Bigg Boss Telugu 7: ఫినాలేకు ముందు శివాజికి బిగ్ షాక్.. ఇలా అయితే గెలవడం కష్టమే!

బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలు అన్నింటికీ పరిమితులు పెట్టుకుంటారు. కానీ, ఇలాంటివి ఏమీ లేకుండా ప్రసారం అవుతోన్న ఏకైక రియాలిటీ షోనే బిగ్ బాస్. అన్ని భాషల కంటే తెలుగులోనే దీనికి ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా రేటింగ్ కూడా బాగా దక్కుతోంది.

ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో మొదలు పెట్టారు. ఇందులో గతంలో కంటే విభిన్నమైన కంటెంట్‌ను చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టైటిల్ ఫేవరెట్ శివాజికి ఫినాలే ముందు బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసమే!

Sivaji Failed In Secret Task In Bigg Boss Telugu 7 Show

ఆ రికార్డులు బ్రేక్ చేయాలని: సాధారణంగా తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా భారీ రేటింగ్‌ను దక్కించుకుంది. కానీ, గత సీజన్ చప్పగా సాగింది. దీంతో ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులో ఎన్నో చిత్ర విచిత్రమైన టాస్కులను చూపిస్తున్నారు. అలాగే, షాక్‌లు, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్ వినోదాన్ని పంచుతూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది.

టైటిల్ ఫేవరెట్‌లో ముందు: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లు అందరిలోనూ కొందరు మాత్రమే మంచి ఫాలోయింగ్‌తో వచ్చారు. అందులో హీరో శివాజి మాత్రం ఆరంభంలోనే టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే మెంటల్‌గా, ఫిజికల్‌గా ఆడుతూ ముందుకు సాగుతున్నాడు.

ఫినాలే ముందు తప్పులతో: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శివాజి చక్కగా ఆడుతూ, పెద్దరికం ప్రదర్శిస్తూ మెప్పిస్తున్నాడు. అయితే, ఫినాలేకు ముందు మాత్రం అతడిలో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అప్పుడప్పుడూ గొడవలు పెట్టుకోవడం, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం, మాట మార్చడం వంటివి చేస్తున్నాడు. అయినా అతడి ఫాలోయింగ్ మాత్రం పెరుగుతూనే ఉంది.

శివాజికి సీక్రెట్ టాస్క్ ఇచ్చి: బిగ్ బాస్ ఏడో సీజన్ ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో మరింత రంజుగా సాగుతోంది. ఇందులో భాగంగానే 12వ వారంలో క్రైమ్ టాస్కును ఇచ్చారు. దీని ప్రకారం.. హౌస్‌లో ఓ మర్డర్ జరిగిందని, దాన్ని కనిపెట్టడమే అసలు టాస్క్ అని చెప్పారు. ఇందులో హోటల్ మేనేజర్‌ రోల్ చేస్తున్న శివాజికి బిగ్ బాస్ ఓ సీక్రెట్ టాస్కును ఇచ్చాడు. అది ఈరోజు చూపించబోతున్నారు.

ఫోన్ ఇచ్చి మరీ సూచనలు: బిగ్ బాస్ షోలో గతంలో కూడా పలువురు కంటెస్టెంట్లకు సీక్రెట్ టాస్కులు ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఏడో సీజన్‌లో శివాజికి టాస్క్ ఇచ్చారు. ఇందుకోసం అతడికి ఓ ఫోన్ ఇచ్చి.. కొన్ని సూచనలు చేయడం ద్వారా టాస్కులు ఇచ్చినట్లు తెలిసింది. అసలు ఉద్దేశం ఏంటంటే.. శివాజి టాస్కును ఫినీష్ చేసి కంటెస్టెంట్లను చనిపోయేలా చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

వాళ్లిద్దరిని చంపిన శివాజి: బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కులో భాగంగా ముందుగా శివాజి.. పల్లవి ప్రశాంత్ చనిపోయేలా చేశాడు. దీంతో అతడు డెడ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. ఆ తర్వాత అశ్వినిని కూడా శివాజి చంపేసినట్లు మరో న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. దీనివల్ల ఈ టాస్కు నుంచి ప్రశాంత్, అశ్విని ఎలిమినేట్ అయిపోయారని సమాచారం.

శివాజి ఫెయిల్.. బిగ్ షాక్: తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కులో శివాజి విఫలం అయ్యాడట. ఇద్దరిని చంపేసిన తర్వాత ఆ టాస్క్ ఆడింది ఆయనే అన్న విషయం హౌస్‌మేట్లకు తెలిసిపోయిందని సమాచారం. దీంతో ఈ టాస్క్ నుంచి శివాజి ఔట్ అయ్యాడని తెలిసింది. ఫినాలే ముందు సీక్రెట్ టాస్కులో ఫెయిల్ అవడం అతడికి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X