Bigg Boss Telugu 7: ఈ సీజన్ టైటిల్ విన్నర్ అతడేనా.. రేస్‌లో ఉన్నవాళ్లంతా ఒకేదారిలో వెళ్తున్నారుగా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ తెగ ఎగ్జైట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం నిర్వాహకులు. ఇప్పటికే 12 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో మరికొన్ని రోజుల్లోనే పూర్తి కాబోతుంది. అయితే రోజురోజుకూ విన్నర్ గా ఎవరు నిలుస్తారని తెలుకునేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈక్రమంలోనే రాత్రి 9 అయిందంటే చాలు టీవీల ముందు వాలిపోతున్నారు. అయితే ఈ సీజన్ విన్నర్ లుగా నిలిచే వాళ్లలో ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి.
మొన్నటి వరకు విన్నర్ గా శివాజి నిలుస్తాడని అంతా అనుకున్నారు. అలాగే రన్నరప్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఉంటాడని భావించారు. కానీ అమర్ దీప్ ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి తన గేమ్ స్ట్రాటెజీ మార్చాడు. ముఖ్యంగా కెప్టెన్సీ కోసం విపరీతంగా ట్రై చేస్తూ అందరి కళ్లల్లో పడ్డాడు. కెప్టెన్ కాకపోతే ప్రాణం పోతుందేమే అనే విధంగా ట్రై చేసి.. ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశాడు. సింపథీ గేమ్ ఆడుతున్నాడు. తాజాగా కెప్టెన్ కాకపోయే సరికి మరింతగా ఏడ్చి... మరింత మంది అభిమానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం టైటిల్ రేసులోకి చేరిపోయి శివాజికి పోటీగా నిలుస్తున్నాడు.

అయితే ఓవైపు అమర్ దీప్, మరోవైపు శివాజిలు ఒకరికొకరు గట్టి పోటీని ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఒకరు ఏడుస్తూ సింపథీ గేమ్ కోసం ట్రై చేస్తుంటే మరొకరు.. చేతి నొప్పి అంటూ మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. చేతి నొప్పి అని చెప్పడం మాత్రమే కాదండోయ్.. అంతకు మించిన స్ట్రాటెజీ ప్లే చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న కెప్టెన్సీ టాస్క్ లో అమర్ దీప్ పై ఉన్న కోపాన్ని కనిపించకుండా చాలా బాగా కవర్ చేసుకున్నారు. అంబటి అర్జున్ భార్య కడుపుతో ఉందని.. ఆమె అతడు రెండోసారి కెప్టెన్ అయితే చూడాలని ఉందని గేమ్ ప్లే చేశాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా.. తాను చేయాలనుకున్నవి చేస్తూ వెళ్లిపోతున్నాడు.
మరోవైపు అమర్ దీప్ మాత్రం విపరీతంగా ఏడుస్తూ... విన్నర్ గా నిలిచేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున సైతం గుర్తు చేశారు. కావాలనే సింపథీ కోసమే ఇంతలా ఏడుస్తున్నావా అంటూ ప్రశ్నించారు. అందుకు అమర్ దీప్ కాదని చెప్పే ప్రయత్నం చేశాడు కానీ వాస్తవానికి అక్కడ జరిగింది అదే. కెప్టెన్ కావాలని అంతగా ఏడ్చిన ఆయన శనివారం మాత్రం ఫుల్ జోష్ తో ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే అటు అమర్ దీప్, ఇటు శివాజీ ఇద్దరూ కావాలనే డ్రామా చేస్తున్నట్లు అర్థం అయిపోతుంది.

వీరిద్దరే కాకుండా టైటిల్ రేస్ లో ఉన్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా సింపథీ గేమ్ యే ఆడుతున్నాడు. ముందు నుంచి రైతుబిడ్డను నడిపిస్తున్నది అదే. ఈ ముగ్గురూ కచ్చితంగా టాప్ 3లో ఉంటారనే విషయం ఇప్పటికే అందరికీ తెలిసిందే. మరి ఈ సీజన్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో తెలియాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఎవరు ఎక్కువ సింపథీ పొంది విజేతగా నిలవనున్నారో.


Click it and Unblock the Notifications











