Bigg Boss Telugu 7: టేస్టీ తేజ తేడాగాడు.. అతడి నిజస్వరూపం ఇదేనని ప్రూవ్ చేసిన శివాజి!

Sivaji on Tasty Teja: బిగ్ బాస్ తెలుగు 7 9 వారాలు పూర్తి చేసుకుని అద్భుతమైన టీఆర్పీతో దూసుకెళ్తోంది. రోజురోజూ షోలో చోటు చేసుకునే మార్పులు చూస్తుంటే ఆహా.. కచ్చితంగా ఈరోజుటి ఎపిసోడ్ చూడాల్సిందేనని అనిపిస్తుంది. ముఖ్యంగా వీకెండ్స్, నామినేషన్లు అయితే రసవత్తరంగా సాగుతున్నాయి. ఎవరెరవరు ఇంట్లో ఉంటున్నారు, ఎవరెవరు వెళ్లిపోతున్నారనేది తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఎపిసోడ్ లో ఓ వ్యక్తి రియల్ క్యారెక్టర్ బయట పడింది. ఇంత కాలం మంచి వాడిగా అందరి దగ్గర మార్కులు కొట్టేసిన టేస్టీ తేజ నిజ స్వరూపం ఇదేనని శివాజి ప్రూవ్ చేశాడు.

కెప్టెన్సీ టాస్కులో శోభా శెట్టి తరఫున అమర్ దీప్ ఆడి గెలవడం.. శోభాను కెప్టెన్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆమె గెలిచిన ఆనందంలో ఉండగా.. స్నేహితుడిగా ఆనందించాల్సిన టేస్టీ తేజ, ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే చులకనగా మాట్లాడాడు. నా వల్లే నీకు కెప్టెన్సీ వచ్చిందంటూ రెండు, మూడు సార్లు అన్నాడు. ముఖ్యంగా శివాజి వద్దకు వెళ్లి కూడా టేస్టీ తేజ ఇదే చెప్పాడు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన శోభా శెట్టి.. ఇంకోసారి అలా అనకు అని చెప్పింది. స్నేహితుడే కదా అని ఆమె మెళ్లిగా చెప్పినప్పటికీ అతను మాత్రం అగ్రెసివ్ అయ్యాడు.

 Sivaji Reveal Tasty Teja True Colors in Latest Episode Chech Details

మూడు సార్లు కాదు నాలుగు సార్లు అంటాను.. నేను ఇచ్చాను, నేను చెప్పడం వల్లే అమర్ గేమ్ ఆడాడంటూ కామెంట్లు చేశాడు. దీనికి ఫుల్ ఫైర్ అయిన శోభా శెట్టి.. నా కోసం గేమ్ ఆడింది నువ్వు కాదు, నువ్వు ఆడమంటే వాడు గేమ్ ఆడలేదు.. నాకోసం ఆడాడాని అన్నాడు. నువ్వు నా ఫ్రెండ్ కాదంటూ చెప్పుకొచ్చింది. వాడు మాత్రమే నా ఫ్రెండ్, అందుకే నాకోసం గేమ్ ఆడాడని వివరించింది. ఇందుకు టేస్టీ తేజ మరింత ఫైర్ అవుతూ... లేదే నేను పది సార్లు అయినా అంటానంటూ వాదించాడు. ఈక్రమంలోనే ప్రియాంక, అమర్ దీప్ అక్కడకు వచ్చారు. వారిద్దరినీ సముదాయించే ప్రయత్నం చేశారు.

 Sivaji Reveal Tasty Teja True Colors in Latest Episode Chech Details

అయినప్పటికీ టేస్టీ తేజ వినకుండా గట్టి గట్టిగానే అరుస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయం గుర్తించిన అర్జున్ అంబటి, పల్లవి ప్రశాంత్ గొడవ వద్దకు వెళ్దామా అని అనుకుంటుండగా.. శివాజి వద్దని చెబుతాడు. వారి మధ్యలోకి వెళ్తే ఇరుక్కుపోయేది మనమే అంటూ వివరిస్తాడు. అలాగే టేస్టీ తేజ తేడాగాడు అంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. అతడు కావాలనే ఆ అబ్బాయి చాలా వాడిని మనం ఎంత ప్రేమిస్తామో వాడు మాత్రం మనతో అలా ఉండడని చెప్పుకొచ్చాడు. అటూ అటూ జొర్లుతుంటాడు అని తెలిపాడు. అదొక్కటే అతని బ్యాడ్ క్వాలిటీ అని స్పష్టం చేశాడు.

ఇది వరకు కూడా అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టిలతో ఉంటూ వారి గురించే శివాజి వద్ద ఫ్లిప్ అయ్యాడు. ఇలా చాలా సార్లే జరిగింది. అలాగే ఇటీవలే అర్జున్ అంబటి.. అమర్ దీప్ గురించి మాట్లాడుతూ.. నాకిదేంట్రా.. వాడిని వదిలించుకుందామన్నా, అన్నయ్యా, అన్నాయా అంటూ వచ్చేస్తున్నాడని చెప్పాడు. అప్పుడు కూడా టేస్టీ తేజ ఏమీ అనలేదు. అమర్ దీప్ తన స్నేహితుడే కావడం, అందులోనూ తనముందే ఓ వ్యక్తి అలా మాట్లాడుతుంటే ఏమీ అనడు. ఇదంతా చూస్తుంటేనే టేస్టీ తేజ ఎవరితోనూ చక్కగా రిలేషన్ మెయింటేన్ చేయలేదని, శివాజి చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X