Bigg Boss Telugu 7: షాకింగ్ ట్విస్ట్.. టాప్ 5లోకి ఊహించని కంటెస్టెంట్స్.. ఎవరెవరంటే..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ లేదని తెలిసిపోయింది. ఇక హౌస్ లో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో నెక్ట్స వీక్ ఇద్దరు ఎలిమినేట్ కానున్నారని చెబుతున్నారు. లేదంటే బిగ్ బాస్ ఆటను మరో రెండు వారాలు ఎక్స్ డెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ పది మంది కంటెస్టెంట్స్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్టును ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ రిలీజ్ చేసింది. అయితే అందులో ఊహించని కంటెస్టెంట్స్ టాప్ 5 లిస్టులోకి చేరారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నాగార్జున హౌస్టుగా.. రోజు రోజుకు ఇంట్రెస్ట్ కలిగిస్తూ సాగుతోంది. మొదటి విడుతలో ఈ సీజన్ 14 మంది ఎంటర్ అయ్యారు. ఇక ఉల్టా పుల్టా సీజన్ అంటూ చెప్తూ.. ఐదో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా ఐదుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పటి వరకు 10 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ఒకరు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనగా.. ఎలిమినేషన్ లేదని తేలింది.

ఇక ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శివాజీ, ప్రశాంత్, యావర్, గౌతమ్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అశ్విని శ్రీ, రతికా రోజ్, అర్జున్ అంబటి ఉన్నారు. అయితే వీరిలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మొన్నటి వరకు టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే... శివాజీ, ప్రశాంత్, యావర్,అమర్ దీప్, అర్జున్ అంబటి లేదా ప్రియాంక జైన్ పేరు వినిపించేది.
కానీ ఉల్టా పుల్టా సీజన్ కావడంతో.. టాప్ 5 కంటెస్టెంట్స్ మారుతునే ఉన్నారు. ఇక నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 17వ తేదీ వరకు ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సర్వే నిర్వహించింది. టాప్ 5 మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ లిస్టును రిలీజ్ చేసింది. ఆర్మాక్స్ మీడియా సంస్థ సినీ తారలపై సర్వే నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ జాబితాను విడుదల చేసింది.
ఇక టాప్ 5 లిస్టులో టాప్ 5లో యావర్ నిలిచాడు. ఒకప్పుడు యావర్ సీజన్ విన్నర్ అవుతాడని అనుకున్నారు.. కానీ తాజాగా రిలీజ్ చేసిన లిస్టులో ఆయన ప్లేస్ కిందకు చేరిపోయింది. ఇక టాప్ 4లో ఊహించని కంటెస్టెంట్ వచ్చి చేరాడు. అతనే గౌతమ్ కృష్ణ. గౌతమ్ అసలు టాప్ 5 కి వస్తారని ఎవరు ఊహించలేదు.. ఆయన గేమ్ తో ప్రజల్లో పాపులారిటీ తెచ్చుకుంటున్నాడు. అలా టాప్ 4లోకి వచ్చాడు. ఇక టాప్ 3లోకి అమర్ దీప్ వచ్చాడు. ఇక అమర్ దీప్ ఇలాగే స్పిరిట్ తో గేమ్ ఆడితే సీజన్ విన్నర్ అయినా ఆశ్చర్యం లేదు.
అమర్ దీప్.. మైనస్ అయిన విషయం ఏంటంటే.. ప్రశాంత్ ను టార్గెట్ చేయడం. దాని వల్లే ఆయన బయట టార్గెట్ అయ్యారు. ఆ ఒక్క తప్పు చేయకపోతే.. అమర్ దీప్.. విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఇక టాప్ 2లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. టాప్ 1లో శివాజీ నిలిచాడు. అయితే ఈ సారి సీజన్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ అంటున్నారు. ఆయనకు ఉన్న క్రేజ్, కామన్ మ్యాన్ కావడం.. ఇలా అన్నింటిని పరిశీలించి.. బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ను ప్రకటించాలని బిగ్ బాస్ టీమ్ అనుకుంటుందని టాక్. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











