Bigg Boss 7 Telugu: షోలో షాకిచ్చే సీన్స్.. టీషర్ట్ లోపల పెట్టేసిన శోభ.. గాయంతో విలవిలలాడిన శివాజి

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులను దోచుకుని.. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను రాబట్టి నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. ఇలా ఇప్పటికే ఈ కార్యక్రమం ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో దాన్ని మొదలు పెట్టారు. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తున్న ఈ సీజన్ ఆరంభం నుంచే మజాను పంచుతూ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో ఊహించని ఎన్నో సీన్స్ కనిపించాయి. ఆ సంగతులు మీకోసమే!

ఏడో సీజన్ ఐదో వారంలో మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కును తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న పది మందిని ఐదు జంటలుగా మారాలని సూచించాడు. అందుకు తగ్గట్లే అమర్‌దీప్ - సందీప్, ప్రియాంక - శోభ, ప్రిన్స్ - తేజ, శివాజి - ప్రశాంత్, గౌతమ్ - శుభశ్రీ జంటలుగా మారారు. వీళ్లకు పలు రకాల టాస్కులు ఇచ్చి.. కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేయబోతున్నారు.

Sivaji Injured and Some Arguments in Bigg Boss First Captaincy Task

కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో భాగంగా మొదటి రౌండ్‌లో స్మైలీ బోర్డును పెట్టి.. అందులో మిస్ అయిన పళ్లు (దంతాలు) వెతికి తీసుకు వచ్చి గంట కొట్టాలని టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచిన టీమ్‌కు మూడు స్టార్లు, రన్నరప్ టీమ్‌కు రెండు స్టార్లు, మూడో స్థానంలో వచ్చిన టీమ్‌కు ఒక స్టార్ ఇస్తామని చెప్పాడు.

ఇందుకోసం బురద, నురగ ఉన్న నీళ్ల తొట్టేల్లో పాకుకుంటూ వెళ్లాలి. ఈ రౌండ్‌లో మొదటి ఒక కంటెస్టెంట్ పళ్ల కోసం వెళ్లగా.. మరో కంటెస్టెంట్ బోర్డ్ దగ్గర ఉన్నారు. దీంతో ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఈ టాస్కులో పాల్గొనాలని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఈ టాస్కులో శోభా శెట్టి వేరే టీమ్ దంతాన్ని తన టాప్‌లో దాచుకుంది. తర్వాత ఆమె బ్లాక్‌మెయిలింగ్ గేమ్ ఆడి చిరాకు తెప్పించింది.

Sivaji Injured and Some Arguments in Bigg Boss First Captaincy Task

ఈ రౌండ్‌లో భాగంగా పల్లవి ప్రశాంత్‌తో పాటుగా శివాజి కూడా ఇందులో పాల్గొన్నాడు. ఆ సమయంలో అతడి భుజానికి గాయం అయింది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కుర్రాళ్లకు ధీటుగా గేమ్ ఆడాడు. ఇలా వీళ్లిద్దరూ కలిసి అందరి కంటే ముందే స్మైలీ బోర్డులో ఉన్న దంతాలను మొత్తం ఫిక్స్ చేసేసి గంట కొట్టారు. ఆ తర్వాత అమర్‌దీప్ టీమ్ కూడా గంట కొట్టింది.

ఈ రెండు జట్ల తర్వాత శోభ శెట్టి టీమ్, గౌతమ్ టీమ్ గంట కొట్టింది. చివర్లో ప్రిన్స్ యావర్ టీమ్ కొట్టింది. అయితే, ఆ తర్వాతనే అసలు ట్విస్ట్ కనిపించింది. ముందుగా గంట కొట్టిన శివాజి టీమ్, అమర్‌ టీమ్ ఫౌల్ గేమ్ ఆడారాని సంచాలకులు అయిన శోభా శెట్టి, యావర్ గుర్తించారు. దీంతో ఈ రెండు టీమ్‌లను డిస్‌క్వాలిఫై చేయాలని అనుకున్నారు. దీంతో కొన్ని గొడవలు జరిగాయి.

Sivaji Injured and Some Arguments in Bigg Boss First Captaincy Task

ఇందులో విజేత ఎవరన్న దానిపై సంచాలకులకు క్లారిటీ రాలేదు. దీంతో ప్రిన్స్, శోభా కలిసి ఒక నిర్ణయం తీసుకోగా.. శివాజి, అమర్ టీమ్‌లు వాళ్లతో విభేదించాయి. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని మళ్లీ మార్చుకున్నారు. కానీ, మిగిలిన వాళ్లు అభ్యంతరం తెలిపారు. ఇలా ఈ ఎపిసోడ్‌ స్పష్టత లేకుండా ముగిసింది. కానీ, ఇందులో ఊహించని ఎన్నో సీన్స్ ప్రేక్షకులకు మజాను పంచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X