Bigg Boss 7 Telugu: శివాజి సెల్ఫ్ ఎలిమినేషన్.. మైక్ విసిరేసి మరీ బయటకు.. షోలో పెను సంచలనం
సరికొత్త టాస్కులు, కుట్రలు కుతంత్రాలు, గ్రూపు తగాదాలు, మిడ్ నైట్ మసాలా సన్నివేశాలు ఇలా ఎన్నో రకరకాల పరిణామాలతో సాగే ఏకైక షో బిగ్ బాస్. అందుకే అసలే మాత్రం తెలియని కాన్సెప్టుతో వచ్చినా.. తెలుగు ప్రేక్షకుల దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించారు.
ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ప్రసారం చేస్తున్నారు. ఇందులో తాజా ఎపిసోడ్‌లో శివాజి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. అసలేమైంది? ఆ సంగతులేంటో చూద్దామా!

అదిరిపోయే కంటెంట్‌తో: తెలుగు బిగ్ బాస్ షోలో గతంలో వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఏడో దానిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అంతేకాదు, ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను చూపిస్తూ మజాను పంచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎన్నో సర్‌ప్రైజ్‌లను ఇస్తున్నారు.

శివాజి టైటిల్ ఫేవరెట్‌గా: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే, అందులో అతి తక్కువ మంది మాత్రమే స్పెషల్ ఫోకస్ అయ్యారు. ముఖ్యంగా హీరో శివాజి మాత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆటకు ఆట, మైండ్ గేమ్‌కు మైండ్ గేమ్ చూపిస్తూ టైటిల్ ఫేవరెట్‌గా నిలిచాడు. దీంతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూనే ఉంది.
పవర్ పోయినా.. టాప్‌లో: ఏడో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటోన్న శివాజి రెండో వారంలో పవర్ అస్త్రను గెలుచుకున్నాడు. కానీ, గత వారంలో జరిగిన ఓ పొరపాటు కారణంగా అతడి అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితేనేం తాజా వారంలో జరుగుతున్న మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కులో ప్రశాంత్‌తో కలిసి అదరగొట్టేశాడు. ఫలితంగా ఈ టాస్కులో అత్యధిక స్టార్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు.
కాఫీ గురించి కోప్పడ్డాడు: కాఫీ అనేది తనకు వీక్‌నెస్ అని బిగ్ బాస్ హౌస్‌లో శివాజి పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, రెండు మూడు రోజుల నుంచి అతడికి హౌస్‌లో కాఫీ రావడం లేదు. దీంతో బిగ్ బాస్‌కు పలుమార్లు రిక్వెస్ట్ చేశాడు. అయినా వినకపోవడంతో ఏకంగా గొడవకు దిగిపోయాడు. అంతేకాదు, షో నుంచి వెళ్లిపోతా అంటూ బెదిరిస్తున్నాడు. అయినా బిగ్ బాస్ కనికరించడం లేదు.
వీడెవడ్రా... బొక్కలోది: తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శివాజి మరోసారి బిగ్ బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'మీరు బాధగా ఉంటే దూరం వెళ్లి ఒంటరిగా కూర్చుంటారు. నేను మాత్రం కాఫీ తాగుతాను. అది నా వీక్‌నెస్. వీడెవడ్రా కాఫీ అడిగితే పంపించడు. బొక్కలోది కామెడీ చేయమంటే ఎలా వస్తుందిరా' అంటూ అక్కడున్న వాళ్లతో అన్నాడు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారిపోయింది.

నేను ఆడను బిగ్ బాస్: గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్కులోని ఐదు జంటల్లో తక్కువ స్టార్లు ఉన్న శోభా, ప్రియాంక టీమ్‌ను డిస్‌క్వాలిఫై చేశారు. ఆ తర్వాత ఇందులో చివరి రౌండ్ లెటర్ టాస్క్ గురించి చెప్పాడు. అది విన్న వెంటనే శివాజి 'నేను ఈ గేమ్ ఆడను బిగ్ బాస్' అంటూ తన దగ్గరున్న మైక్ విసిరేసి మరీ వెళ్లిపోయాడు. దీంతో టాస్క్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.
ప్రోమోలో కనిపించగా: 'చిట్టీ ఆయేగా' టాస్క్ సమయంలోనూ శివాజి గార్డెన్ ఏరియాలో కూర్చుని బాధపడుతూనే కనిపించాడు. ఆ తర్వాత ప్రశాంత్‌తో 'అరేయ్.. ఈ గేమ్ నువ్వే ఆడరా. నాకు ఆ లెటర్ వద్దు. నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా.. నువ్వు ఆడి కెప్టెన్ అవ్వాలి' అని కోరుకున్నాడు. అయితే, ఈరోజు ఎపిసోడ్‌లో శివాజి టాస్కులో పాల్గొనడం చూపించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











