బిగ్ బ్రేకింగ్: బిగ్ బాస్‌లో పెను సంచలనం.. షో నుంచి శివాజి ఎలిమినేట్.. ఆమె కోసమేనా?

దేశ వ్యాప్తంగా చాలా భాషల్లోనూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అయితే, అన్నింటి కంటే ఎక్కువ ఆదరణను అందుకుంటూ నేషనల్ రికార్డులను బద్దలు కొడుతోన్నది మాత్రం తెలుగులోనే అని చెప్పాలి. అందుకే ప్రతి ఏడాది ఒకటి చొప్పున ఏకంగా ఆరు రెగ్యూలర్ సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడోది కూడా ప్రారంభమై ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షో నుంచి శివాజి బయటకు వెళ్లిపోయాడు. ఆ వివరాలు మీకోసమే!

పేరుకు తగ్గట్లే క్రేజీ కంటెంట్:రొటీన్‌గా సాగిపోతోన్న బిగ్ బాస్‌ను కొత్త పుంతలు తొక్కించేందుకు ఏడో సీజన్‌లో ఉల్టా పుల్టా కాన్సెప్టును పరిచయం చేశారు. ఇందులో భాగంగా మొదటి రోజు నుంచే ఎన్నో రకాల సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. అప్పుడప్పుడు ట్విస్టులు కూడా చూపిస్తున్నారు. మొత్తం ప్రేక్షకులకు మజాను పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సక్సెస్ అవడంతో షో కూడా రంజుగానే సాగిపోతోంది.

Sivaji Left From Bigg Boss House Creates Sensation In Social Media

టైటిల్ ఫేవరెట్‌ అయిన హీరో:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే, అందులో తక్కువ మంది మాత్రమే బాగా హైలైట్ అయ్యారు. వారిలో హీరో శివాజి మాత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆటకు ఆట, మైండ్ గేమ్‌కు మైండ్ గేమ్ చూపిస్తూ టైటిల్ ఫేవరెట్‌ అనిపించుకున్నాడు. దీంతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతూనే ఉంది.

పావని ఎలిమినేట్.. త్యాగానికి:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఫస్ట్ వచ్చిన 14 మంది కాకుండా.. మళ్లీ ఐదుగురు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు మళ్లీ 14 మంది కంటెస్టెంట్లు అయ్యారు. అయితే, దురదృష్టవశాత్తూ గడిచిన ఆరు వారాల్లోనూ ఆరుగురు లేడీ కంటెస్టెంట్లే ఎలిమినేట్ అయ్యారు. ముఖ్యంగా ఈ వారం నయని పావని వెళ్లిపోయింది. దీంతో శివాజి ఆమె కోసం త్యాగం చేయడానికి సిద్ధం అయ్యాడు.

Sivaji Left From Bigg Boss House Creates Sensation In Social Media

ఆరోగ్య సమస్య ఉందంటూ:ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన నయని పావని హౌస్‌మేట్లతో తనకు ఉన్న బాండింగ్‌ను బయట పెట్టింది. ఆ సమయంలో శివాజితో చాలా క్లోజ్ అయ్యానని ఎమోషనల్ అవుతూ వివరించింది. అప్పుడతను 'సార్ నాకు చేయి నొప్పి ఉంది. బ్యాక్‌ పెయిన్ కూడా వస్తుంది. కాబట్టి ఆమె స్థానంలో నన్ను బయటకు పంపించేయండి' అంటూ రిక్వెస్ట్ చేశాడు.

షో నుంచి శివాజి బయటకు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా ఉంటూ.. కచ్చితంగా గెలిచే సత్తాను కలిగి ఉన్న హీరో శివాజి.. ఉన్నట్లుండి షో నుంచి బయటకు వచ్చేశాడు. దీన్ని నిన్నటి ఎపిసోడ్ తర్వాత వచ్చిన కమింగ్ అప్ ప్రోమోలో చూపించారు. ముందుగా కన్‌ఫెషన్ రూంకు వెళ్లిన శివాజిని బిగ్ బాస్ 'మీరు బయటకు వచ్చేయండి' అని చెప్పాడు. దీంతో అతడు ఉన్నపళంగా వెళ్లిపోయాడు.

Sivaji Left From Bigg Boss House Creates Sensation In Social Media

ఆమె కోసమే త్యాగం చేశాడా:బిగ్ బాస్ హౌస్ నుంచి శివాజి బయటకు వచ్చిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. దీంతో అతడి పేరు ట్విట్టర్‌లో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అయితే, శివాజి.. నయనీ పావని కోసమే త్యాగం చేశాడా అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

మెడికల్ ఎమర్జెన్సీ కోసమే:విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కొద్ది రోజులుగా గాయాలతో బాధ పడుతున్న హీరో శివాజిని పెద్ద డాక్టర్లకు చూపించడం కోసమే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించారని తెలిసింది. వైద్య పరీక్షల తర్వాత మళ్లీ అతడిని హౌస్‌లోకి తీసుకు వచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మొత్తానికి దీనిపై శివాజి ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X