Bigg Boss 7 Telugu: ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఆ టీమ్‌లు ఎలిమినేట్.. శివాజికి ముందే తెలుస్తుందా?
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. ఇండియా వ్యాప్తంగా భారీ స్పందనను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ అయింది బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులో ఇది మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను దక్కించుకుని సత్తా చాటుతోంది. ఫలితంగా ఈ రియాలిటీ సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో దాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కొన్ని టీమ్‌లకు షాక్ ఇచ్చాడు. ఇక, ఇందులో శివాజి బ్యాచ్ సత్తా చాటింది. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ ఏడో సీజన్‌లో మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కును తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న పది మందిలో అమర్‌దీప్ - సందీప్, ప్రియాంక - శోభ, ప్రిన్స్ - తేజ, శివాజి - ప్రశాంత్, గౌతమ్ - శుభశ్రీ జంటలుగా మారారు. ఇక, వీళ్లకు పలు రౌండ్లలో టాస్కులు ఇస్తున్నారు. మొదటి దానిలో గౌతమ్ - శుభశ్రీ జంట గెలిచి మూడు స్టార్లను కైవశం చేసుకుంది.

కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు రెండో రౌండ్‌లో 'దొరికితే దొంగ-దొరక్కపోతే దొర' అనే గేమ్ పెట్టాడు. ఇందులో యాక్టివిటీ ఏరియాలో నిద్రిస్తున్న బిగ్ బాస్ ఫ్రెండ్‌ను ఏమార్చి తన వస్తువులను తీసుకు రావాలని చెప్పాడు. ఇది రెండు రౌండ్లు జరగ్గా.. శివాజి టీమ్ తెలివిగా ఆడి బిగ్ బాస్ చెప్పిన వస్తువులే తెచ్చింది. మిగిలిన వాళ్లు ఓవర్ థింక్ చేసి ఏది పడితే అది తీసుకొచ్చారు.
ఈ టాస్కు మొత్తం చూసిన తర్వాత బిగ్ బాస్ అందరినీ నిలబెట్టి కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 'బిగ్ బాస్ చెప్పిన వస్తువులు కాకుండా.. అక్కడున్న వాటిని తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ టాస్కులో మార్పులు చేసి తక్కువ వస్తువులు తెచ్చిన వారే విజేత అవుతారు' అని చెప్పాడు. అందుకు అనుగుణంగానే అతి తక్కువ వస్తువులు తెచ్చిన శివాజి - ప్రశాంత్ టీమ్ ఇందులో గెలిచింది. ఇక, ఈ టాస్క్ చూసిన వాళ్లంతా శివాజికి ముందే తెలిసిపోతుందా అని ఆశ్చర్యపోతున్నారు.

ఆ తర్వాత మూడో రౌండ్‌లో భాగంగా 'జ్యూస్ పిండు' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఒక టీమ్ సభ్యుడు బత్తాయి పల్లను విసరగా.. వాటిని మరో సభ్యుడు తన తలపై పెట్టుకున్న బాస్కెట్‌లో పడేలా చూడాలి. ఆ తర్వాత వాటిని పిండేసి జ్యూస్ చేయాలి. ఇలా టాస్క్ ముగిసే సమయానికి ఎవరు ఎక్కువగా జ్యూస్ తీస్తారో వాళ్లే గెలుస్తారు. ఇందులో యావర్ టీమ్ విజయం సాధించింది. దీంతో వీళ్లకు మూడు స్టార్లు లభించాయి.
బుధవారం ఎపిసోడ్ ముగిసే సమయానికి కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో మూడు రౌండ్లు పూర్తి అయ్యాయి. ఇక, ఇందులో శివాజి టీమ్ ఐదు స్టార్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. అలాగే, అమర్, గౌతమ్ టీమ్‌లకు నాలుగేసి స్టార్లు వచ్చి రెండో స్థానంలో ఉన్నాయి. యావర్ టీమ్ మూడు స్టార్లతో మూడో స్థానంలో, శోభా శెట్టి టీమ్ రెండు స్టార్లతో చివరి స్థానంలో నిలిచాయి.

ఇక, బుధవారం ఎపిసోడ్‌లో జరిగిన టాస్కులను పరిశీలిస్తే.. రెండో రౌండ్‌లో శివాజి మొదటి నుంచీ క్లారిటీగానే ఆడాడు. ప్రశాంత్‌తో కూడా బిగ్ బాస్ చెప్పిన వస్తువులే తీసుకుని రా అన్నాడు. దీంతో అతడి ఆటతీరును అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక, మొదటి రెండు రౌండ్లలో ఓడిన యావర్ టీమ్ కూడా మూడో రౌండ్‌లో గెలిచి రేసులోకి వచ్చింది. దీంతో వీళ్ల ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











