Bigg Boss Telugu 7: అర్జున్ స్ట్రాంగ్, భోలె వీక్ అంటున్న గౌతమ్.. తొక్క తీస్తానంటూ శివాజి వార్నింగ్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అద్భుతమైన టాస్కులతో అందరినీ అలరించేందుకు బిగ్ బాస్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయత్నాలు చేస్తుండగా.. వాటిలో గెలిచేందుకు కంటెస్టెంట్లు చేసే అతి అంతా ఇంతా కాదు. చిన్న చిన్న వాటికే గొడవలు పడిపోతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. సోమవారం, మంగళవారం నామినేషన్లతో ఇల్లంతా హీటెక్కిపోగా.. బుధవారం రోజు కాస్త కామెడీ, ఫన్నీ టాస్కులు ఇచ్చి అందరినీ చల్లబరిచాడు. కానీ తాజాగా మరోసారా కెప్టెన్సీ కంటెండర్ టాస్కు కోసం అదిరిపోయే గేమ్ ఇచ్చాడు. దీంతో అందరూ గెలిచేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
నిన్న బెలూన్స్ టాస్కు ఇవ్వగా.. అందులో అంబటి అర్జున్, పల్లవి ప్రశాంత్ లు ఉన్న టీం ఓడిపోయింది. ఈక్రమంలోనే గెలిచిన టీం వాళ్లు... పల్లవి ప్రశాంత్ ను కెప్టెన్సీ టాస్కు నుంచి తొలగించారు. ఆ తర్వాత రెండో గేమ్ లో అమర్ దీప్ టీం గెలుస్తుంది. ఇక మూడో గేమ్ లో భాగంగా బాల్స్ సేవ్ చేసుకోవాలి. ఈక్రమంలోనే రెండు జట్లు ఫుల్ కష్టపడతాయి. అయితే గోల్డెన్ బాల్ వచ్చిన వాళ్లకి బిగ్ బాస్ ఓ అవకాశం ఇచ్చాడు. స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ను తమ గ్రూపులోకి తీసుకుంటూ.. తమ గ్రూపులో ఉన్న వీకెస్ట్ ప్లేయర్ ను ఎదుటి గ్రూపులోకి స్వాప్ చేసుకోవచ్చని వివరిస్తాడు.

అయితే గోల్డెన్ బాల్ సాధించుకున్న గౌతమ్ కృష్ణ టీం.. అంబటి అర్జున్ ను స్ట్రాంగెస్ట్ కంటెండర్ గా చెబుతూ.. తమ గ్రూపులోకి తీసుకోగా.. భోలె షవాళి వీకెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పి గ్రూపులోంచి పంచించాడు. ఇక ఆ తర్వాత నుంచి టాస్కు మొత్తం ఫుల్ ఎగ్జైటింగ్ గా మారింది. ఈ గ్రూపు వాళ్లు దాచిపెట్టుకున్న బాల్స్ గురించి అంబటి అర్జున్ కు మొత్తం తెలుసు. అయితే వాటిని సులువుగా లాక్కోవచ్చని గౌతమ్ కృష్ణ అండ్ టీం ప్లాన్ చేసింది. దీంతో శివాజి ఫుల్ ఫైర్ అయ్యాడు. నా బాల్స్ జోలికి ఎవరైనా వస్తే.. తొక్క తీస్తానంటూ స్టేట్ మెంట్లు పాస్ చేశాడు.
మరోవైపు గౌతమ్ కృష్ణ.. ఇధి టాస్క్, బాల్స్ లాక్కోవచ్చు, లాక్కోకూడదని రూల్స్ బుక్ లో లేదంటూ వివరిస్తాడు. అయితే తీస్కోండి.. నేను అక్కడే పెడతా.. ఏం జరుగుతుందో చూస్తానంటూ శివాజి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత ఇంట్లోని వాళ్లు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన వినడు. ఈక్రమంలో టేస్టీ తేజ మాట్లాడుతూ.. ఇప్పుడు బాల్స్ తీసుకోండి, శనివారం రోజు నాగార్జున సార్ ని అడుగుదాం, తీసుకోవచ్చా లేదా అని అంటూ చెప్పుకొస్తాడు. ఇలా తాజాగా వచ్చిన ప్రోమో ముగిసింది.

ఇంతకు ముందు జరిగిన టాస్కుల్లో కూడా అమర్ దీప్, రతికా రోజ్ ఫుల్లుగా గొడవ పడ్డారు. బయట జనాలు ఊస్తారు అంటూ అమర్ దీప్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అలాగే రతిక కూడా పక్కకెళ్లి ఆడుకోపో అంటూ చెప్పే డైలాగ్స్ తో వారి మధ్య నడిచిన హీట్ వార్ తెలుస్తోంది. అయితే ఈ రోజు వచ్చే పూర్తి ఎపిసోడ్ వస్తే తప్ప ఏం జరిగిందో తెలియదు. ఎవరు కంటెండర్లు అవుతారో, ఎవరు ఈ రేస్ నుంచి తప్పించుకుంటారో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











