మళ్లీ గేమ్ మార్చిన శివాజి..ఈసారి ప్రశాంత్‌పై ఆగ్రహం,గెలుపునకు అడ్డొస్తాడనే ఇలా చేస్తున్నాడా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. అద్భుతమైన టీఆర్పీతో అంతకంతకూ దూసుకుపోతున్న ఈ షోను చూసేందుకు బుల్లితెర ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున వేచి చూస్తున్నారు. రాత్రి 9 గంటలు అయిందంటే చాలు టీవీల ముందు వాలిపోతూ షో చూస్తున్నారు. తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ.. నచ్చని వారు ఎలిమినేట్ అయిపోతే బాగుండని కోరుకుంటున్నారు. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్ల బంధానికి అంతా ఫిదా అయిపోతున్నారు. వారిని బాండింగ్ చూసి తెగ మురిసిపోతున్నారు. వీరి ముగ్గురికి, ముఖ్యంగా శివాజి, పల్లవి ప్రశాంత్ ల బాండింగ్ అంటే ఇష్టపడేవారికి వారు ఈరోజు షాక్ ఇవ్వబోతున్నారు.
ముఖ్యంగా ఎవిక్షన్ పాస్ కోసం ప్రస్తుతం పోటీ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న టాప్ 5 నుంచి టాప్ 10 మధ్య ఉన్న వారికి పోటీ నిర్వహించగా.. అంబటి అర్జున్ గెలుపొందాడు. అతడికే ఎవిక్షన్ పాస్ వస్తుందని అనుకోగా.. బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈరోజు విడుదల అయిన మొదటి ప్రోమో చూస్తుంటేనే ఆ విషయం అర్థం అయిపోతుంది. ముఖ్యంగా టాప్ 5 లో ఒక్కొక్కరితో ఛాలెంజ్ చేస్తూ.. ఎవిక్షన్ పాస్ కోసం గెలుపొందాలని చెప్పారు. అయితే ముందుగా ఒకరిని ఎంచుకొని ఓ టాస్క్ లో పాల్గొనలనగా.. అర్జున్, యావర్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇందులో యావర్ గెలవగా.. అంబటి అర్జున్ రేస్ నుంచి తప్పించుకున్నాడు.

ఇక సెకండ్ టాస్క్ లో భాగంగా యావర్ కు ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని బాల్ బ్యాలెన్సింగ్ టాస్క్ లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. ఈక్రమంలోనే శివాజి, ప్రియాంక, యావర్ లు టాస్క్ ఆడారు. ఇందులో పల్లవి ప్రశాంత్, శోభా శెట్టిలు ఇద్దరూ సంచాలకులుగా వ్యవహరించారు. ఇందులో భాగంగానే రైతుబిడ్డ తరచుగా ఇలా చేయండి, అలా చేయండి అంటూ కంటెండర్లకు సూచించగా... శివాజి డిస్ట్రబ్ చేయొద్దని పలుమార్లు చెప్పాడు. అయినప్పటికీ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వినకపోవడంతో శివాజి అసహనం వ్యక్తం చేశాడు.
గేమ్ ఆడుతున్నంత సేపు వద్దురా అలా చెప్పకు, డిస్ట్రబ్ చేయకు, డిస్ట్రబ్ చేయకు అంటూ వివరించాడు. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం అదే కంటిన్యూ చేశాడు. ముందుగా ప్రియాంక ఈ బాల్ బ్యాలెన్సింగ్ టాస్క్ లో ఓడిపోగా.. ఆ తర్వాత శివాజి ఈ గేమ్ నుంచి తప్పుకున్నాడు. తన గేమ్ పల్లవి ప్రశాంత్ వల్లే డిస్ట్రబ్ అయిందని మొట్ట మొదటి సారి రైతుబిడ్డపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది కాదన్నా అంటూ పల్లవి ప్రశాంత్ ఏదో చెప్పాలని ప్రయత్నించినప్పటికీ ఆయన వినలేదు. నువ్వు ఏదైనా సరే లాస్ట్ లోనే చెప్పాలి కానీ మధ్యలో చెప్పకూడదంటూ వాదించాడు శివాజి.
ఏం మాట్లాడాలో తెలియక పల్లవి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత శివాజి చేతులతో ఇలా అనడం, అలా అనడం సరికాదని అన్నాడు. దీనికి రైతుబిడ్డ స్పందించి నువ్వు గేమ్ చూస్కోవాలన్నా, మమ్మల్ని కాదని అన్నాడు. ఇదంతా అయ్యాక ఎవరు విన్నర్ అనేది ప్రకటించాలని చెప్పగా.. శోభా శివాజి ఎక్కువ సేపు బాల్స్ ను ఆపారు కానీ అంటూనే అతడిని గేమ్ నుంచి తీసేసింది. దీనికి శివాజి మరోసారి ఫైర్ అయ్యాడు. ఇద్దరూ గట్టిగట్టిగా అరుచుకున్నారు. ఇలా ఈ ప్రోమో ముగిసింది. పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











