Bigg Boss Telugu 7: శివాజి ఇమేజ్ డ్యామేజ్.. అమర్ దెబ్బతో టైటిల్ గోవిందా.. నరాలు కట్ అయ్యే ట్విస్ట్

మునుపెన్నడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అవుతూ.. తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇక్కడి ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని కంటెంట్‌తో రూపొందినప్పటికీ.. ఆకట్టుకునే అంశాలను జోడించి షో నిర్వహకులు సక్సెస్ అయ్యారు.

అందుకే ఇది వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఏడో దాన్ని మొదలెట్టారు. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. తాజా ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్టులు కనిపించాయి. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

Sivaji Backstab to Amardeep.. Bigg Boss Gives Shock in Captaincy Task

చివరి దానిలో అందరికీ: బిగ్ బాస్ 12వ వారంలో జరిగిన మ్యాన్షన్ టాస్క్ ఏమంత ఆసక్తికరంగా సాగలేదు. దీంతో కెప్టెన్సీ టాస్కును రంజుగా మార్చాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు. అంతేకాదు, ఇదే ఈ సీజన్‌కు చివరి కెప్టెన్సీ టాస్క్ అని కూడా చెప్పాడు. అందుకే ఇందులో ఇంట్లోని కంటెస్టెంట్లు అందరూ పోటీదారులు అని బిగ్ బాస్ వివరించాడు. దీంతో సపోర్టు కోసం అందరూ ప్రయత్నాలు చేశారు.

మెషిన్ గన్‌తో కొత్త టాస్క్: ఏడో సీజన్‌లో చివరి కెప్టెన్సీ టాస్కు కోసం బిగ్ బాస్ మెషీన్ గన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా గన్ సౌండ్ వచ్చినప్పుడు ఇద్దరు కంటెస్టెంట్లు వెళ్లి.. బోర్డు వెనుక ఉన్న ఫొటోలను రివీల్ చేయాలి. అందులో ఎవరిని కెప్టెన్ చేయాలి? ఎవరిని ఎలిమినేట్ చేయాలి? అన్నది ఏకాభిప్రాయంతో డిసైడ్ చేయాలి. ఆ తర్వాత తీసేసే వాళ్లను ఆ మెషీన్ గన్‌తో కాల్చేయాల్సి ఉంటుంది.

అమర్‌, అర్జున్ మధ్యలో: ఈ కెప్టెన్సీ టాస్కులో ముందుగా ప్రియాంక, గౌతమ్ వచ్చి శోభా శెట్టిని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత శోభా, ప్రశాంత్ వచ్చి అశ్వినిని ఔట్ చేశారు. అనంతరం యావర్, రతిక వచ్చి ప్రశాంత్‌ను తీసేశారు. ఆ వెంటనే శివాజి, అశ్విని వచ్చి యావర్‌ను ఔట్ చేశారు. అనంతరం అర్జున్, అమర్ వచ్చి ప్రియాంకను తీశారు. తర్వాత గౌతమ్, రతిక, శివాజిలు కూడా ఎలిమినేట్ అయ్యారు.

అమర్ ఏడుపుతో రచ్చ: వరుసగా అందరూ ఎలిమినేట్ అవడంతో అర్జున్ - అమర్‌దీప్ కెప్టెన్సీ పోటీదారుల రేసులో నిలిచారు. అప్పుడు శివాజి, శోభా శెట్టి వచ్చారు. కెప్టెన్‌ను నిర్ణయించే రౌండ్ కావడంతో ఇది ఆసక్తికరంగా మారింది. అప్పుడు శోభా శెట్టి మాత్రం తన మాటపై నిలబడుతూ అమర్‌దీప్‌కు మద్దతు ఇచ్చింది. శివాజి.. అర్జున్‌ను సపోర్టు చేశాడు. దీంతో అమర్ ఏడుస్తూ రచ్చ రచ్చ చేశాడు.

మాటిచ్చి తప్పిన శివాజి: వాస్తవానికి కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం కాకముందే శివాజి దగ్గరకు వెళ్లిన అమర్.. తనకు సపోర్టు చేయాలని అడిగాడు. దీనికి ఆయన కూడా ఓకే చెప్పాడు. అంతేకాదు, 'మాటిచ్చాను. దానికోసం చచ్చిపోతాను' అంటూ డైలాగులు కొట్టాడు. కానీ, కెప్టెన్సీ టాస్కులో మాత్రం అర్జున్ భార్య ప్రెగ్నెంట్ అని, ఆమె కోసం అతడిని సపోర్ట్ చేస్తున్నానని చెప్పి మాటను మార్చేశాడు.

శివాజి ఇమేజ్ డ్యామేజ్: కెప్టెన్సీ టాస్కు విషయంలో శివాజి తీసుకున్న నిర్ణయం హౌస్‌మేట్లనే కాకుండా ప్రేక్షకులను సైతం షాక్‌కు గురి చేసింది. ఆయన అమర్‌దీప్ మీద కోపంతోనే మాట మార్చాడని అంతా అనుకుంటున్నారు. టాస్కు సమయంలో అమర్‌ ఏడుస్తూ ప్రాధేయపడినా శివాజి ఒప్పుకోలేదు. టైటిల్ రేసులో ఉన్న అతడి ఇమేజ్ ఫినాలే ముందు డ్యామేజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు.

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్: ఒకవైపు శివాజి.. మరోవైపు శోభా శెట్టి తమ నిర్ణయాలపై కట్టుబడి ఉండడంతో ఈ రౌండ్ టై అయింది. దీంతో బిగ్ బాస్ పలుమార్లు వీళ్లను హెచ్చరించాడు. చివరికి ఈ కెప్టెన్సీ టాస్కును రద్దు చేస్తున్నట్లు చెప్పాడు. అప్పుడు శివాజి కూడా అమర్‌కు సపోర్ట్ చేస్తానని ప్రకటించాడు. కానీ, అప్పటికే అతడి ఫొటోను కూడా కాల్చేసిన బిగ్ బాస్ నరాలు కట్ అయ్యే ట్విస్టునే ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X