Bigg Boss Telugu 7: శివాజి ఊహించని నిర్ణయం.. శత్రువులంతా హ్యాపీ.. నువ్వు మామూలోడివి కాదు బాసూ!
సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అంతలా ఈ కార్యక్రమాన్ని ఇక్కడి ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. దీంతో నిర్వహకులు చిత్ర విచిత్రమైన టాస్కులు, రకరకాల ఎమోషన్స్‌తో ఈ షో ఆద్యంతం ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో సీజన్‌ను సైతం మొదలు పెట్టారు. ఇందులో ఎవరూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శివాజి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎనిమిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేయడం కోసం 'బీబీ మారథాన్' అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. పలు రౌండ్లలో జరిగిన ఈ టాస్కు ఎంతో ఆసక్తికరంగా సాగింది. చివరకు ఇందులో పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ, సందీప్ మాస్టర్, శోభా శెట్టిలు గెలిచి ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.

ఐదుగురు కంటెండర్లలో ఒకరిని ఇంటి కెప్టెన్‌గా నియమించే అధికారాన్ని బిగ్ బాస్ మిగిలిన కంటెస్టెంట్లకు ఇచ్చాడు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కెప్టెన్ అవడానికి అనర్హులు అని భావించిన వారి మెడలో మిరపకాయలతో కూడిన దండను వేయాల్సి ఉంటుంది. అలా ఎవరికైతే తక్కువ దండలు వస్తాయో ఆ కంటెస్టెంటే ఇంటికి తదుపరి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ వెల్లడించాడు.
మిరపకాయల దండలతో రూపొందించిన కెప్టెన్సీ టాస్కు ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. ముఖ్యంగా ఇందులో శోభా శెట్టి తనకు ఓటు వేసిన పలువురు కంటెస్టెంట్లతో గొడవలు పెట్టుకుంది. మొత్తానికి ఆమెకే ఎక్కువ దండలు వచ్చాయి. ఆ తర్వాత ప్రశాంత్‌కు రెండు, ప్రియాంకకు రెండు, సందీప్ మాస్టర్‌కు ఒక దండ వచ్చాయి. దీంతో చివరి రౌండ్ ఆసక్తిగా మారింది.
బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కులో భాగంగా శివాజి వంతు వచ్చింది. అప్పుడు అతడు సేఫ్ గేమ్ లేదా తనకు నచ్చని గౌతమ్ కృష్ణ మెడలో దండ వేసి సందీప్‌తో టై చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా శివాజి తన దండను సందీప్ మాస్టర్ మెడలో వేశాడు. అప్పుడు సందీప్‌ను కూడా కన్విన్స్ చేసేలా ఒక కారణం చెప్పాడు. దీంతో గౌతమ్ ఇంటి కెప్టెన్‌గా నిలిచాడు.
శివాజి తనకు సపోర్ట్ చేసి ఇంటి కెప్టెన్‌గా చేయడంతో గౌతమ్ కృష్ణ తెగ సంతోషపడ్డాడు. అప్పుడు 'ఈ శివాజీ అందరికీ కావాల్సిన వాడురా. ఏ ఒక్కడి కోసం నేను ఏదీ చేయను. నువ్వు హ్యాపీనే కదా' అంటూ గౌతమ్‌తో చెప్పాడు. అనంతరం శివాజి 'వచ్చే వారం నాకు ఛాన్స్ వస్తే మాత్రం నీకోసం త్యాగం చేస్తాను అమ్మతోడు' అంటూ సందీప్ మాస్టర్‌కు సైతం హామీ ఇచ్చాడు.
మొత్తానికి ఈ మిరపకాయల టాస్కులో అందరితో గొడవలు పెట్టుకుని శోభా శెట్టి తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోగా.. శివాజి మాత్రం హుందాగా వ్యవహరించి మంచి పేరును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తన పట్ల వ్యతిరేకంగా ఉన్న గౌతమ్‌ను సైతం ఈ నిర్ణయంతో పడేశాడు. ఫలితంగా శివాజి పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications