Bigg Boss 7 Telugu: రెండో భార్యపై శివాజి కామెంట్.. అలా వదిలేసిన హీరో.. వదినా సారీ అని ప్రశాంత్ ఏడుపు

ప్రాంతీయ భాషలకు సూట్ అవని కంటెంట్‌తోనే వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్ షోగా మారింది బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఇది రికార్డులు క్రియేట్ చేస్తూ దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఏడో సీజన్‌ను మరింత కొత్త కాన్సెప్టుతో నడుపుతున్నారు. ముఖ్యంగా మొదటి వారం కెప్టెన్సీ టాస్కును రకరకాల గేమ్‌లతో రసవత్తరంగా మారుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శివాజి మరోసారి హైలైట్ అయ్యాడు. ఆ వివరాలు మీరే చూడండి!

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో మొట్టమొదటి కెప్టెన్సీ పోటీదారుల కోసం చివరి రౌండ్‌లో భాగంగా 'చిట్టీ ఆయేగా' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో జంటలకు వాళ్ల ఫ్యామిలీలు నుంచి లెటర్స్ వస్తాయి. అయితే, ఇందులో ఒకరు లెటర్‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారు అవకుండానే ఎలిమినేట్ అవుతారని చెప్పిన విషయం తెలిసిందే.

Sivaji Sacrifices His Letter for Pallavi Prashanth In Captaincy Task

'చిట్టీ ఆయేగా' టాస్కులో భాగంగా మొదటిసారి గౌతమ్ కృష్ణ, శుభశ్రీ జంట లోపలికి వెళ్లింది. అందులో లెటర్ నాకు కావాలంటే నాకు కావాలంటూ కాసేపు వాదించుకున్నారు. చివరకు శుభశ్రీ తన లెటర్‌ను కంటెండర్‌షిప్‌ను త్యాగం చేసింది. ఆ తర్వాత మాత్రం టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ జంటలో ఇద్దరూ త్యాగానికి సిద్ధం అయ్యారు. చివరకు ప్రిన్స్ తప్పుకుని తేజకు ఛాన్స్ ఇచ్చాడు.

ఇక, శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో మాత్రం అమర్‌దీప్, సందీప్ ముందుగా వెళ్లారు. అందులో ఇద్దరూ తమకు లెటర్ అవసరం అని ఎమోషనల్‌గా చెప్పుకున్నారు. ఆ సమయంలోనే సందీప్ తన మదర్ గురించి సమాచారం కోసమే అడుగుతున్నా అనడంతో అమర్ త్యాగం చేశాడు. అయితే, వీళ్ల ఎపిసోడ్ మాత్రం కాస్త ఓవర్‌గా అనిపించినట్లు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

'చిట్టీ ఆయేగా' టాస్కులో చివరి రౌండ్‌లో శివాజి ముందుగా వెళ్లగా.. అతడికి బిగ్ బాస్ లెటర్‌తో పాటు ఓ కప్ నిండా కాఫీని కూడా ఇచ్చాడు. అది చూసి సంతోషించిన అతడు వెంటనే తాగడం మొదలు పెట్టాడు. ఆ సమయంలోనే ప్రశాంత్ రావడంతో 'కాఫీ అనేది నాకు వీక్‌నెస్‌ రా. థ్యాంక్స్ బిగ్‌బాస్ కాఫీ ఇచ్చినందుకు. ఇది నా సెకెండ్ వైఫ్‌రా' అంటూ తన సంతోషం వ్యక్తం చేశాడు.

Sivaji Sacrifices His Letter for Pallavi Prashanth In Captaincy Task

టాస్కు మేటర్‌లోకి వచ్చిన తర్వాత శివాజి సూటిగా 'ఎమోషనల్ డ్రామాలేం వద్దురా. నీకు ఇచ్చేద్దామని అనుకున్నా. ఒక కామన్ మ్యాన్‌ను ఇక్కడి వరకూ వచ్చాడంటే గెలవాల్సిందే. నీకు అప్పుడే జెప్పినా కదా. నాకు కాఫీ ఇచ్చాడు చాలు. నువ్వు కంటెండర్ అవ్వు. కామన్ మ్యాన్‌గా వచ్చి హగ్ ఇచ్చావు. నీతో ఎవరూ మాట్లాడట్లేదు అన్నావు. నీకు నేనున్నా బిడ్డా అన్నా. ఇప్పుడూ అదే చెప్తున్నా ఆడు. దున్నేయ్ కానీ లైన్ దాటొద్దు ఎప్పుడూ. నువ్వు గెలవాలని నీ వెనకాల నిలబడుతున్నా' అంటూ లెటర్‌ను త్యాగం చేసేశాడు.

శివాజి తన లెటర్‌ను త్యాగం చేసిన తర్వాత ప్రశాంత్ అతడి కాళ్లకు నమస్కరించాడు. 'బిగ్ బాస్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. నా లెటర్‌ను అన్న నోటితో చదివించుకుంటాను' అన్నాడు. కానీ, బిగ్ బాస్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత శివాజి భార్యను ఉద్దేశించి 'వదినా నన్ను క్షమించండి' అని చెప్పాడు. అనంతరం తన లెటర్‌ను చదివి వినిపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X