Bigg Boss Telugu 7: అబ్బా ఏం ప్లాన్ వేశావ్ శివాజీ... మైండ్ గేమ్‌తో భలే ఆటాడేసుకుంటున్నావ్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన శివాజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటి వరకు హౌస్ లోకి 19 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఇక వారందరిలో శివాజీ పెద్దవారు. అంతే కాదు షకీలా, కిరణ్ రాథోడ్ వారికంటే కూడా శివాజీ వయసులో పెద్ద. ప్రస్తుతం శివాజీ వయసు 52 సంవత్సరాలు. ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మరు. ఎందుకంటే ఆయన అలా కనిపించరు. అయితే శివాజీ వయసు రిత్యా పెద్దవారు, అనుభవం కలిగిన వ్యక్తి.

అలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం.. అందులోనూ హీరోగా ఎన్నో సినిమాలు చేసి.. ప్రేక్షకలకు సుపరిచితమైన వ్యక్తి.. కావడం ఆయనకు మరింత పాపులారిటీ తీసుకువచ్చింది. హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతి కంటెస్టెంట్ శివాజీ కంటే తక్కువ వయసు వాళ్లే. అంతే కాదు.. కొడుకు, కూతుళ్ల వయసు. ఇక శివాజీ హౌస్ లో అడుగుపెట్టనప్పటి నుంచి... మైండ్ గేమ్ తో ఆడుతూ వచ్చాడు. అంతే కాదు... సీరియల్ బ్యాచ్ అంటూ పేర్లు కూడా పెట్టాడు.

Sivaji Master Mind and Cunning Plans in Bigg Boss Telugu 7 Full Details Here

ఇక శివాజీ గ్రూపులోనూ ప్రశాంత్, యావర్, అర్జున్, రతికా రోజ్, అశ్విని, బోలే ఇలా చేరారు. అయితే ప్రశాంత్, శివాజీ, యావర్ కు ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. వీరిదో ఓ గ్రూప్. అదే spy. ఇక మొదటి నుంచి అమర్ దీప్ వర్సెస్ శివాజీ అన్నట్లుగానే ఆట సాగింది. ఎన్నో సార్లు అమర్ దీప్ మీద తన ద్వేషాన్ని బయటపెడుతూ వచ్చాడు శివాజీ. ప్రతి సారి తిడుతూ.. అమర్ ను ఇన్ సల్ట్ చేస్తూ వచ్చాడు.. నాగార్జున కూడా శివాజీ మీద ఫైర్ అయితే.. అవి జోక్ గా అన్నవి అంటూ కవర్ చేసుకున్నాడు.

ఇక నిన్నటి కెప్టెన్సీ టాస్కులోనూ అమర్ దీప్ ను గెలవకుండా ఉండేందుకు సర్వ శక్తులు ప్రయత్నించాడు. చివరకు కెప్టెన్సీ టాస్కే క్యాన్సిల్ చేశారు. 13వ వారం కెప్టెన్సీ లేదని తెలుస్తోంది. ఇక కెప్టెన్సీ టాస్కులో అమర్ దీప్ ఏడవడం.. శివాజి రూడ్ గా మాట్లాడటం.. ఆయనకు నెగిటివిటీ తెచ్చిపెట్టింది. అమర్ దీప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయాడు. ఇదిలా ఉంటే.. శివాజీ తన మైండ్ గేమ్ తో కొత్త గేమ్ స్టార్ట్ చేశాడని తెలుస్తోంది.

Sivaji Master Mind and Cunning Plans in Bigg Boss Telugu 7 Full Details Here

ఇక తనకు హ్యాండ్ పెయిన్ వచ్చిందని.. ఇంటికి వెళ్లిపోతాను అంటూ చెప్పాడు. దీంతో శివాజీ పీఆర్ టీమ్స్ అంతా కలిసి సోషల్ మీడియాలో శివాజీకి హ్యాండ్ పెయిన్ అంటూ ట్రెండింగ్ చేసారు. ఇదంతా అమర్ తో వచ్చిన నెగిటివిటీ పొగెట్టేందుకు శివాజీ ఆడిస్తున్న నాటకం అని బిగ్ బాస్ లవర్స్ అంటున్నారు. శివాజీ చాలా మైండ్ గేమ్ తో ఆడుతున్నాడు.. చూసే వాళ్లను తన వైపుకు తిప్పుకునేలా చేస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X