Bigg Boss Telugu7: శుభశ్రీ మీదకు వచ్చిన శివాజీ... బిగ్‌బాస్‌తో చెప్పుకుని బాధపడ్డ లేడీ కంటెస్టెంట్
బిజ్ బాస్ సీజన్ 7 ఆసక్తిగా సాగుతోంది. ఇక నాలుగు వారంలో అడుగుపెట్టిన ఈ షో... నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ మొదలయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ఓ బ్యాంకులాగా మారి.. కంటెస్టెంట్స్ అంతా కస్టమర్లుగా మారారు. ఈ ఆటలో పవర్ అస్త్రాలు సాధించిన శివాజీ, సందీప్, శోభా శెట్టి మాత్రం బ్యాంకర్లుగా మారారు. ఇక ఒక్కో బ్యాంకర్ కు బిగ్ బాస్ 100 కాయిన్స్ ఇచ్చాడు. వాటిని నచ్చిన వారికి ఇచ్చుకోవాలని సూచించాడు.
అయితే కంటెస్టెంట్స్ అంతా బ్యాంకర్స్ దగ్గరకు వచ్చి బతిమిలాడుకున్నారు. నాకు కాయిన్స్ ఇవ్వు అంటూ ప్రతి ఒక్కరు ఆ ముగ్గురు బ్యాంకర్స్ శోభా శెట్టి, శివాజీ, సందీప్ లను ఐస్ చేయడం మొదలు పెట్టారు. ఇక వారు కూడా అందరికి ఇస్తామంటూ చెప్పుకు వచ్చారు. ఇక సందీప్ అయితే ప్రత్యేక టాస్కులు పెట్టి కాయిన్స్ పంచడం స్టార్ట్ చేశాడు. తేజకు యావర్ తో పచ్చిగుడ్డు తాగించాలని... రతికకు ప్రియాంకతో గొడవ పడాలని ఇలా టాస్కులు ఇచ్చి ఎంటర్ టైన్మెంట్ చేశారు.

అయితే ఈ గేమ్ లో తేజ 51 కాయిన్స్, గౌతమ్ 24 కాయిన్స్, ప్రియాంక 41కాయిన్స్, అమరదీప్ 41కాయిన్స్, రతిక 35కాయిన్స్, యవర్ 43, ప్రశాంత్ 33కాయిన్స్, శుభశ్రీ 31 కాయిన్స్ గెలుచుకున్నారు. అయితే ఈ కాయిన్స్ అన్నింటిని బిగ్ బాస్ ఎవరికి వారు సేఫ్ లాకర్స్ లో దాచుకోమన్నారు. కంటెస్టెంట్స్ అంతా అదే పనిచేశారు. ఆ సేఫ్ లాకర్స్‌పై శుభశ్రీ కన్నేసింది. అక్కడికి వెళ్లి కాయిన్స్ కాజేయాలని చూసింది. కానీ బ్యాంకర్స్ మాత్రం సేఫ్ లాకర్స్ కు గార్డులుగా ఉన్నారు.
సేఫ్ లాకర్స్ దగ్గరకు వచ్చిన శుభశ్రీతో శివాజీ కాసేపు సరదాగా మాట్లాడారు. కానీ అంతలోనే శుభశ్రీని కార్నర్ చేసి తనకు చాలా దగ్గరగా నిలబడ్డాడు శివాజీ. 'అంత దగ్గరగా రావద్దు ప్లీజ్' అని శుభశ్రీ రిక్వెస్ట్ చేసింది. ఇది నా ప్రాపర్టీ అంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు శివాజీ. లేదు ఇది మీ ప్రాపర్టీ కాదు అని శివాజీ వ్యాఖ్యలను ఒప్పుకోలేదు శుభ శ్రీ. ప్లీజ్ వెనక్కి వెళ్లండంటూ దండం పెట్టింది శుభ.
ఇక శివాజీ నేను మిమ్నల్ని టచ్ చేయలేదు. మీరే నన్ను టచ్ చేస్తున్నారని చెప్పుకువ్చచాడు. అది శుభశ్రీ ఒప్పుకోలేదు. నువ్వు చెప్తే నేను వెళ్లను అనేశాడు శివాజీ. ఆ తర్వాత బిడ్డ అని పిలుస్తూ మీదకు వస్తున్నారని, అది కరెక్ట్ కాదని శివాజీని ఉద్దేశిస్తూ తనలో తాను మాట్లాడుకుంది శుభశ్రీ. అది ఓవరాక్షన్ అని వ్యాఖ్యలు చేసింది. ఇక ఇది చూసిన ప్రేక్షకులు శివాజీ మొదటి నుంచి ఓవరాక్షన్ చేస్తున్నారని... ఇందులో శివాజీదే తప్పు అని కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











