Bigg Boss Telugu 7: గౌతమ్, శివాజిల హాట్ వార్.. మైక్ పడేసి మెయిన్ డోర్ తీయాలంటూ డాక్టర్ బాబు రచ్చ!
Sivaji Gautam Krishna Fight: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ వారం హౌస్ మేట్ల కుటుంబ సభ్యులు ఇంట్లోకి రావడంతో ఫుల్ ఎమోషనల్ గా సాగింది. సోమవారం నుంచి ఈరోజుటి వరకు ఇంట్లోని ప్రతీ కంటెస్టెంటుకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ రాగా.. ఓ గిఫ్టును కూడా తీసుకొచ్చారు. దీంతో ఫుల్ బూస్ట్ అయిన కంటెస్టెంట్లు మరింత బాగా ఆడతారని అంతా అనుకున్నారు. అయితే ఈరోజు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తండ్రి, రతికా రోజ్ తండ్రి రాబోతున్నట్లు ఇప్పటి వరకు విడుదల అయిన రెండు ప్రోమోల ద్వారా తెలిసింది. అయితే తాజాగా బిగ్ బాస్ వదిలిన మూడో ప్రోమో చూస్తుంటే మాత్రం గుస్ బంప్స్ వస్తున్నాయి.
అందుకూ ఓ కారణం ఉంది లెండి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిపోయిన ఇల్లు ఇప్పుడు రణరంగంగా మారింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కే ఇందుకు కారణం. కెప్టెన్సీ టాస్కులో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు.. ఓ బేబీ అనే టాస్కును ఇచ్చాడు. ఈ టాస్కులో భాగంగానే.. బేబీ సౌండ్ మోగిన ప్రతీసారి ఓ బేబీని తీసుకొని బేబీ కేర్ సెంటర్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. చివరగా వచ్చిన వారు ఔట్ అయినట్లు లెక్క. అయితే అమర్ దీప్ కు సంబంధించిన బేబీని గౌతమ్ కృష్ణ తీసుకున్నాడు. దాన్ని ఆరోపిస్తూ.. అమర్ దీప్ అధి తప్పని చెప్పాడు.

అయితే మార్చుకుందాం రారా అని పిలవగా.. శోభా శెట్టి తాను అందుకు అంగీకరించను అని చెప్పింది. దీంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఈక్రమంలోనే నా మీద హర్ట్ అయితే నా గేమ్ ఆపెయరా అంటూ గౌతమ్ కృష్ణ చెప్పాడు. కావాలనే నిల్చున్న నిన్ను నేను కన్సిడర్ చేయనని శోభా చెప్పింది. తీసుకున్న వాళ్లు లోపలికి వెళ్లిపోతారు మిగిలిన వాళ్లు ఆగిపోతారు ఇదేరా గేమ్ అంటూ అమర్ దీప్ వివరించాడు. అయితే యావర్ డబుల్ క్రాస్ అంటూ చెప్పాడు. ఈక్రమంలోనే అమర్ దీప్ మరోసారి కెప్టెన్ అయిన నీకే అంత ఉంటే.. నాకెంత ఉండాలి అని అంటాడు.
ఆ తర్వాత వెంటనే శివాజి ఫైర్ అయ్యాడు. చాలా సార్లు చెప్పాను నేను నీకు.. ఊరికే గొడవ పెట్టుకుంటే ఎవరూ యాక్సెప్ట్ చేయరు అని అన్నారు. దీనికి హర్ట్ అయిన గౌతమ్ కృష్ణ నోరు పెంచి మరీ నాకు అన్యాయం జరిగితే నేను అరుస్తాను అమన్నా అని చెప్పాడు. అరువు.. నేను అరువలేనా అంటూ శివాజి మరింత బరస్ట్ అయ్యాడు. ప్రతీదానికి ఇలా అరిస్తే ఎలా అంటూ గౌతమ్ అనగా.. ఏంది రా నువ్వు ఉండేది అంటూ శివాజి మరింత కోప్పడ్డాడు. బిగ్ బాస్ మీరు మాట్లాడుకోండి మీరే సెకండ్ బిగ్ బాస్ అనుకుంటా అంటూ గౌతమ్ అన్నాడు.
ఇందకు స్పందించిన శివాజి.. ఇలాగే లాస్ట్ టైమ్ అన్నావు ఏమైందో చూశావు కదా అన్నాడు. దానికి గౌతమ్ తిట్టనీ అన్న తిట్టనీ, నరికేయని అంటూ కేకలు వేశాడు. ఇది నా ఆటిట్యూడ్ అన్నా అంటూ మరోసారి గౌతమ్ కృష్ణ అనగా.. శివాజి అతడి మీదకు వెళ్లి మరీ అరిచాడు. చివర్లో తన కామన్ డైలాగ్ ఉపయోగించాడు శివాజి. నువ్వు కేవలం అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావని నాకు తెల్సంటూ శివాజి అనగా... మైక్ తీసి పడేసిన గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ డోర్ తీయండి నేను వెళ్లిపోతాను అంటూ కామెంట్లు చేశాడు. ఆవేశంగా మెయిన్ గేట్ వద్దకు వెళ్లిన అతడు ఎవరు ఆపుతున్నా ఆగకుండా.. డోర్ తీయాలంటూ పదే పదే తలుపులు తట్టాడు. మరి ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజుటి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











