Bigg Boss Telugu 7: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన శివాజి.. అతడికే మైనస్ అయిందిగా.. అదే జరిగితే గెలవడం కష్టమే!

చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని నెంబర్ వన్ షోగా మారిపోయింది బిగ్ బాస్. అందుకే ఇది ఎప్పుడు వచ్చినా ఆడియెన్స్ అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారు. దీంతో నిర్వహకులు కూడా ఏమాత్రం బ్రేక్ లేకుండా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన శివాజి ఊహించని ప్రవర్తనతో హాట్ టాపిక్‌గా మారాడు. అదే సమయంలో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

ఎవిక్షన్ పాస్ టాస్కుతో:ఉల్టా పుల్టాగా సాగుతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌లో నిర్వహకులు సరికొత్త టాస్కులను పరిచయం చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే 11వ వారానికి సంబంధించి కంటెస్టెంట్లు అందరి కోసం 'ఎవిక్షన్ పాస్' టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మూడు రౌండ్లలో అర్జున్, ప్రశాంత్, శోభాలపై గెలిచిన ప్రిన్స్ యావర్.. చివరి పోటీలో శివాజి, ప్రియాంక జైన్‌తో పోటీ పడ్డాడు.

Sivaji Comments Goes Hot Topic in Bigg Boss Telugu 7 Show

హైడ్రామాలతో సాగింది:ఎవిక్షన్ పాస్ మూడో రౌండ్ ఎన్నో హైడ్రామాల నడుమ సాగింది. మరీ ముఖ్యంగా ఈ టాస్క్ నుంచి ప్రియాంక, శివాజిలు వరుసగా ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ప్రిన్స్ ఈ టాస్కులో గెలిచాడని అంతా అనుకున్నారు. కానీ, అప్పుడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ ఈ టాస్కులో నియమాల ప్రకారం ఎవరు గెలిచారో చెప్పమని అడగడంతో శోభా శెట్టి, ప్రశాంత్ ఆలోచనలో పడిపోయారు.

శివాజి పెద్ద గొడవ చేసి:ఎవిక్షన్ పాస్ టాస్కులో నియమాలు పాటించి ఆడి గెలిచింది ఎవరో చెప్పాలంటూ బిగ్ బాస్ అడగడంతో.. శోభా శెట్టి.. ప్రియాంకను విజేతగా ప్రకటించాలని భావించింది. అది గమనించిన శివాజి ఆమెతో గొడవకు దిగాడు. 'నువ్వు సంచాలకురాలిగా ఉన్న ప్రతిసారి ఇలాగే జరుగుతుంది' అంటూ ఓ రేంజ్‌లో గొడవ పడ్డాడు. ఇలా ఇద్దరూ చాలా సేపు వాదించుకుని నానా రచ్చ చేసేశారు.

Sivaji Comments Goes Hot Topic in Bigg Boss Telugu 7 Show

యావర్ విన్.. థ్యాంక్స్:ఎన్నో మలుపులతో రసవత్తరంగా సాగిన ఎవిక్షన్ పాస్ టాస్కులో ప్రియాంక గెలిచిందని శోభా.. యావర్ గెలిచాడని ప్రశాంత్ మాట్లాడుకున్నారు. ఇలా ఇద్దరూ చాలా సేపు చర్చలు జరుపుకున్నారు. చివరకు యావర్ గెలిచాడని ప్రకటించారు. అప్పుడు శివాజి 'థ్యాంక్స్ శోభా.. మంచి నిర్ణయం తీసుకున్నావు' అన్నాడు. దీంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.

ప్లేట్ తిప్పేసిన శివాజి:టాస్కులో గొడవ చేసిన శివాజి ఆ తర్వాత హౌస్‌మేట్లతో 'నేను నా కోసం గొడవ చేశానని అనుకున్నారా? కాదు యావర్ గాడు డిజర్వ్. వాడు గెలవాలనే అలా చేశాను' అంటూ పదే పదే చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ప్రశాంత్, శోభాలకు కూడా ఇదే మాట చెప్పాడు. అంతేకాదు, ఫుడ్‌పైన కూడా ఒట్టు వేశాడు. దీంతో చూసే వాళ్లందరికీ శివాజి కావాలనే మాట మార్చినట్లు అనిపించింది.

Sivaji Comments Goes Hot Topic in Bigg Boss Telugu 7 Show

గెలవడం కష్టమేనని:శివాజి ఈ సీజన్‌లో ఆరంభం నుంచీ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఇలానే పలుమార్లు మాటలు మార్చి హాట్ టాపిక్ అయ్యాడు. ఇక, ఎవిక్షన్ పాస్ గొడవలో వ్యవహరించిన తీరు అతడికే మైనస్‌గా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఇదే బిహేవియర్ కంటిన్యూ చేస్తూ టైటిల్ గెలవడం కష్టమే అని కూడా కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

నాగార్జున ఏమంటాడో:ఎవిక్షన్ పాస్ టాస్కు మొత్తంలో ఎన్నో రకాల తప్పిదాలు జరిగాయి. దీనికితోడు శివాజి వ్యవహరించిన తీరు మాత్రం మరింత హైలైట్ అయింది. దీంతో శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున దీనిపై కచ్చితంగా స్పందించే అవకాశం ఉంది. ఒకవేళ శివాజి చేసింది తప్పు అని ఆయన ఎత్తి చూపితే మాత్రం కచ్చితంగా ఇది అతడి ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుందని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X