Bigg Boss Telugu 7: ప్రశాంత్, యావర్‌లకు శివాజి బిగ్ షాక్.. ఇకపై వారితో కలవడట.. ఎందుకంటే?
బిగ్ బాస్.. ఈ పేరు వింటేనే చాలా మంది తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. ఇక సీజన్ ప్రారంభం కాబోతుందంటే చాలు ఎవరెవరు రాబోతున్నారు దగ్గర నుంచి.. టైటిల్ విన్నర్ గా నిలిచి బయటకి వెళ్లిపోయాక కూడా వారి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అంత హైప్ ను క్రియేట్ చేసే ఈ గేమ్ కు తెలుగులోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకు అద్భుతమైన టీఆర్పీతీ బిగ్ బాస్ తెలుగు షో దుమ్మరేపుతోంది. ఇప్పటికే ఆరు సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సాగుతున్న బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ కూడా రసవత్తరంగా సాగుతోంది.
ముఖ్యంగా 12 వారాలు పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగు పెడుతున్న ఈ షోలో... మొదటి రోజే నామినేషన్ల పర్వం చాలా వాడీవేడగా సాగనున్నట్లు ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది. అయితే సీజన్ ప్రారంభం అయిన రెండో వారంలో.. హౌస్ మేట్స్ అంతా కలిసి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను టార్గెట్, కార్నర్ చేయడం అందరికీ తెలిసిందే. ఇక అక్కడి నుంచి పల్లవి ప్రశాంత్ కు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. అలాగే ఇంట్లోని వాళ్లంతా ఆయనను వేరు చేసినా ఒక్క శివాజి మాత్రమే అతడి పక్కన నిలబడి సాయంగా ఉన్నాడు. ఇలా మొదటి వారం నుంచే మంచి పేరు తెచ్చుకున్న శివాజి.. పల్లవి ప్రశాంత్ తో పాటు ప్రిన్స్ యావర్ తో క్లోజ్ గా ఉంటూ గేమ్ ఆడుతున్నాడు.
Recommended Video


అయితే పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్ ల స్నేహానికి బయట చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. వీరి ముగ్గురి కాంబో అంటే అందరికీ ఇష్టమే. ఎన్ని సమస్యలు వచ్చినా, ఏమైనా ఇన్ని వారాలు కలిసి గేమ్ ఆడిన ఈ గ్రూప్ ఇప్పుడు విడిపోబోతున్నట్లు అర్థం అవుతోంది. అదేంటీ అంటారా.. అవునండీ.. శివాజి ఓ షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు. ఇకపై పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లకు సంబంధించిన ఏ విషయంలోనూ తాను చేయి పెట్టనని నామినేషన్స్ లో భాగంగా హౌస్ మేట్స్ కు వివరించాడు. అసలు ఆయన ఇలా ఎందుకు చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీ వారం లాగే అశ్వత్థామ (2.0 గౌతమ్ కృష్ణ) శివాజిని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. అందుకు గల కారణాలను వవిరిస్తూ.. బాగా ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గౌతమ్ కృష్ణ... మీరు వీకర్ సెక్షన్ సైడ్ ఉంటానని అన్నారు కానీ ఎప్పుడూ తనకు అలా కనిపించలేదని అంటాడు. అందుకు శివాజి.. ఎవరైతే మెంటల్ గా వీక్ ఉంటారో వారి వెంట నిలబడతానని అన్నానని చెప్పుకొచ్చాడు. మీరు అన్న మాట ప్రకారం వీకర్ సెక్షనో, మెంటల్లీ వీకో వారి వెంట నిలబడరన్న అని మరోసారి తెలిపాడు డాక్టర్ బాబు.
ఇందుకు శివాజి.. ముఖ్యంగా వాళ్లిద్దరి విషయాల్లో నెను ఎప్పుడైనా, ఒక్కసారి కూడా ఇన్వాల్వ్ అవ్వను అని తేల్చి చెప్పాడు. ఇదంతా చూస్తుంటే శివాజి.. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ల వెంట ఉండడం నచ్చకే గౌతమ్ కృష్ణ ఇలా చేయగా.. హర్ట్ అయిన శివాజి వారి గురింటి పట్టించుకోనని చెబుతూ ఛాలెంజ్ విసిరాడు. మరి మాట ప్రకారమే శివాజి వారికి దూరంగా ఉంటాడా.. లేక స్నేహాన్ని కొనసాగిస్తాడా అనేది తెలియాలంటే మాత్రం ముందు ముందు ఎపిసోడ్ లు అన్నీ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











