Bigg Boss Telugu 7: టాప్ 3 కంటెస్టెంట్ అతడేనట.. ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసిన శివాజి, యావర్.. ముందే టాప్ 5

బిగ్ బ్రదన్ అనే ఇంగ్లీష్ షోను ఇండియాలోనూ ప్రారంభించిన అద్భుతమైన రెస్పాన్స్ ను రాబట్టుకుంటున్నారు. అనేక భాషల్లో వస్తున్న ఈ షో తెలుగులోనూ వస్తోంది. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఎవరూ ఊహించని స్థాయిలో దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా గతంలో ఏ సీజన్ లోనూ లేని విధంగా వచ్చిన ఈ సీజన్.. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో అందరినీ మరింతగా అలరిస్తోంది. ఇప్పటికే 14 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 15వ వారంలో కొనసాగుతోంది. ముఖ్యంగా మరో మూడు రోజుల్లో ఈ షో ముగిసిపోతుంది. ఈక్రమంలోనే బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

15వ వారంలో భాగంగా టాప్ 6 కంటెంస్టెంట్ల జర్నీ వీడియోలు ప్లే చేసిన బిగ్ బాస్ తాజాగా... అదిరిపోయే టాస్క్ లు ఇస్తున్నారు. ఈరోజు విడుదల అయిన ప్రోమోలో కంటెస్టెంట్లకు టాస్క్ లు ఇస్తూ అందులో గెలిచిన వారికి తమ ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక ఇప్పుడే విడుదల అయిన ప్రోమో చూస్తుంటే మరో ఫన్నీ టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టాప్ 6 కంటెస్టెంట్లకు ఓ గెస్ చేయాలని సూచించారు బిగ్ బాస్. మొత్తం 60 నిమిషాల ఎపిసోడ్ లో ఎవరు ఎంత సేపు కనిపిస్తున్నారో గెస్ చేయాలని అన్నారు.

Sivaji And Price Yawar Guessed Bigg Boss Telugu 7 Top 3 Contestant in Amardeep

ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా విభిన్నంగా వాళ్లు స్క్రీన్ మీద కనిపించే సమయాన్ని గెస్ చేశారు. ముఖ్యంగా ముందుగా లేచిన అంబటి అర్జున్ తనకు తాను 10 నిమిషాల కార్డును మెడలో వేసుకున్నాడు. తాను స్క్రీన్ పై కనీసం 10 నిమిషాలు అయినా కనిపించాలని అనుకుంటున్నట్ల చెప్పాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రియాంక జైన్ శివాజికి 20 నిమిషాలు ఇచ్చింది. మీరు ప్రతీ రోజూ 20 నిమిషాలు కనిపిస్తున్నారని నేను అనుకుంటున్నానని తెలిపింది. అలాగే అర్జున్ కు మూడు నిమిషాలు, యావర్ కు ఐదు నిమిషాలు ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె వెళ్లి కూర్చోగా.. అమర్ దీప్ లేచి నిలబడ్డాడు.

వెంటనే ప్రియాంక జైన్ కు 7 నిమిషాలు, పల్లవి ప్రశాంత్ కు 5 నిమిషాలు ఇచ్చాడు. దిస్ ఈజ్ మై అసెంప్షన్... ఇలా ఉంటుందేమో అని అనుకుంటున్నానని తెలిపాడు. ఇక ఆ తర్వాత ప్రిన్స్ యావర్ అమర్ దీప్ కు మూడు నిమిషాలు మాత్రమే కనిపిస్తావంటూ ఆయన మెడలో ఆ ట్యాగ్ వేశారు. ఈయన తర్వాత వెంటనే లేచి నిలబడ్డ శివాజి కూడా అమర్ దీప్ ఓ మూడు నిమిషాలు కనిపిస్తాడని చెప్పాడు. ఆ ట్యాగ్ ను కూడా ఆయన మెడలో వేసేశాడు. ఇది ఎపిసోడ్ లో కనిపించే టైమ్ ఫిక్స్ చేయమని చెప్పిన టాస్క్ యే అయినప్పటికీ... శివాజి, యావర్ లు అమర్ దీప్ స్థానాన్ని చెప్పారని నెట్టింట చర్చ సాగుతోంది.

Sivaji And Price Yawar Guessed Bigg Boss Telugu 7 Top 3 Contestant in Amardeep

ముఖ్యంగా ఇద్దరూ ఒకేలా 3 మినిట్స్ ఇవ్వడం చూస్తుంటే.. ఆయనే టాప్ 3లో ఉంటాడని, అందుకే అలా ఇచ్చారని అనుకుంటున్నారు. ఓటింగ్ పరంగా చూసుకున్న అమర్ దీప్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ టాప్ 1లో ఉండగా, శివాజి టాప్ 2లో ఉన్నాడు. ఇక మూడులో అమర్ దీప్, నాలుగులో ప్రిన్స్ యావర్ ఉండగా... ఐదో స్థానంలో ప్రియాంక జైన్ ఉంది. చూడాలి మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవర్ని ఎలిమినేట్ చేసి టాప్ 5లో ఎవరిని ఉంచబోతున్నారనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X