Bigg Boss Telugu 7: బిగ్ షాక్... హౌజ్ నుంచి పెద్దాయన ఔట్... ఇంకా ఎవరు ఎలిమినేట్ కానున్నారంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు బిగ్ బాస్ రెడీ అయిపోయాడు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది ఆసక్తిగా మారింది. నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఓ బిగ్ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఓ కంటెస్టెంట్ తో పాటు.. పెద్దాయన కూడా ఎలిమినేట్ కానున్నారట. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయి 12 వారాలు అవుతుంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హౌస లో 10 కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో నామినేషన్స్ లో ఉన్నది 8 మంది కంటెస్టెంట్స్. శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్, అశ్విని శ్రీ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో అశ్విని సెల్ఫ్ నామినేషన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Sivaji and Ashwini Eliminated From Bigg Boss Telugu 7 Show 12th Week

ఇక ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ 8 మంది కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ కానున్నారు.. అందులోనూ నాగార్జున గత వారమే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హింట్ ఇచ్చి వెళ్లి పోయారు. అయితే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే.. నలుగురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్, అశ్విని శ్రీ ఎలిమినేషన్ కు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో పక్కగా అశ్విని శ్రీ ఎలిమినేట్ కానుందని ఓటింగ్ వివరాలు చూస్తే అర్థం అవుతుంది.

అశ్విని శ్రీకి తక్కువ ఓట్లు పడ్డాయి. ఇక ఈ వారం ఈమె ఎలిమినేషన్ పక్కా అని బిగ్ బాస్ వర్గాల సమాచారం. మరోవైపు ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ వారం శివాజీ కూడా ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. ఆయనకు మళ్లీ హ్యాండ్ పెయిన్ వచ్చిందని అంటున్నారు.. ఆ ఎఫెక్ట్ వల్ల శివాజీ వెళ్లి పోతాను అని చెప్తున్నారట. దీంతో ఈ వారం శివాజీ ఎలిమినేట్ అవుతారని టాక్ వినిపిస్తుంది.

Sivaji and Ashwini Eliminated From Bigg Boss Telugu 7 Show 12th Week

అయితే శివాజీకి రోజు రోజుకు నెగిటివిటీ పెరిగిపోతుంది.. అమర్ పై ఉన్న ద్వేషాన్ని చూపిస్తూ.. జనాల్లో నెగిటివిటీ పెరిగింది శివాజీకి. అయితే ఈ వారం నాగార్జున.. శివాజీ వెళ్లిపోతా అంటే.. అంగీకరించవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే.. ఆయనకు ఉన్న నెగిటివిటీతో బయటకు వెళ్లిపోతే.. హౌస్ లో ఉన్నది యావర్, ప్రశాంత్, అమర్ .. వీరి ముగ్గురులో ఒకరు టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది.

Sivaji and Ashwini Eliminated From Bigg Boss Telugu 7 Show 12th Week

మరోవైపు హ్యాండ్ పెయిన్ అని శివాజీ పీఆర్ టీమ్స్ ఆడుతున్న డ్రామా అని టాక్ వినిపిస్తుంది. అలా చేస్తే.. సింపతీ గెయిన్ అయి ఓట్లు పడే ఛాన్స్ ఉందని సోషళ్ మీడియాలో వైరల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.. శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ అయిపోతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక పూర్తి అప్డేట్స్ కోసం ఫిల్మీ బీట్ సైట్ ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X