Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్‌లో శోభనం.. నోట్లో నోరు పెట్టేసి మరీ.. వామ్మో ఏంటా బూతులు?
ఎన్నో వివాదాలు చుట్టు ముట్టినా.. వ్యతిరేకత వచ్చినా.. వాటన్నింటినీ తిప్పి కొడుతూ చాలా తక్కువ సమయంలోనే సక్సెస్‌ఫుల్ షోగా మారిపోయింది బిగ్ బాస్. అంతేకాదు, ఇండియాలోనే ఏ షోకూ రాని రేటింగ్‌ను సొంతం చేసుకుని టాప్ ప్లేస్‌కు చేరింది. దీంతో నిర్వహకులు తెలుగులో వరుసగా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చారు. ఆరంభం నుంచే మజాను పంచుతోన్న ఈ సీజన్‌లోని రాబోయే ఎపిసోడ్‌లో ఊహించని సంఘటనలు కనిపించాయి. ఆ వివరాలు మీకోసమే!
ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తున్న బిగ్ బాస్ ఏడో సీజన్ ఇప్పటికే ఆరు వారాలను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు జరుగుతున్న ఏడో వారంలో మరింత ఫన్ క్రియేట్ అయ్యేలా కెప్టెన్సీ టాస్కును రూపొందించారు. ఇందులో హచ్ అనే గ్రహం నుంచి వచ్చిన ఓ స్పేష్ షిప్ బిగ్ బాస్ హౌస్‌లో కూలిపోతుంది. కంటెస్టెంట్లు ఏలియన్స్‌ను మెప్పిస్తే కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు.

ఏడో వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో భాగంగా కంటెస్టెంట్లను గులాబీపురం, జిలేబీపురం అనే రెండు టీమ్‌లుగా విభజించారు. వీళ్లకు కొన్ని క్యారెక్టర్లు కూడా ఇచ్చారు. వీళ్లు ఖాళీ సమయంలో ఆ పాత్రల్లో నవ్వించడంతో పాటు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు ఆడాల్సి ఉంటుంది. ఇలా గత ఎపిసోడ్‌లో జరిగిన గుడ్ల టాస్కులో జిలేబీపురం వాళ్లు విజయం సాధించి సత్తా చాటారు.
గురువారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు మరింత ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. అయితే, ఇందులో కొందరు మాత్రం శృతి మించి మరీ డబుల్ మీనింగ్ డైలాగులు వాడారు. ముఖ్యంగా శివాజి.. సర్పంచ్ ప్రియాంకను పొగుడుతూ ఏదో ద్వంద్వ అర్థం వచ్చే పదాన్ని వదిలాడు. దీంతో అందరూ షాక్ అయిపోయారు.

ఇక, ఈ టాస్కులో మాజీ భార్యభర్తలుగా ఉన్న టేస్టీ తేజ, శోభా శెట్టి కూడా నవ్వించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వీళ్లకు ఆరోజుకు ఫస్ట్ నైట్ జరిగి ఏడాది అయిందని చెబుతూ కామెడీ చేశారు. ఇదే అంశాన్ని తేజ పలుమార్లు ప్రస్తావించడంతో శోభా శెట్టి తెగ సిగ్గుపడిపోయింది. చివరికి 'ఫస్ట్ నైట్ అనే మాటను మాత్రం అనకు' అంటూ అతడికి రిక్వెస్ట్ చేసింది.
అలాగే, ఈ టాస్కులో భాగంగా రోమియోగా ఉన్న గౌతమ్ కృష్ణ.. శోభా శెట్టిని వలలో వేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఇందుకోసం అతడు కళ్లు తిరిగి పడిపోయినట్లు నటించాడు. అప్పుడు శోభా వచ్చి అతడి నోట్లో నోరు పెట్టి ఊదుతుందని భావించాడు. కానీ, ఆమె స్థానంలో అమర్‌దీప్ వెళ్లి నోటితో గాలి ఊదే ప్రయత్నం చేశాడు. దీంతో గౌతమ్ షాక్ అవగా.. అందరూ నవ్వుకున్నారు.
ఇదే టాస్కులో అర్జున్ పక్కన తిరిగే చెంచాలా నటిస్తున్న పల్లవి ప్రశాంత్.. ప్రియాంక దగ్గరకు వెళ్లి 'నా దగ్గర ఒక యాభై ఎకరాలు ఉన్నాయి' అంటూ ఆమెకు సైట్ కొట్టాడు. దీంతో ప్రియాంక 'నువ్వు నీ చెంచాను తిప్పాలని అనుకుంటే ఇక్కడ జరగవు' అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వదిలింది. ఇలా ప్రతి ఒక్కరూ అదే తరహా పదాలతో రెచ్చిపోయారు. మొత్తానికి ఈరోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్ మరింత ఫన్నీగా సాగబోతున్నట్లు అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











