Bigg Boss Telugu 7 Finale: డబ్బు తీసుకోమని యావర్‌కు హింట్.. అందుకే 15 లక్షలకు ఓకే.. ఎవరు చెప్పారంటే!
ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని కాన్సెప్టు.. మజాను పంచే ఎంటర్‌టైన్‌మెంట్.. ఊహించని ఎలిమినేషన్స్.. అబ్బురపరిచే ట్విస్టులు.. భావోద్వేగాలతో కూడిన ఎమోషనల్ సీన్స్ ఇలా ఎన్నో సంఘటనల సమాహారమే బిగ్ బాస్ షో.
రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి తెలుగులో విశేషమైన స్పందన దక్కింది. ఫలితంగా ఇప్పటికే ఎన్నో సీజన్లు కూడా పూర్తి అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవబోతుంది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ యావర్ డబ్బు తీసుకున్నాడని తెలిసింది. దాని వెనుక కారణం ఏంటో మీరే చూడండి!

సక్సెస్‌ఫుల్.. ఆరుగురు: ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రారంభం అయిన బిగ్ బాస్ ఏడో సీజన్ ఎంతో రసవత్తరంగా సాగింది. మొదటి నుంచీ పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. ఇక, ఈ సీజన్‌లోకి వచ్చిన మొత్తం 19 మంది కంటెస్టెంట్లలో ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరి, శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అర్జున్‌లు ఫినాలేలోకి అడుగు పెట్టి టైటిల్ పోటీలో ఉన్నారు.
శనివారమే షూట్ స్టార్ట్: బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే కోసం ఎప్పుడో ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయాయి. శుక్రవారమే కంటెస్టెంట్లు, సెలెబ్రిటీలకు సంబంధించిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు పూర్తి అవగా.. శనివారం అసలైన ఎపిసోడ్‌ను మొదలు పెట్టారు. ఇందులో చాలా ముఖ్యమైన అంశాలను షూట్ చేశారు. ప్రత్యేకించి చాలా మంది గెస్టులకు సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.
ఎలిమినేషన్స్ కూడా: బిగ్ బాస్ ఫినాలే ఓటింగ్‌లో చివరి మూడు స్థానాల్లో నిలిచిన ముగ్గురు కంటెస్టెంట్లను శనివారం ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ చేయబోతున్నారని ఓ న్యూస్ ముందే లీకైంది. అలా కాకుండా ఏకంగా నలుగురు కంటెస్టెంట్లను బయటకు పంపినట్లు తెలిసింది. అందులో ముందుగా అంబటి అర్జున్, తర్వాత ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శివాజిలను ఎలిమినేట్ చేశారని సమాచారం.
యావర్‌కు 15 లక్షలు: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో హౌస్‌లోని కంటెస్టెంట్లకు డబ్బులు కూడా ఆఫర్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిన తర్వాత ఆ అమౌంట్‌ను పెంచుతూ ఉంటారు. అలా హౌస్‌లో నలుగురు సభ్యులు ఉన్నప్పుడు బిగ్ బాస్ రూ. 15 లక్షలు ఆఫర్ చేశాడు. దీనికి ప్రిన్స్ యావర్ ఓకే చెప్పాడు. ఫలితంగా ఆ డబ్బు తీసుకుని రేసు నుంచి తప్పుకున్నాడు.
యావర్ గుడ్ డెసీషన్: ప్రిన్స్ యావర్ డబ్బులు తీసుకుని తప్పుకున్నాడని వార్త బయటకు రావడంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో ఎలాగే అతడు విజయం సాధించే అవకాశం లేదు. ఈ సీజన్‌లో పల్లవి ప్రశాంత్ కానీ, అమర్‌దీప్ చౌదరి కానీ, శివాజి కానీ విజయం సాధించే అవకాశం ఉంది. అందుకే ఇలాగైనా యావర్ కాస్త లాభపడ్డాడని వాళ్లు చెప్పుకుంటున్నారు.

యావర్ వెనుక శివాజి: అసలు ప్రిన్స్ యావర్ దేనికీ కాంప్రమైజ్ కాడు. అలాంటిది రూ. 15 లక్షలు తీసుకుని ఎలా తప్పుకున్నాడు అనే సందేహం కూడా చాలా మందికి వస్తోంది. అయితే, తాజా ఎపిసోడ్‌లోనే దీనికి సమాధానం ఉంది. ఇందులో శివాజి 'అరేయ్ యావర్.. గ్రాండ్ ఫినాలేలో చాన్స్ వస్తే వదులుకోకు. మంచి నిర్ణయం తీసుకో. నేను చెప్పేది అర్థం అవుతుందిగా' అని చెప్పాడు. ఇది చూసిన వాళ్లంతా యావర్ అందుకే డబ్బు తీసుకున్నాడని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











