నాగార్జునకు ఇచ్చిపడేసిన శివాజి: ఒక్క మాటతో పరువు పాయే.. హోస్టునే అలా అన్న తొలి కంటెస్టెంట్
ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కంటెంట్‌ను ప్రసారం చేస్తూ.. తక్కువ సమయంలోనే సెన్సేషనల్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న షోనే బిగ్ బాస్. ఇలా ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను ఇది పూర్తి చేసుకుంది.
ఈ ఊపులోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో దాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఇప్పుడు ఇది చివరి దశకు చేరుకుంది. దీంతో ఎన్నో ఊహించని సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హోస్ట్ నాగార్జునకు శివాజి షాక్ ఇచ్చాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి మరి!

చివరి వారంలోనూ గొడవలతో: బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్‌లోనూ చివరి రెండు వారాలు ఆటపాటలతో సందడిగా నడుస్తుంటాయి. కానీ, ఏడో సీజన్‌లో మాత్రం ఓట్ అప్పీల్ టాస్కులను తీసుకు వచ్చారు. ఇవి మాత్రం బీభత్సమైన గొడవలతో సాగాయి. కంటెస్టెంట్లు టాస్కులు జరిగేటప్పుడు మాత్రమే కాదు.. ఓటింగ్ వేసే సమయంలోనూ వాగ్వాదాలకు దిగారు. దీంతో గత వారంలో ఎన్నో తప్పులు జరిగాయి.
పీక మీద కాలేసి తొక్కుతాను: గత వారంలో జరిగిన టాస్కుల్లో శివాజి కూడా అదుపు తప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శోభా శెట్టితో అతడు ఓ రేంజ్‌లో గొడవకు దిగాడు. ఆమె కూడా మర్యాద లేకుండా ప్రవర్తించి మరింతగా రెచ్చిపోయింది. అనంతరం శివాజి 'మా ఇంట్లో అమ్మాయిలైతే పీక మీద కాలేసి తొక్కేవాడిని' అన్నాడు. ఇదే విషయాన్ని శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ప్రస్తావించాడు.
ప్రశాంత్‌ను టార్చర్ చేశారు: తప్పు చేశాడంటూ నాగార్జున ప్రశ్నించగానే శివాజి 'ఏముంది బాబు గారు. వాళ్లు రెండు వారాలుగా ప్రశాంత్‌ను టార్చర్ చేస్తున్నారు. ఏ పాయింట్ లేకుండా ఎగబడుతున్నారు. తోసేస్తున్నారు. అందుకే నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో నేను అన్న మాట అది' అని చెప్పాడు. అప్పుడు నాగార్జున 'అయితే ఆ బాధలో పీకుతావా' అని అడగ్గా.. తప్పు చేస్తే కొడతాను అని షాకిచ్చాడు.
నిజంగా కాలేసి తొక్కుతావా: అనంతరం నాగార్జున 'మన ఇంట్లో ఆడపిల్ల అయితే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని అన్నావు. ఆ భాష ఏంటి శివాజీ' అంటూ సీరియస్ అయ్యాడు. దీనికతడు 'బాబు గారు మాది పల్నాడు ప్రాంతం.. మా మాట తీరు అలానే ఉంటుంది' అన్నాడు. దీంతో నాగార్జున 'నాగమ్మ - బ్రహ్మనాయుడు' కథను చెప్పి నువ్వు అలాంటి మాటలు అనడం పద్దతిగా లేదు అన్నాడు.
ఆడియెన్స్‌కు కూడా ప్రశ్న: తర్వాత నాగార్జున 'మరి నువ్వు ఇలా రెచ్చిపోతే ఎలా' అంటూ ఆడియెన్స్‌లోని ఓ అమ్మాయితో మాట్లాడించాడు. ఆమె 'మేము కూడా మీరు అన్న మాట తీసుకోలేకపోతున్నాం. ఆడపిల్లలను అలా అనకూడదనిపించింది సార్' అని శివాజి ముఖం మీదనే అనేసింది. దీనికతడు 'మరి మగపిల్లల్ని ఏమైనా అనేయొచ్చా' అని ఎదురు ప్రశ్న వేయడంతో ఆమె షాక్ అయింది.
ఆడవాళ్లకు సారీ చెప్పాలి: నాగార్జున ఏం చెప్పినా శివాజి మాత్రం వాదిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా అతడు అన్న మాటలు షోను చూస్తున్న ఆడవాళ్లు అందరినీ అన్నట్లుగా ఉందని హోస్ట్ ప్రస్తావించాడు. అప్పుడు శివాజి 'ఏదో మామూలుగా అన్న మాటలను అందరికీ ఆపాదించడం తప్పు' అని సూటిగా చెప్పాడు. తర్వాత నాగార్జున సారీ చెప్పమన్నా అతడు మాత్రం వ్యతిరేకిస్తూనే మాట్లాడాడు.
చూసి మార్చుకోరా అంటూ: శివాజి 'వీళ్లేం ఆడపిల్లలు రా. ఇలానే చేస్తే వీళ్లను చేసుకునే వాళ్లు భయపడిపోరూ' అన్న వీడియోను కూడా నాగార్జున చూపించాడు. అప్పుడాయన 'నీ మాటల వల్ల వాళ్లను చేసుకునే వాళ్లు నిర్ణయం మార్చుకుంటే ఏంటి' అన్నాడు. అప్పుడు శివాజి 'వాళ్లు ప్రవర్తిస్తున్న పద్దతి చూసి మార్చుకోరా' అని దిమ్మతిరిగే పాయింట్ మాట్లాడాడు. దీంతో అందరూ షాక్ అయిపోయారు.
షోలో ఒక్కడు.. రిస్క్ చేసి: శివాజిని కడిగి పాడేయాలని వచ్చిన నాగార్జునకు చివరకు బిగ్ షాకే తగిలింది అని చెప్పాలి. ఈ వ్యవహారం మొత్తంలో హోస్ట్ చప్పబడ్డట్టే అనిపించింది. అదే సమయంలో గ్రాండ్ ఫినాలేకు చేరువ అయిన వేళ శివాజి హోస్టును ఎదురించి మాట్లాడి రిస్క్ చేశాడని అనిపించింది. తద్వారా నాగార్జుననే ప్రశ్నించిన ఏకైక కంటెస్టెంట్‌గా శివాజి నిలిచాడు.


Click it and Unblock the Notifications











