Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్‌లో షాకింగ్ సీన్.. ఊహించని పని చేసిన శివాజి.. ఏడ్చేసిన కంటెస్టెంట్
బుల్లితెరపై ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా హవాను చూపిస్తోంది బిగ్ బాస్. ఎన్నో సంచనాలను సృష్టిస్తూ సాగిపోతోన్న ఇది.. సీజన్ల మీద సీజన్లను కంప్లీట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని నిర్వహకులు మొదలు పెట్టారు. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తున్న ఈ సీజన్‌లో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. దీంతో ప్రేక్షకులకు కావాల్సినంత మజా అందుతోంది. ఈ నేపథ్యంలో టైటిల్ ఫేవరెట్ శివాజి ఓ ఊహించని పని చేశాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
ఉల్టా పుల్టాగా సాగుతోన్న ఏడో సీజన్‌లో సరికొత్త టాస్కులను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే 9వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారుల కోసం 'హాల్ ఆఫ్ బాల్' అనే టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతికలను వీర సింహాలు టీమ్‌గా, అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్వినిలను గర్జించే పులులుగా మార్చారు.

ఈ టాస్కులో భాగంగా బిగ్ బాస్ పంపే బాల్స్‌ను దాచుకోవడంతో పాటు మధ్యలో కొన్ని గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదటి రౌండ్‌లో వీర సింహాలు టీమ్ గెలిచి.. గర్జించే పులుల టీమ్‌లోని ప్రశాంత్‌ను టాస్కు నుంచి ఎలిమినేట్ చేసేసింది. తాజా ఎపిసోడ్‌లో జరిగిన టాస్కులో కూడా ఈ రెండు జట్ల మధ్య మరో ఆసక్తికరమైన గేమ్‌ను పెట్టారు.
తాజా ఎపిసోడ్‌లో పెట్టిన గేమ్ కోసం వీర సింహాలు టీమ్ నుంచి శోభా శెట్టి, గౌతమ్.. గర్జించే పులుల జట్టు నుంచి అమర్‌దీప్ చౌదరి, అంబటి అర్జున్ వచ్చారు. ఇందులో భాగంగా ఒకరు సుత్తిని అసెంబుల్ చేసి పక్కన ఉన్న టైల్స్‌ను పగలగొట్టాలి. వాటి కింద ఉన్న సంచిని తీసుకెళ్లి సహచరుడికి ఇస్తే.. వాళ్లు కొన్ని కర్రలను హోల్స్‌లో సెట్ అయ్యేలా చేయాల్సి ఉంటుంది.
ఈ టాస్కులో భాగంగా అర్జున్ ముందుగా టైల్స్ పగలగొట్టి అమర్‌దీప్ చౌదరికి సంచిని అందించాడు. అతడు శోభా శెట్టి కంటే ముందుగానే కర్రలను ఆ హోల్స్‌లో పడేలా చేశాడు. ఆ వెంటనే గంటను మోగించి విజయం సాధించాడు. దీంతో టీమ్ కెప్టెన్ శివాజి వచ్చి అమర్‌దీప్ చౌదరిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. అంతేకాదు, సూపర్‌గా ఆడావంటూ ప్రశంసలు కురిపించాడు.

తనను ఎప్పుడూ ఆడడం లేదు అంటూ విమర్శించే శివాజి వచ్చి అభినందించే సరికి అమర్‌దీప్ చౌదరి తట్టుకోలేకపోయాడు. అలాగే, ఆయనను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఈ సీన్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గతంలో అమర్‌దీప్ 'మీరే నన్ను సూపర్‌గా ఆడావురా అని అభినందించే రోజు వస్తుంది' అంటూ శివాజితో ఛాలెంజ్ చేశాడు.
గతంలో చేసిన ఛాలెంజ్‌కు అనుగుణంగానే అమర్‌దీప్ చౌదరి తాజా టాస్కులో ఆడి విజయం సాధించాడు. అదే సమయంలో శివాజి నుంచి అభినందనలు అందుకున్నాడు. ఇక, ఈ టాస్కులో గెలిచిన శివాజి టీమ్‌కు ప్రత్యర్థి టీమ్ నుంచి ఒకరిని తీసేయడం లేదా వాళ్ల నుంచి 500 బాల్స్ తీసుకోవడం అనే ఆప్షన్లు బిగ్ బాస్ ఇచ్చాడు. ఇందులో వాళ్లు రెండోది సెలెక్ట్ చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











