Bigg Boss Telugu 7: శివాజీ ఇంటికెళ్లేలోపు కొడుకు కనిపించడంట.. అందుకే ఇప్పుడొచ్చాడట, కన్నీటిపర్యంతమైన హీరో!

Sivaji Crying: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో మరికొన్ని వారాల్లో ముగుస్తుండగా.. విపరీతమైన టీఆర్పీని సొంతం చేసుకుంటుంది. అయితే తాజాగా 9వ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయి వెళ్లిపోగా... సోమవారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. గత వారాల్లో రెండు రోజల పాటు నామినేన్ ప్రక్రియనే చూపించిన బిగ్ బాస్ ఈ సారి మాత్రం సోమవారం ఎపిసోడ్ లోనే నామినేషన్లు ముగిసేలా చేశారు. అందుకూ ఓ పథకం ఉందిలెండి. అదేంటీ అంటారా... ఈ వారమే కంటెస్టెంట్ల.. ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు.

అయితే తాజాగా వదిలిన ప్రోమోలో... శివాజి కొడుకు ఇంట్లోకి రావడం చూపించారు. కాఫీ తాగుతున్న శివాజిని పిలిచి.. మీరోసారి మెడికల్ చెకప్ కోసం మెడికల్ రూంలోకి రావాలని సూచించారు. ఈక్రమంలోనే శివాజి పెద్ద కొడుకు వెంకట్ అలియాస్ రిక్కీ.. డాక్టర్ గా మాస్కు, క్యాప్ ధరించి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనకు చెకప్ చేశాడు. ఇప్పుడెలా ఉందంటూ హిందీలో మాట్లాడి తండ్రి గుర్తు పట్టకుండా నటించాడు. కొడుకును ఏమాత్రం గుర్తు పట్టని శివాజి.. బయటకు వెళ్లిపోతుండగా.. డాడీ అని పిలిచాడు రిక్కీ. దీంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగిన శివాజి.. నోరెళ్లబెట్టాడు.

Sivaji Crying After His Son Told Him That He Would Leave For America Before Sivaji Went Home in Bigg Boss Telugu 7

వెంకట్ యే మాస్కు తీసేని.. నాన్న అనగానే శివాజి కొడుకును హత్తుకున్నాడు. ఫుల్లుగా ఏడ్చేశాడు. ఇక కొడుకును బయటకు తీసుకుని రాగా.. కుటుంబ సభ్యులు అంతా కూడా ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. ఈక్రమంలోనే తన కొడుకును డాక్టర్ గా పంపించారని చెబుతూ శివాజి ఫుల్ సంబరపడిపోయాడు. అయితే భోలె షవాళి.. నీ కొడుకును లోపల ఉంచేసి నీవు బయటకు వెళ్లిపో.. ఇద్దరూ సేమ్ టు సేమ్ ఉన్నారని చెప్పగా అంతూ ఘొల్లుమని నవ్వారు. కానీ శివాజి కొడుకు మాత్రం.. నా వల్ల కాదు బాబోయ్ అంటూ దండం పెట్టాడు. దీనికి మరోసారి అంతా నవ్వారు.

ఇక బయటకు వెళ్లి ఇద్దరే సెపరేట్ గా మాట్లాడుకుంటుండగా.. నువ్వొస్తావు అనుకోలేదు, తమ్ముడు వస్తాడనుకున్నా, నీకు కొంచెం సిగ్గు కదా అంటూ శివాజి కొడుకుతో అన్నాడు. దానికి మెలికలు తిరిగిపోయిన వెంకట్ అలియాస్ రిక్కీ.. ఓ విషయం చెప్పాడు. దానికి శివాజి ఫుల్ ఎమోషనల్ అవుతూ బాగా ఏడ్చేశాడు. వెంకట్ పై చదువులు కోసం 8వ తేదీన వెళ్లాల్సి ఉందని.. అయితే నువ్వు ఇంటికి వచ్చాకా మళ్లీ కలవలేనని ఇప్పుడు వచ్చానంటూ చెప్పాడు. పది నెలల వరకు మళ్లీ కనిపించనని చెప్పి శివాజిని షాక్ కు గురి చేశాడు. దీంతో శివాజి బాగా ఏడ్చేశాడు.

Sivaji Crying After His Son Told Him That He Would Leave For America Before Sivaji Went Home in Bigg Boss Telugu 7

కానీ కొడుకు వెంకట్ మాత్రం.. నాన్న నువ్వు ఏడ్వద్దు అంటూ చెప్పిన విధానం హైలెట్ గా నిలిచింది. నీవు ఏడిస్తే ఇంట్లో వాల్లంతా ఏడుస్తారు, నువ్వు నవ్వింతే ఇంట్లో వాళ్లంతా నవ్వుతారంటూ చెప్పాడు. ఇది చూస్తుంటే శివాజి లాగే వెంకట్ కు కూడా చాలా మెచ్యూరిటీ ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇలా ఈ ప్రోమో పూర్తి అయింది. అయితే వీరిద్దరూ మాట్లాడుకున్న విషయాలు, మిగతాదంతా పూర్తిగా చూడాలంటే ఈరోజుటి ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X