‘నాకు విపరీతమైన మందు, సిగరెట్ అలవాటు.. చిరంజీవి వల్లనే ఇప్పటికీ’

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో శివాజీ రాజా 1985 నుంచి యాక్టివ్ గా ఉన్నారు. అగ్ర హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించి మెప్పించారు. విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఆయా చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు. అయితే తాజాగా శివాజీ రాజా బుల్లితెర బ్యూటీ జబర్దస్త్ వర్ష 'కిస్సిక్ టాక్స్' షోకు హాజరయ్యారు. ఈ సందర్బంగా తన వ్యక్తిగతమైన విషయాలను అభిమానులతో నిర్మోహమాటంగా పంచుకున్నారు.

రాజా శివాజీకి గుర్తింపు తెచ్చిన చిత్రాలు..
1962 ఫిబ్రవరి 26న భీమవరంలో జన్మించారు రాజా శివాజీ. గొల్లపూడి రాసిన కళ్లు అనే నాటిక ఆధారంగా నిర్మించిన చిత్రంతో తన నట జీవితం ప్రారంభమైంది. ఆ సినిమాకు గానూ నంది అవార్డును అందుకున్నారకు. ఆ తర్వాత ఒంటరి పోరాటం, బొబ్బిలి రాజా, చిన్నారి ముద్దుల పాప, గంగ, జీవన చదరంగం, పేకాట పాపారావు, బొబ్బిలి సింహం, హలో బ్రదర్, సిసింద్రి, పెళ్లి సందడి, గోరింటాకు వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 40 ఏళ్ల నట జీవితంలో 400 సినిమాల్లో నటించారు. టీవీ సీరియల్ అమృతంలోనూ మెరిసి బుల్లితెర ఆడియెన్స్ ను అలరించారు.

Sivaji Raja Talked about his smoking and drinking habits

మందు పడాల్సిందే.. విపరీతమైన ధూమపానం..
శివాజీ రాజా చాలా రోజుల తర్వాత కిస్సిక్ టాక్స్ షో ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తనకున్న చెడు వ్యసనాలపైనా స్పందించారు. ఒకప్పుడు దారుణంగా తాగేవాన్ని అని.. ఇప్పుడు మాత్రం ఫంక్షన్లలో మాత్రమే తాగుతున్నానని, 2 పెగ్గులు, 3 గంటల పాటు తాగుతానని చెప్పుకొచ్చారు. పూర్వం సిగరెట్లు మాత్రం దారుణంగా కాల్చేవాడినని చెప్పుకొచ్చింది.

చిరంజీవి వల్లనే అన్నింటికి చెక్..
తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని, ఒక సందర్భంలో ఇక విపరీతంగా ధూమపానం అవుతుండటంతో కీలక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తనకు ఎంతో ఇష్టమైన చిరంజీవి అన్నయ్య మీద ఒట్టు వేసి అప్పటి నుంచి సిగరేట్ కాల్చడం లేదని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక వవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ.. ఆయన పూల పాన్పులు వదిలిన రోడ్డెక్కి పోరాటం చేసి ప్రభంజనం సృష్టించారని చెప్పుకొచ్చారు.

కిస్సిక్ టాక్ షో వివరాలు..
కిస్సిక్ టాక్ షోకు యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ టీవీ లో ప్రసారం అవుతున్న ఈ షోకు టీవీ సెలబ్రెటీలు, టాలీవుడ్ సీనియర్ నటులు హాజరవుతూ తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో శివాజీ రాజా కూడా వర్ష కిస్సిక్ టాక్స్ షోకు హాజరై తన జీవితంలోని కొన్ని విషయాలను పంచుకున్నారు. ఈటాక్స్ షో ఇప్పటి వరకు 8 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. శివాజీ రాజా ఇంటర్వ్యూ ఎపిసోడ్ 9గా బిగ్ టీవీ ప్లస్ ఛానెల్ లో ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X