Bigg Boss Telugu 7: షోలో షాకింగ్ సీన్.. వెక్కి వెక్కి ఏడ్చిన శివాజి.. నాగ్‌ను రిక్వెస్ట్ చేస్తానంటూ!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఊహించని రీతిలో స్పందనను సంపాదించుకుని.. దేశంలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంటూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా హవాను చూపిస్తోంది బిగ్ బాస్. టీవీ రంగంలో పెట్టుకున్న సరిహద్దులను చెరిపేసే కంటెంట్‌తో ప్రసారం అవుతూ.. ప్రేక్షకులకు మజాను పంచుతోందీ షో. ఫలితంగా సీజన్ల మీద సీజన్లను కూడా పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడోది కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్ శివాజి కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

కాన్సెప్టుకు తగ్గ కంటెంట్‌తో:బిగ్ బాస్‌కు రేటింగ్ క్రమంగా తగ్గుతూ ఉండడంతో ఏడో సీజన్‌లో ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా మొదటి రోజు నుంచే ఎన్నో రకాల సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు ఇస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని షాక్‌లను కూడా ఇస్తున్నారు. ఇలా ప్రేక్షకులకు మజాను పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సక్సెస్ అవడంతో షో కూడా రసవత్తరంగా సాగిపోతుంది.

Sivaji Cries for Prince Yawar and Pallavi Prashanth in Bigg Boss Telugu 7 Show

శివాజి టైటిల్ ఫేవరెట్‌‌గానే:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఐదో వారం తర్వాత మరో ఐదుగురు కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో తక్కువ మంది మాత్రమే బాగా హైలైట్ అయ్యారు. వారిలో హీరో శివాజి మాత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆటకు ఆట, మైండ్ గేమ్‌కు మైండ్ గేమ్ చూపిస్తూ టైటిల్ ఫేవరెట్‌‌గా మారిపోయాడు.

శివాజి ఆ ఇద్దరికి గురువుగా:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో శివాజి తన ఆటతీరుతో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్లకు సలహాలు, సూచనలు ఇస్తూ గడుపుతున్నాడు. వాళ్లు ఎవరో కాదు.. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ అన్న విషయం తెలిసిందే. ఇలా ఏమీ తెలియని వీళ్లకు గురువుగా మారి వాళ్లు సత్తా చాటేలా చేశాడు. దీంతో ప్రిన్స్, ప్రశాంత్ కూడా శివాజి పట్ల గౌరవంగా ఉండడంతో పాటు హెల్ప్ చేస్తున్నారు.

Sivaji Cries for Prince Yawar and Pallavi Prashanth in Bigg Boss Telugu 7 Show

గాయంతో శివాజి ఇబ్బంది:బిగ్ బాస్ షోలో ఒక టాస్క్ జరుగుతున్న సమయంలో శివాజి భుజానికి గాయం అయిన విషయం తెలిసిందే. అందుకే అతడిని స్కానింగ్ కోసం బయటకు పంపించి.. వైద్య పరీక్షల అనంతరం లోపలికి తీసుకు వచ్చారు. అప్పటి నుంచి బిగ్ బాస్ కూడా అతడిని టాస్కులకు దూరంగానే ఉంచుతున్నాడు. అయినప్పటికీ శివాజి తనదైన రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.

వెక్కి వెక్కి ఏడ్చిన శివాజి:కొద్ది రోజులుగా గాయంతో బాధ పడుతున్న శివాజి.. ఆరోగ్య సమస్యల కారణంగా బిగ్ బాస్ ఏడో సీజన్ నుంచి తప్పుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శివాజి వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.

Sivaji Cries for Prince Yawar and Pallavi Prashanth in Bigg Boss Telugu 7 Show

మీకోసమే ఉన్నాను అని:బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో తన దగ్గర కూర్చున్న ప్రిన్స్ యావర్‌ ముందు శివాజి ఎమోషనల్ అయ్యాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు. అనంతరం 'మీ ఇద్దరు (ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్) కోసమే నేను ఇక్కడ ఉంటున్నానురా. లేకపోతే నాగార్జున గారికి రిక్వెస్ట్ చేసి అయినా నా ఇంటికి వెళ్లిపోయే వాడిని' అంటూ వెక్కి వెక్కి ఏడ్చేశాడు.

నా బిడ్డల మీద ఒట్టురా:ఏడుస్తున్న శివాజిని ప్రిన్స్ యావర్ 'అన్నా మీరు ఏడవకండి. మీరు చాలా స్ట్రాంగ్' అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు. అప్పుడే ప్రశాంత్ రావడంతో అతడిని కూడా పట్టుకున్న శివాజి 'నా బిడ్డల మీద ఒట్టురా. నేను మీ ఇద్దరి కోసమే ఇక్కడ ఉన్నాను' అంటూ ఏడ్చాడు. దీంతో ఇద్దరూ అతడిని ఓదార్చారు. తర్వాత ఇది పెద్ద సీన్ అవుతుందని వాళ్లను అక్కడి నుంచి పంపేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X