Bigg Boss Telugu 7: తేలిపోయిన బిగ్ బాస్ విన్నర్.. నక్కతోక తొక్కిన శివాజి.. షో చరిత్రలో ఒకే ఒక్కడిగా!
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆసక్తికరమైన కంటెంట్‌తో నడుస్తూ.. సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. అందుకే తెలుగు ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని నెత్తిన పెట్టుకుని సక్సెస్ చేశారు. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని నడుపుతున్నారు. ఇందులో ఎన్నో ఊహించని సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఈ సీజన్‌కు కాబోయే విన్నర్ ఎవరో తేలిపోయింది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూసేయండి మరి!
ఫ్యామిలీ వీక్‌తో ఎమోషనల్ : బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి పదో వారంలో ఫ్యామిలీ వీక్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ప్రతి కంటెస్టెంట్ కుటుంబం నుంచి ఒకరు హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఇదంతా ఎంతో సందడిగా, ఎమోషనల్‌గా సాగింది. ముఖ్యంగా కొందరు ఫ్యామిలీ మెంబర్లు అయితే అందరినీ ఏడిపించేశారు. దీంతో ఈ సీజన్ మొత్తంలో ఇదే బెస్ట్ అనేలా ఈ వారం సాగిపోయింది.

కెప్టెన్సీ టాస్క్.. ఆ ఇద్దరు : పదో వారంలో ఫ్యామిలీ వీక్ పూర్తైన తర్వాత కొత్త కెప్టెన్ కోసం 'ఓ బేబీ' టాస్కును నిర్వహించారు. పలు రౌండ్లలో జరిగిన ఈ టాస్క్ ఎంతో ఆసక్తికరంగా నడిచింది. ముఖ్యంగా ఇందులో పలువురు కంటెస్టెంట్ల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇలా కొన్ని రౌండ్ల పాటు సాగిన ఈ టాస్కులో చివరకు శివాజి, అంబటి అర్జున్‌లు కెప్టెన్సీ కోసం పోటీ పడే కంటెస్టెంట్లుగా నిలిచారు.
కెప్టెన్సీ ఎంపిక నాగార్జునకే : సాధారణంగా కెప్టెన్సీ టాస్కును బిగ్ బాస్ హౌస్‌లోనే నిర్వహిస్తారు. కానీ, ఈ వారం మాత్రం ఫ్యామిలీ వీక్ జరగడంతో పాటు ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ఉండడం వల్ల దాన్ని హౌస్‌లో నిర్వహించలేకపోయారు. ఫలితంగా శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జునే కెప్టెన్సీ టాస్కును నడపాల్సి వచ్చింది. ఇందుకోసం గేమ్ కాకుండా కంటెస్టెంట్ల ఓట్లను తీసుకున్నారు.
రత్నాలతో కొత్త కెప్టెన్‌ను : కెప్టెన్సీ టాస్కులో భాగంగా కన్‌ఫెషన్ రూమ్‌లో శివాజి, అర్జున్ పేరుతో రెండు కిరీటాలను పెట్టారు. అనంతరం ప్రతి కంటెస్టెంట్ తమకు నచ్చని పోటీదారు కిరీటం నుంచి ఒక రత్నాన్ని తీసేయాల్సి ఉంటుందని నాగార్జున వివరించాడు. అంతేకాదు, నిర్మొహమాటంగా ప్రతి విషయాన్ని చెప్పి కెప్టెన్‌ను ఎంపిక చేసుకోవాలని కూడా కంటెస్టెంట్లు అందరికీ సూచించాడు.

శివాజికే ఓట్లు గుద్దేశారు : బిగ్ బాస్ ఇంటికి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు గానూ 'కిరీటం రత్నాలు' టాస్కులో భాగంగా 11 మందిలో ఇద్దరు పోటీదారులు మినహా మిగిలిన కంటెస్టెంట్లు అందరూ ఓట్లు వేశారు. అంటే తొమ్మిది మంది ఈ పోలింగ్‌లో పాల్గొనగా.. అందరూ శివాజికే జై కొట్టారు. ఫలితంగా అతడు అర్జున్‌పై విజయం సాధించడంతో పాటు బిగ్ బాస్ ఇంటికి ఆరో కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.
షో చరిత్రలో ఒక్కడుగా : వాస్తవానికి బిగ్ బాస్ హౌస్‌లోని అందరు కంటెస్టెంట్లూ ఏకాభిప్రాయానికి రాలేరు. అలాంటిది తొమ్మిది మంది కలిసి శివాజిని ఇంటి కెప్టెన్‌గా ఎంపిక చేసుకున్నారు. తద్వారా షో మొత్తంలోనే ఏకగ్రీవంగా ఎంపికైన తొలి కెప్టెన్‌గా శివాజి చరిత్ర సృష్టించాడు. ఇక, దీని ద్వారా ఈ సీజన్‌కు అతడే విన్నర్ అయ్యే అవకాశం ఉందని కూడా కంటెస్టెంట్లు అందరూ పరోక్షంగా తేల్చేశారు.


Click it and Unblock the Notifications











