Bigg Boss Telugu 7: మరోసారి గేమ్ స్ట్రాటెజీ మార్చిన శివాజి.. ఏకంగా విన్నర్ అయ్యేందుకే టెండర్ వేశాడుగా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ.. ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. అద్భుతమైన రెస్పాన్స్ తో అందరికీ షాకిస్తున్న ఈ షో దుమ్ము లేపుతోంది. ముందెన్నడూ లేనట్లుగా ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్ ఇప్పటికే 13 వారాలు విజయంవంతగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 14వ వారం కూడా విజయవంతంగా పూర్తి కావొస్తుంది. అయితే ఈ ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఇంట్లో ఉండగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా గేమ్ ఆడుతున్నారు. ఎలాగైనా సరే కప్పు కొట్టుకుని వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా ముందు నుంచి అద్భుతమైన ఆట తీరుతో అందరి మన్ననలు పొందుతున్న శివాజి అయితే రోజుకో రకంగా గేమ్ ఆడుతున్నారు. చేయి నొప్పి ఉన్న టాస్క్ లలో అంతగా పర్ఫార్మ్ చేయకపోయినా... మైండ్ గేమ్ తో ఆయన అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. ఎలాగైనా సరే బిగ్ బాస్ విన్నర్ గా నిలవాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. మొదటి వారంలోనే బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టిన ఈయనకు.. అనుకోని ఓ ఘటన ద్వారా ఫుల్ పాజిటివిటీ వచ్చింది. అప్పటి వరకు ఈ సీజన్ విన్నర్ గా అమర్ దీప్ గెలుస్తాడని అనుకున్న అందరికీ.. ఆయన షాకిచ్చాడు.

కామన్ మ్యాన్ గా ఇంట్లో అడుగు పెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో గొడవ పెట్టుకుని తన నెగిటివిటీకా తానే కారణం అయ్యాడు అమర్ దీప్. కానీ ఈ విషయంలో పల్లవి ప్రశాంత్ కు సాయం చేసి అప్పటి నుంచి ఆయనకు అండగా నిలుస్తూ.. శివాజి మాత్రం మంచి మార్కు కొట్టేశాడు. ఎవరూ ఊహించని విధంగా ఈయన విన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ వాళ్లను మట్టి కరిపిస్తూ.. ఎప్పుడూ తన వెంటనే ఉండే ప్రిన్స్ యావర్, అమర్ దీప్ లకు సాయంగా నిలుస్తున్నాడు.
అయితే ఎప్పటికప్పుడు తన గేమ్ స్ట్రాటెజీని మార్చుకుంటూ వస్తున్న శివాజి ఈ మధ్య మాత్రం చాలా సైలంట్ గా ఉంటున్నాడు. ఈక్రమంలోనే విన్నర్ గా నిలుస్తాడు అనుకున్న ఇతడికి.. ఓటింగ్ తగ్గిపోతూ వస్తోంది. గత రెండు వారాలుగా మైండ్ గేమ్ మార్చని కారణంగా శివాజి గ్రాఫ్ రోజురోజుకూ తగ్గిపోతూ వస్తోంది. అయితే ఈక్రమంలోనే మరోసారి ఆయన 14వ వారంలో భాగంగా తన గేమ్ ను మార్చాడు. అయితే ఆయన ఎలా గేమ్ మార్చాడు, ఏం చేయబోతున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
14వ వారంలో భాగంగా బిగ్ బాస్ ఓ టాస్క్ ను ఇచ్చాడు. ఈక్రమంమలోనే శోభాశెట్టి ని సంచాలక్ గా పెట్టగా.. ఆమె ప్రియాంక గెలవాలని తరచుగా ప్రయత్నాలు చేసింది. గట్టి గట్టిగా అరుస్తూ... కేకలు వేసింది. ప్రియాంక ఆడు, ప్రియాంక ఆడు అంటూ అరిసింది. దీంతో శివాజి ఫుల్ ఫైర్ అయిపోతూ గేమ్ ను ఆపేశాడు. నేను గేమ్ ఆడనంటే ఆడనంటూ మరింత గట్టిగా ఫైర్ అయ్యాడు. ఎలాగైనా సరే సీరయల్ బ్యాచ్ వాళ్లను ఓడించాలని తాను విన్నర్ కావాలనే ఈ ప్లాన్ వేసినట్లు అర్థం అవుతుంది. మరి మరోసారి గేమ్ స్ట్రాటెజీ మార్చిన ఆయన ఈ సీజన్ విన్నర్ అవుతాడా లేదా రన్నరప్ గా నిలుస్తాడా అనేది తెలియాలంటే ఇంకా కోంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











