Bigg Boss Telugu 7: గ్రాండ్ ఫినాలేకి వెళ్లేది టాప్ 5 కంటెస్టెంట్స్... మరొక ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇదే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రంజుగా సాగుతోంది. ఇక హౌస్ లో ప్రస్తుతం 7 మంది ఉన్నారు. గ్రాంఢ్ ఫినాలేకి వెళ్లేది టాప్ 6 లేదా టాప్ 7 అంటూ వార్తలు వస్తున్నాయి.. కానీ గ్రాండ్ ఫినాలేకి వెళ్లేది టాప్ 5 కంటెస్టెంట్స్ అని తెలుస్తోంది. ఉన్నది రెండు వారాలు.. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే.. నెక్ట్స్ వీక్ గ్రాంఢ్ ఫినాలే. మరి ఫినాలేకి టాప్ 6 వెళ్తారు కదా అని అంతా అనుకుంటున్నారు. ఇక్కడే బిగ్ బాస్ అసలైన ఉల్టా పుల్టా ట్విస్ట్ ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతోంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... డిసెంబర్ 17కి గ్రాండ్ ఫినాలే జరుపుకోనుంది. డిసెంబర్ 17న ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ షో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇక ఈ గ్రాండ్ ఫినాలే మరో రెండు వారాల్లో జరగనుంది. ఇప్పటికే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి ఏర్పాట్లు మొదలు పెట్టారు. గ్రాండ్ గా నిర్వహించేందుకు బిగ్ బాస్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ తెలుగు 7 హౌస్ లో ప్రస్తుతం 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్ అంబటి, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఉన్నారు. ఇక వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ గా సాగినట్లు తెలుస్తోంది. ఈ వారం అర్జున్ అంబటి తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. అర్జున్ అంబటి అయితే ఫస్ట్ ఫైనాలిస్టు అయ్యారు కాబట్టి నామినేషన్స్ లోకి రాలేకపోయారు.
ఇక ఈ వారం 6 మంది నామినేషన్స్ లో ఉండగా.. మాక్సిమమ్ ఈ వారం యావర్ ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. నామినేషన్స్ లో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక ఎలాగూ టాప్ 5లో ఉంటారు. ఇక యావర్, శోభా శెట్టి డేంజర్ జోన్లో ఉంటారు. ఇక శోభా శెట్టిని బిగ్ బాస్ సేవ్ చేసి... యావర్ ను ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక యావర్ ఎలిమినేట్ అయితే హౌస్ లో 6 మంది ఉంటారు.
టాప్ 6 గ్రాండ్ ఫినాలేకి వెళ్లనున్నారా అనేది డౌట్ రావొచ్చు. కానీ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి టాప్ 5 వెళ్లనున్నారని తెలుస్తోంది. మిడ్ వీక్ లో మరో ఎలిమినేషన్ ఉండనుందని.. అందులోంచి శోభా ఔట్ కానుందని టాక్ వినిపిస్తుంది. అలా టాప్ 5 కంటెస్టెంట్స్ శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్, ప్రియాంక గ్రాండ్ ఫినాలేకి వెళ్లనున్నారు.
ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ లో విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచే అవకాశం కనిపిస్తుంది. సామాన్యుడికి ఈసారి పట్టం కట్టేందుకు బిగ్ బాస్ అనుకుంటుందని తెలుస్తోంది. చూడాలి మరి ఇక విజేత ఎవరు కానున్నారో.


Click it and Unblock the Notifications











