శివాజీ - అనసూయ వివాదం... బిగ్‌బాస్ రన్నరప్‌ షాకింగ్ కామెంట్స్

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. శివాజీ వ్యాఖ్యలపై మహిళా నటులు, పలువురు సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో గళమెత్తారు. ఏకంగా మా అసోసియేషన్ వరకు ఈ పంచాయతీ వెళ్లడం.. ఆ వెంటనే శివాజీ తను చేసిన వ్యాఖ్యలన్ని ఉపసంహరించుకుంటూ.. మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ఆ మరుసటి రోజు శివాజీ ప్రెస్‌మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపగా.. ఆ వెంటనే యాంకర్ అనసూయ, నిధి అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్ వంటి స్టార్స్ రియాక్ట్ కావడంతో ఇది మరింత వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో శివాజీ వ్యాఖ్యలపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పే సమయంలో రెండు పదాలు తప్పుగా దొర్లాయని.. ఇవి నేను మాట్లాడి ఉండాల్సింది కాదని శివాజీ క్షమాపణలు చెప్పారు. అక్కడితో ఈ పంచాయతీ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ ఆ మరుసటి రోజు శివాజీ ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. తన 30 ఏళ్ల సినీ జీవితంలో కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ హద్దుమీరి ఎవరినీ ఒక్క మాట కూడా అనలేదని శివాజీ గుర్తుచేశారు.

Sivaji- Anasuya Bharadwaj Controversy Bigg Boss Contestant Amardeep Chowdary reaction goes viral

దండోరా ఈవెంట్ జరిగిన తర్వాత నాలో నేను కుమిలిపోయాను, 36 గంటల పాటు నిద్రపోలేదు. నేను చేసిన తప్పుకి ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇవ్వడమే కరెక్ట్ అని భావించి నేనే మీడియా ముందుకు వచ్చానని శివాజీ తెలిపారు. ఇక ఈ వివాదంలోకి అనసూయ, చిన్మయి వంటి వారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. నేను వారి పేర్లు కూడా తీయలేదని శివాజీ ప్రశ్నించారు. అయితే ఆ వెంటనే అనసూయ మరోసారి సీన్‌లోకి వచ్చారు.

శివాజీ బాధితుడిగా నటిస్తున్నారు.. ఆయన ప్రవర్తన నార్సిసిస్ట్‌లా ఉంది, దీనినే అతి తెలివి అంటారని అనసూయ వ్యాఖ్యానించారు. ఈ కాలంలోనూ మహిళల దుస్తుల గురించి మాట్లాడటం సరికాదు.. నేను కూడా హీరోయిన్‌నే, ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్‌గా చేశా.. అందుకే ఈ వివాదంలో నేను మాట్లాడానని అనసూయ క్లారిటీ ఇచ్చారు. మేం చిన్నపిల్లలం కాదు.. మమ్మల్ని వదిలేయండి.. నా పేరు ఎత్తకపోయినా హీరోయిన్లు అందరినీ ఉద్దేశించి అన్నారు కదా అని ఆమె ప్రశ్నించారు. హీరోయిన్లు నిజంగా ఇబ్బంది పడుతున్నారని మీరు అనుకుంటే అక్కడికి వచ్చే కుర్రాళ్లకే మా మీద పడొద్దని వార్నింగ్ ఇవ్వమని అనసూయ అన్నారు.

అటు ప్రెస్‌మీట్‌లో శివాజీ తన పేరును ప్రస్తావించడం, షాపింగ్ మాల్‌లో నా పరిస్ధితి చూసే మాట్లాడానని చెప్పడంతో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఆ రోజు నేనే బాధితురాలిని, అలాంటి డ్రెస్ వేసుకున్నందుకు నాకు అలా జరిగిందని తిరిగి నన్నే అంటున్నారు. బాధితురాలిని నిందితస్తూ సానుభూతిని పొందడం సరికాదని నిధి మండిపడ్డారు.

మరోవైపు.. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై వ్యాఖ్యలు, మధ్యలో అనసూయ, ఇతర సినీ ప్రముఖల వ్యాఖ్యలపై బిగ్‌బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ అమర్‌దీప్ చౌదరి స్పందించారు. ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. అన్న రాంగ్ ఇన్సెంటేషన్‌తో అయితే చెప్పలేదు. ఆయన వాడిన పదజాలంలో కొద్దిగా డిఫరెంట్‌గా ఉండొచ్చేమో కానీ మా అన్న శివాజీగారు ఇంటెన్షన్‌తో అయితే చెప్పరు. ఆయన చెప్పిన విధానం వేరు, అది జనాల్లోకి రీచ్ అయిన విధానం వేరు. కొంతమంది ముక్కుసూటిగా మాట్లాడేవారు ఉన్నారు.. ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఏదో చెప్పాలనుకున్న టైంలో ఒక హిప్ మూవ్‌మెంట్‌లో ఆ బాధలో వచ్చిన మాటలే. అయినా వాటిని వాడకూడదు. ఏం మాట్లాడాలో అన్నకి బాగా తెలుసు.. ఆయనేం చిన్నపిల్లాడు కాదు. రాజా సాబ్ ఈవెంట్‌లో జరిగిన ఘటనతో నాకు కూడా బాధ అనిపించింది. డ్రెస్సింగ్ గురించి నేను చెప్పడం లేదు, ఎవరిష్టం వాళ్లది, అది మనం చెప్పకూడదు. ఎలా ఉన్నా పద్ధతిగా ఉండి, బాగుంటే చాలు.. అందంగా కనిపిస్తే చాలు. మనం కూడా అందాన్ని చూస్తాం కదా. ఆయన చెప్పిన విధానమైతే రాంగ్ కాదు అని అమర్‌దీప్ చౌదరి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X