Bigg Boss Telugu 7: ట్యూషన్‌కు వెళ్లే అమ్మాయితో శివాజి ప్రేమాయణం..ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడట!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాస్క్ లతో షోను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. ఇంట్లోకి వెళ్లిన ప్రతీ కంటెస్టెంట్ గురించి అందరికీ తెలిసేలా చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక టాస్క్ లు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే 12 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో 13వ వారం కూడా అద్భుతంగా సాగుతోంది. అయితే నిన్న శోభాశెట్టి చేసిన పనికి పనిష్మెంట్ ఇస్తున్నట్లు చెప్పిన బిగ్ బాస్.. చివరకు వారు హాయిగా పడుకునేలా టైమ్ ఇచ్చి షాకిచ్చారు. దీంతో అంతా ఫుల్లుగా పడుకొని లేచారు.
కంటెస్టెంట్లు అందరూ లేచే సరికి టీ కూడా రెడీ చేసి పంపాపడు బిగ్ బాస్. అది చూసిన హౌస్ మేట్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు ఈవారం కష్టపడి టాస్క్ లు ఆడిన వారికి బిగ్ బాస్ బ్రేక్ ఇవ్వడంతో ఫుల్ చిల్ అయ్యారు. ఈక్రమలో టీ తాగుతూ... తమ గురించి పూర్తిగా అందరికీ తెలిసేలా చేయాలని బిగ్ బాస్ ప్లాన్ వేశాడు. ప్రజీ సీజన్ లాగే ఈ సారి కూడా తమ ప్రేమ కథలను వివరించమంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈక్రమంలోనే ఇంట్లోని వాళ్లంతా తమ ప్రేమ కథలను చెప్పుకొచ్చారు. హౌస్ మేట్స్ తో చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు. కొందరు తమ సక్సెస్ స్టోరీల గురించి చెప్పగా.. మరికొందరు తమ ఫెయిల్యూర్ స్టోరీలను వెల్లడించారు.

అయితే ఇంట్లో పెద్దన్నగా కొనసాగుతున్న శివాజి తన ప్రేమ గురించి చెప్పి అందరికీ షాకిచ్చారు. ముఖ్యంగా ఆయన చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ముందుగా తాను చెప్పనని అన్నప్పటికీ... అందరూ ఆయన చెప్పాలని పట్టుబట్టారు. అయితే హౌస్ మేట్స్ కోరిక మేరకు శివాజి కూడా తన ప్రేమ కథ గురించి చెప్పడం ప్రారంభించారు. మాస్టర్ సినిమా అయిపోయిన తర్వాత ఓ పెద్ద మనిషి ఇంట్లో పార్టీ జరిగిందట. అయితే ఆ ఫంక్షన్ కు వెళ్లిన శివాజి ఓ అమ్మాయిని చూడాడట. తొలిచూపులోనే ఆమెను ఇష్ట పడ్డాడట.
అయితే అప్పటికే తాను ఓ సెలబ్రిటీ కావడంతో.. ఒక సంవత్సర కాలం పాటు ఆ అమ్మాయతో ప్రేమాయణం సాగించాడట. ప్రతిరోజూ చిక్కడపల్లిలో ట్యూషన్ కు వెళ్లే ఆ అమ్మాయిని కలిసి మాట్లాడేవాడనని చెప్పుకొచ్చాడు. అయితే ట్యూషన్ కు వెళ్లే అమ్మాయితో శివాజి ప్రేమ విషయం వినడానికి కాస్త వింతగా అనిపించినా... ఆమె చేసేది డిగ్రీ అని తెలిసి కాస్త బెటర్ అనిపించింది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న ఆ అమ్మాయి ట్యూషన్ కు వెళ్లేదని.. రోజూ ఆ సమయంలోనే తాను తన ప్రియురాలిని కలిసి మాట్లాడేవాడినని చెప్పాడు.
అయితే ప్రేమాయణం సాగిన ఏడాదికే వారి కుటుంబ సభ్యులతో పాటు, అమ్మాయి కుటుంబ సభ్యులకు కూడా విషయం చెప్పి పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. తన భార్యే తన మొదటి ప్రేమ అని... అప్పుడు ప్రారంభం అయిన తన లవ్ స్టోరీ ఇప్పటికీ కొనసాగుతోంది చెప్పుకొచ్చాడు. శివాజి లవ్ స్టోరీ విన్న ప్రతీ ఒక్కరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలా సక్సెస్ చేసుకునే గట్స్ ఉంటేనే ప్రేమించాలంటూ కూడా నెటిజెన్లు చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











