Bigg Boss 7 Telugu: షోలో మరో వివాదం.. దాన్ని అంటూ అమర్ నోటి దురుసు.. యావర్‌పై శివాజి సంచలన వ్యాఖ్యలు

అసలేమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును.. ఆదరణను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అంతేకాదు, ఏకంగా దేశంలోనే నెంబర్ వన్ షోగానూ పేరు సంపాదించుకుంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక, ఇప్పుడు జరుగుతున్న ఏడో సీజన్ మరింత ఆసక్తిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎపిసోడ్‌లో రచ్చ జరిగింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

ఏడో సీజన్ ఐదో వారంలో మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కును తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న పది మందిని ఐదు జంటలుగా మారాలని సూచించాడు. అందుకు తగ్గట్లే అమర్‌దీప్ - సందీప్, ప్రియాంక - శోభ, ప్రిన్స్ - తేజ, శివాజి - ప్రశాంత్, గౌతమ్ - శుభశ్రీ జంటలుగా మారారు. వీళ్లకు మొదటి రౌండ్‌లో భాగంగా బిగ్ బాస్ స్మైలీ బోర్డ్ సెటప్‌ టాస్కును ఇచ్చాడు.

Sivaji and Other Housemates Argument with Prince Yawar in Bigg Boss Show

మంగళవారం రాత్రి ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ఈ టాస్కులో ముందుగా గంట కొట్టిన శివాజి టీమ్, అమర్‌ టీమ్ ఫౌల్ గేమ్ ఆడారాని సంచాలకులు అయిన శోభా శెట్టి, యావర్ గుర్తించారు. దీంతో ఈ రెండు టీమ్‌లను డిస్‌క్వాలిఫై చేయాలని అనుకున్నారు. దీంతో కొన్ని గొడవలు జరిగాయి. చివరికి గౌతమ్ - శుభశ్రీ టీమ్‌ను ఇందులో విన్నర్ అని సంచాలకులు ప్రకటించారు.

సంచాలకులు ప్రిన్స్ యావర్, శోభా శెట్టి తీసుకున్న నిర్ణయంపై అందరూ వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన నేటి ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ప్రియాంక ఈ నిర్ణయానికి ఒప్పుకోనని అందరి ముందే తేల్చేసింది. ఆ తర్వాత అందరూ యావర్‌ ఒక్కడే ఈ నిర్ణయం తీసుకున్నాడని అతడిని టార్గెట్ చేశారు. అందుకు తగ్గట్లే శుభశ్రీతో అతడు మాట్లాడిన మాటలపై శివాజి అభ్యంతరం వ్యక్తం చేశాడు.

అనంతరం శివాజి అక్కడి నుంచి వెళ్లిపోతూ.. 'నాకు ఒకటి అర్థం అయింది యావర్. నీకు ప్రశాంత్ అంటే ఇష్టం ఉండదు' అని ఆరోపించాడు. దీంతో అతడు 'సార్ అది చాలా తప్పు సార్. అలా ఏమీ లేదు' అంటూ పదే పదే వివరణ ఇచ్చాడు. అనంతరం యావర్‌ సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాడని సీరియల్ బ్యాచ్‌తో కలిసి ప్రశాంత్ కూడా అనడం ప్రోమోలో కనిపించింది.

Sivaji and Other Housemates Argument with Prince Yawar in Bigg Boss Show

ఇక, ఇదే ప్రోమోలో అమర్‌దీప్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 'ఇదెక్కడి డెసీషన్‌రా. వాడు యావర్ గాడు.. దానికి (శుభశ్రీ) ఫేవర్ చేయాలని చెప్పి మొత్తం చేశాడు. ఇదిరా ఫేవరిజం అంటే' అంటూ నోరు పారేసుకున్నాడు. ఈ రచ్చ ఇలా సాగడంతో అటు శోభా శెట్టి, ఇటు యావర్ కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో చివర్లో శివాజి వెళ్లి అతడిని హగ్ చేసుకుని ఓదార్చాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్‌లో ఆట కూడా మరింత రసవత్తరంగా సాగనున్నట్లు ఈ ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X