బట్టలు విప్పుకొని తిరగమనండి.. అభ్యంతరం ఏమీ లేదు.. :దివ్వెల
టాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్‌బాస్ బజ్ హోస్ట్ శివాజీ (sivaji) హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన మాటలు కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారి తీశాయి. శివాజీ వ్యాఖ్యలను కొందరు తీవ్రంగా ఖండిస్తుండగా, మరికొందరు మాత్రం ఆయన ఉద్దేశం తప్పుగా లేదంటూ మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అంశం ఓ రేంజ్‌లో యుద్ధంలా మారింది.
ఇటీవల కాలంలో హీరోయిన్ల వస్త్రధారణ కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శివాజీ 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా హీరోయిన్ల డ్రస్సింగ్ గురించి మాట్లాడిన శివాజీ కొన్ని అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ముఖ్యంగా 'సామాన్లు' వంటి పదాల వాడకంపై మహిళా సంఘాలు, నటీమణులు, నెటిజన్లు మండిపడ్డారు. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు శివాజీ మాటలు పూర్తిగా తప్పని బహిరంగంగానే ఖండించారు.

అయితే ఈ వివాదంలోకి తాజాగా రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్, బిగ్‌బాస్ 9 ఫేమ్ దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చారు. శివాజీకి వీరిద్దరూ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ప్రముఖ టీవీ ఛానెల్ 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధురి మాట్లాడుతూ, 'హీరోయిన్లకు కాకుండా డైరెక్టర్లు, నిర్మాతలకు మంచి బట్టలు ఇవ్వమని చెబితే బాగుంటుంది. హీరోయిన్లు వాళ్లు చెప్పిందే చేస్తారు'అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మహిళలు నిండుగా బట్టలు వేసుకోకపోతే మగవాళ్లకు వచ్చే సమస్య ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ... 'ఇది పోయేకాలం. నెటిజన్లు కూడా పోయేకాలం అని తిడుతున్నారు. సాంప్రదాయంలో ప్రధానంగా చూసేది దుస్తులే. మనం సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఇలానే ఉంటామని అంటే, చూసే వారి దృష్టికోణం కూడా మారుతుంది. ఇక్కడ మగవాళ్లది మాత్రమే తప్పు అని చెప్పలేం. చూసే దృష్టి బట్టి ఉంటుంది'అన్నారు.
దీనిపై యాంకర్ 'ఎందుకు అలాంటి దృష్టితో చూడాలి?' అని ప్రశ్నించగా, శ్రీనివాస్ మరింత క్లియర్‌గా 'బట్టలు తప్పు కాదు... అలాగే మగవాళ్ల దృష్టి మారడం కూడా తప్పే. ఆ దృష్టి మారడమే మగవాడి ఆలోచనా విధానం. మగవాళ్లంతా శ్రీరామచంద్ర మూర్తులు కాదు. మనలో కూడా లోపాలు ఉన్నాయి. మగవాళ్లలో చంచలమైన, వికలమైన మనస్తత్వాలు ఉంటాయి. కానీ మనం చూసే విధానం సరికాదు' అంటూ వివరణ ఇచ్చారు.
ఇక మహిళల డ్రెస్సింగ్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, 'మహిళలు తమ కంఫర్ట్ కోసం మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటే తప్పేం లేదు. కానీ ఆ డ్రెస్సుల్లో కొంత సభ్యత, కొంత సంస్కారం ఉంటే బాగుంటుంది'అని అన్నారు. గత హీరోయిన్ల డ్రెస్సింగ్‌ను గుర్తు చేస్తూ దువ్వాడ శ్రీనివాస్ లెజెండరీ నటి సావిత్రిని ఉదాహరణగా పేర్కొన్నారు. 'ఇప్పటి హీరోయిన్ల ఫోటోలు పక్కన పెట్టి సావిత్రి అమ్మగారి ఫోటో చూసినప్పుడు మనకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఆమె మహానటి. ఆమె డ్రెస్సింగ్, మాట తీరు, సమాజంలో నడుచుకున్న పద్ధతి అలా ఉండేది. ఇప్పటికీ సౌందర్యను చూసినప్పుడు కూడా నమస్కారం పెట్టాలనిపిస్తుంది'అంటూ వ్యాఖ్యానించారు.
ఇదే ఇంటర్వ్యూలో దివ్వెల మాధురి( దువ్వాడ మాధురి) కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె యాంకర్ అనసూయపై ఘాటు విమర్శలు చేసింది. 'బట్టలు విప్పుకొని తిరగమని చెప్పండి... ఎవరు అభ్యంతరం చెప్పరు. అంతకంటే ఎక్కువ ఆమె గురించి మాట్లాడలేం' అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. మాధురి స్పష్టంగా శివాజీకి పూర్తి మద్దతు ప్రకటించారు. 'శివాజీ చెప్పిన మాటల్లో ఉద్దేశం తప్పు లేదు. కానీ ఆయన వాడిన కొన్ని పదాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ విషయంలో ఆయన సారీ కూడా చెప్పారు. అంతటితో విషయం ముగిసిపోవాలి. కానీ అనసూయ అనవసరంగా అతిగా మాట్లాడుతోంది' అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.
తన దృష్టిలో ఆడవాళ్లకు చీరే అందమని చెప్పిన ఆమె, అనసూయ వ్యాఖ్యలపై మరింత ఫైర్ అయ్యారు. 'ఆమె సనాతన ధర్మం, ఆలయాల గురించి మాట్లాడితే నమ్మేవాళ్లు ఎవరూ లేరు. సనాతన ధర్మం గురించి ఆమెకు ఏం తెలుసు?' అంటూ తీవ్రంగా విమర్శించారు. అనసూయ వేసుకునే బికినీలు, బట్టలు తనకు నచ్చవని స్పష్టం చేస్తూ.. 'ఈ విషయంలో నన్ను ట్రోల్ చేసినా ఫర్వాలేదు. ట్రోలింగ్ నాకు కొత్త కాదు'అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం శివాజీ వ్యాఖ్యలు, దువ్వాడ శ్రీనివాస్-మాధురి మద్దతు, అనసూయపై చేసిన ఫైర్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ ఈ వివాదం ఇంకా కొనసాగేలా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై మరిన్ని సెలబ్రిటీల స్పందనలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











