీజన్‌లో తాజాగా ఓ పెను ప్రమాదం జరిగింది. దీంతో బిగ్ బాస్ సంచలన ప్రకటన చేశాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!
బిగ్ బాస్ ఏడో సీజన్‌లో సరికొత్త టాస్కులను పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే 9వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారుల కోసం 'హాల్ ఆఫ్ బాల్' అనే టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతికలను వీర సింహాలు టీమ్‌గా, అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్వినిలను గర్జించే పులులు జట్టును చేశారు.

'హాల్ ఆఫ్ బాల్' టాస్కులో భాగంగా మొదటి రోజు జరిగిన టాస్కును వీర సింహాలు టీమ్, ఆ తర్వాత జరిగిన టాస్కును గర్జించే పులులు టీమ్ గెలిచాయి. తర్వాత మరో గేమ్‌లో సైతం వీర సింహాలు టీమే గెలిచింది. దీనితో పాటు ఓ గోల్డెన్ బాల్, ఓ బ్లాక్ బాల్‌ను సైతం వాళ్లే సంపాదించారు. వీటి వల్ల వచ్చిన అడ్వాంటేజ్‌తో ఈ కెప్టెన్సీ టాస్కులో విజయాన్ని సాధించారు.
తొమ్మిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్కులో పాల్గొనే అర్హతను వీర సింహాలు టీమ్ సభ్యులు పొందారు. వీళ్లకు గతంలో ఓ సీజన్‌లో నిర్వహించినట్లుగా బీన్ బ్యాగ్ టాస్కును ఇచ్చారు. అయితే, అదిరిపోయే ట్విస్ట్ ఇస్తూ.. ఈ టాస్కులో వీర సింహాలు టీమ్ సభ్యులకు బదులుగా గర్జించే పులులు ఆడాల్సి ఉంటుందని తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ చెప్పాడు.
బిగ్ బాస్ ఆదేశం మేరకు వీర సింహాలు టీమ్ సభ్యులు బదులుగా ఈ టాస్కును గర్జించే పులులు సభ్యులైన శివాజి, అమర్‌దీప్, భోలే షావలి, అశ్విని శ్రీ, ప్రియాంక జైన్‌లు గేమ్ ఆడారు. ఇక, ఇందులో శోభా తరపున ఆడిన అమర్‌దీప్ తనలోని వైల్డ్ యాంగిల్‌ను చూపించినట్లు ప్రోమోలో కనిపించింది. ముఖ్యంగా అతడు భోలే, అశ్వినిలను బాగా టార్గెట్ చేసి విరుచుకుపడ్డాడు.

బీన్ బ్యాగ్ టాస్కులో భాగంగా అమర్‌దీప్ అగ్రెషన్‌తో ఆడడం వల్ల భోలే షావలి కింద పడిపోయాడు. అలాగే, అశ్విని కూడా దెబ్బలు తగిలాయి. దీంతో సంచాలకురాలలో ఒకరైన రతికా రోజ్ వచ్చి అతడిని వారించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఇక, అర్జున్ తరపున ఆడుతున్న శివాజి బ్యాగ్‌ను అమర్ బలవంతంగా లాక్కోవడంతో అతడికి మరోసారి గాయం అయింది.
అమర్‌దీప్ బ్యాగ్ లాగడంతో శివాజి భుజానికి మళ్లీ గాయం తిరగబెట్టింది. దీంతో బ్యాగ్‌ను అక్కడే వదిలేసి అతడు విలవిలలాడిపోయాడు. అప్పుడు టేస్టీ తేజ పరుగున వచ్చి శివాజిని పట్టుకున్నాడు. ఆ వెంటనే 'బిగ్ బాస్ మెడికల్ రూం' అంటూ అరిచాడు. దీంతో అత్యవసర చికిత్స కోసం శివాజిని వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లడం ప్రోమోలో కనిపించింది.
ఇక, ఈ టాస్కులో శివాజి గాయపడిన తర్వాత బిగ్ బాస్ 'శివాజి శారీరకంగా సిద్ధంగా లేని కారణంగా ఈ టాస్కు నుంచి తప్పుకుంటున్నారు' అని సంచలన ప్రకటన చేశాడు. దీంతో అంబటి అర్జున్ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరి శివాజి పరిస్థితి ఎలా ఉంది? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. దీంతో ఈరోజు ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది.


Click it and Unblock the Notifications











