Bigg Boss Telugu 7: ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే శివాజీ ది బాస్.. ఇదిగో ఫ్రూఫ్!
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రారంభం అయి 60 రోజులు అవుతుంది. ఇక మరో 40 రోజుల్లో ఈ ఆట ముగియనుంది. ఇక గత 60 రోజుల నుంచి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ షోకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక బిగ్ బాస్ చూసే వారికి శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన మైండ్ గేమ్ తో బిగ్ బాస్ హౌస్ లో ఒంటి చేత్తో ఆట ఆడిస్తున్నాడు. ఇక అమర్ కు శివాజీకి పడదు అనే సంగతి తెలిసిందే. మరి అమర్ పై శివాజీ ప్రసంశలు కురిపించాడు శివాజీ. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. షో ప్రారంభం అయి 60 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఈ షోలో మొదటి విడుతలో 14 మంది ఎంటర్ అవ్వగా.. రెండో విడుతలో 5 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ప్రస్తుతం హౌస్ లో మాత్రం 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

ప్రస్తుతం హౌస్ లో ఉన్నది శివాజీ, యావర్, ప్రశాంత్, టేస్టీ తేజ, గౌతమ్, బోలే షవాలి, అశ్విని శ్రీ, శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక జైన్, రతికా రోజ్. ఇక వీరు తమదైన శైలితో ఆటను ముందుకు తీసుకుపోతున్నారు. అయితే షోలో మొదటి నుంచి రెండు టీములు ఫామ్ అయ్యాయని ప్రేక్షక్షులకు తెలిసిందే. అందులో ఒకటి శివాజీ టీమ్, రెండోది సీరియల్ టీమ్.
ఇక ఈ టీముల్లో భాగంగా శివాజీ.. అమర్ దీప్ ను ఎప్పుడూ తప్పుబడుతూ ఉంటాడనే టాక్ ఉంది. వీళ్లకు పాయింట్స్ వచ్చినా కూడా చాలా సార్లు కన్నింగ్ గేమ్ ఆడి.. ప్రశాంత్, యావర్ లను గెలిపించాడని నెటిజన్స్ అంటున్నారు. ఛాన్స్ దొరికితే చాలు శివాజీ చాలా సార్లు అమర్ ను కించపరిచేలా మాట్లాడాడు. చాలా సార్లు అమర్ గురించి తప్పుగా మాట్లాడాడు కూడా. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట సైతం వైరల్ అయ్యాయి.
ఓసారి షోలోనే అమర్ దీప్ చెత్త వెస్ట్ పర్సన్... ఈ హౌస్ లో అనర్హుడు అంటే వీడే అంటూ కామెంట్స్ చేశాడు. అంతే కాదు.. తన పిల్లలకు నీలా మాత్రం ఉండకూడదు అని చెప్తాను అంటూ శివాజీ అమర్ దీప్ తో అన్నాడు. ఇది కూడా అప్పట్లో వైరల్ అయింది. అయితే అమర్ వర్సెస్ శివాజీ అన్నట్లుగా ఉండేది.
అయితే ఈరోజు ఎపిసోడ్ లో శివాజీ అమర్ దీప్ ను మెచ్చుకున్నాడు అని తెలుస్తోంది. బాగా ఆడావ్ రా... మనం గెలిచామ్ అని శివాజీ వెళ్లి.. అమర్ దీప్ ను హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదలైన ప్రోమోలో కూడా శివాజీ అమర్ దీప్ ను హగ్ చేసుకున్నట్లు చూపించారు. దీనితో ఇది నిజమని తెలుస్తోంది.
ఇక అమర్ దీప్ కూడా టాప్ 5లో ఉంటాడు కచ్చింతంగా అంటున్నారు నెటిజన్స్. మరోవైపు ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడా తగ్గాలో కూడా నేర్చుకున్నాడు అంటూ శివాజీని మెచ్చుకుంటున్నారు నెటిజన్స్. అమర్ తో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. టాస్కులో గెలిచినప్పుడు అభిందించడం గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











