Bigg Boss Telugu 7: ప్రశాంత్, యావర్‌లను కాదని అమర్‌దీప్‌కు శివాజి సాయం.. బిగ్‌బాస్‌ ప్లాన్ అదిరిందిగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం ఇంట్లో 8 మంద కంటెస్టెంట్లు మాత్రమే ఉండగా.. ఈవారం ఎలిమినేషన్స్ లో చాలా మంది ఉన్నారు. ఒక్క అమర్ దీప్ తప్ప ప్రియాంక జైన్, శోభాశెట్టి, గౌతమ్ కృష్ణ, అంబటి అర్జున్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శివాజిలు నామినేషన్లలో ఉన్నారు. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ అంతా వార్ వన్ సైడే అన్నట్లుగా సాగాయి. అంతా కలిసి శివాజిని టార్గెట్ చేశారు. ఈసారి ఎక్కువ నామినేషన్ ఓట్లు ఆయనకే పడ్డాయి. అయితే నామినేషన్స్ అయిపోయిన వెంటనే బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ నిర్వహించారు.

ఈరోజు వచ్చిన మొదటి ప్రోమో చూస్తుంటేనే ఆ విషయం అర్థం అయిపోతుంది. ముందుగా జరిగిన టాస్క్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, అమర్ దీప్, గౌతమ్ కృష్ణలు ఔట్ కాగా.. ప్రియాంక జైన్, అంబటి అర్జున్ మాత్రమే చివర వరుకు వెళ్లారు. అయితే చివరి రౌండ్ లో అంబటి అర్జున్ గెలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గేమ్ ఆడుతూ ప్రియాంక జైన్ కింద పడినట్లు ప్రోమో చూస్తోంది. ఇక తాజాగా విడుదల అయిన రెండ్ పోరమోలో బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే రెండో టాస్క్ ను ఇచ్చాడు.

Sivaji Help to Amardeep in Ticket to Finale Task in Bigg Boss Telugu 7 Check Details

ఇందులో ఓ గదిలో ఉన్న బొమ్మలను తీసుకువచ్చి తమకు కేటాయించిన టేబుల్స్ పై పెట్టాల్సి ఉంటుంది. ఇందులో శివాజి, శోభాశెట్టిలు తప్ప అంతా ఎక్కువగానే బొమ్మలు తీసుకు వచ్చారు. అయితే వీరద్దరి వద్ద తక్కువ బొమ్మలు ఉండడంతో వాటిని మిగతా కంటెస్టెంట్లకు ఇవ్వాలని బిగ్ బాస్ సూచించారు. అయితే అప్పటికే శివాజి అమర్ దీప్ కు మాట ఇచ్చినట్లు అమర్ గుర్తు చేశాడు. పాయింట్లు ఎన్ని ఉన్నాయి, నాకే ఇవ్వాలి మాటిచ్చావ్ అంటూ అమర్ దీప్ అడగడం మనం ప్రోమోలో చూడవచ్చు. అయితే శోభా ఎలాగూ నీకే ఇస్తుందిరా నేనే వీళ్లకు ఇస్తానంటూ ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ లను చూపిస్తాడు శివాజి.

కానీ బిగ్ బాస్ చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి ఒకే కంటెస్టెంట్ కు తమ పాయింట్లు ఇవ్వాలని వివరించాడు. దీంతో శివాజి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంతేకాకుండా అబ్బా బిగ్ బాస్ అంటూ మొహం పైకి పెట్టి అరిచాడు. దీన్ని బట్టి చూస్తుంటే శివాజి, శోభా శెట్టిలు ఇద్దరూ కలిసి అమర్ దీప్ కు తమ పాయింట్లను ఇచ్చినట్లు అర్థం అవుతోంది. నామినేషన్స్ లో అంత రచ్చిన స్పా బ్యాచ్ కు శివాజి సాయం చేయడాన్ని నిజంగా ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ తో ఆయన అలా చేయాల్సి వచ్చింది.

ఇదంతా ఇలా ఉండగా.... టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఓడిపోయినా శోభాశెట్టి మాత్రం విపరీతంగా ఏడుస్తూ కనిపించింది. గెలిచిన ప్రతీ సారి రచ్చ చేయడం.. ఓడిపోయిన వెంటనే కన్నీళ్లు పెట్టడం ఆమెకు ముందు నుంచీ అలవాటు. అయితే ఈ టాస్క్ లు అన్నింట్లో అంబటి అర్జున్ గెలిచాడానే వార్త నెట్టింట వైరల్ అయింది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ వస్తే తప్ప ఎవరు టికెట్ టు ఫినాలే టాస్క్ పొందారనే దానిపై క్లారిటీ వచ్చేలా లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X