Bigg Boss Telugu 7: రతికాతో ఆ కంటెస్టెంట్ దుబాయ్ ప్లాన్.. రొమాంటిక్ ట్రిప్‌ను లీక్ చేసిన శివాజి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్ మొదటి వారంలో అడుగు పెట్టిన వాళ్లలో శివాజి, యావర్, పల్లవి ప్రశాంత్ లు ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. ఎలాంటి ఫౌల్ గేమ్స్ ఆడుకుండా తమ బంధాన్ని చక్కగా కొనసాగిస్తూ.. లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. వీరి సెపరేట్ గా ఉండే ఫ్యాన్స్ కంటే కూడా ఈ గ్రూపు కోసం ఎదురు చూసే అభిమానులే ఎక్కువ. ముఖ్యంగా మొదటి వారంలోనే రైతుబిడ్డతో అమర్ దీప్ గొడవ పడడం, రతికా రోజ్ ఓ ఆటాడుకోవడాన్ని శివాజి జీర్ణించుకోలేకపోయారు.

వీరిద్దరూ చేసిన అతి వల్లే పల్లవి ప్రశాంత్ కు హైప్ వచ్చింది. వాళ్లు ఎంత గొడవ చేసినా, ఎన్ని మాటలు అన్నా రైతుబిడ్డ ఏమీ అనలేదు. ఈక్రమంలోనే అతడికి అండగా నిలబడి సాయం చేశాడు. ఇలా వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఇక రతికా రోజ్.. పల్లవి ప్రశాంత్ తో చాలా క్లోజ్ గా ఉంటూనే చుక్కలు చూపించింది. దీంతో ఆమెకు తీవ్రమైన నెగిటివిటీ వచ్చేసింది. రైతుబిబ్డతో ఆమె వ్యవహరించిన తీరు, అన్న మాటల వల్లే ఆమె అతి తొందరగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే ఆమెకు వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకోవడానికి మరోసారి హౌస్ లోకి వెళ్లాలని అనుకుంది. బిగ్ బాస్ కూడా అందుకు ఒప్పుకోవడంతో మరోసారి రీఎంట్రీ ఇచ్చింది.

Sivaji Said Yawar Going to Dubai With Rathika Rose After Coming Out of Bigg Boss Telugu 7

రతికా రోజ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను మర్చిపోలేకపోతున్నానని చెబుతూనే.. ఓవైపు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, మరోవైపు ప్రిన్స్ యావర్ లతో పులిహోర కలిపింది. క్లోజ్ గా మాట్లాడడం.. లవ్ ట్రాక్ నడపడం చేసింది. అయితే రతికా తనకిచ్చిన షాక్ నుంచి తేరుకున్న తర్వాత ఆమెకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు. ఆమె రీఎంట్రీ తర్వాత కూడా అక్క, అక్క అంటూనే పిలిచాడు. చాలా దూరంగా ఉన్నాడు. కానీ యావర్ మాత్రం రతికా రోజ్ తో చాలా క్లోజ్ గా ఉన్నాడు. ఆమెతో స్నేహం కొనసాగించాడు. వీరిద్దరికి కూడా లవ్ ట్రాక్ వేశారు. వారిద్దరి మధ్య ఏముందో తెలియదు కానీ లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు కనిపించింది.

అయితే తాజాగా వీరిద్దరి బంధం గురించి శివాజి షాకింగ్ కామెంట్లు చేశారు. యావర్, శివాజి, పల్లవి ప్రశాంత్ లు ఓ బెడ్ పై కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే అప్పుడు యావర్ చేసిన కామెంట్లకు బిగ్ బాస్ వెంటనే స్పందించారు. ఏంటి యావర్ రతికా రోజ్ లా మాట్లాడుతున్నారు, అలాగే ఆలోచిస్తున్నారు అన్నారు. దీనికి ముగ్గురూ నవ్వుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం వాళ్లు నేను ఏమి చేశాను అంటూ యావర్ క్యూట్ గా శివాజిని అడిగాడు. హౌస్ లో నువ్వు ఎన్ని విన్యాసాలు చేస్తున్నావో అన్నీ నాకెలా తెలుసంటూ శివాజి చెప్పుకొచ్చాడు. దానికి ప్రిన్స్ యావర్ తో పాటు పల్లవి ప్రశాంత్ కూడా విపరీతంగా నవ్వారు.

Sivaji Said Yawar Going to Dubai With Rathika Rose After Coming Out of Bigg Boss Telugu 7

ఆ తర్వాత శివాజి.. వైఆర్ అంటే అని అడిగాడు. దానికి యావర్ నేను రాసలేదు.. అంటే రాయలేదు అని చెప్పాడు. నువ్వు రాసలేదు, రాయలేదు అయినా కూడా అది జనాల్లోకి వెళ్లిందంటూ శివాజి తెలిపారు. దానికి వెంటనే యావర్ నేను ఫ్రెండ్ చేశాను అంతే అన్నాడు. అంతలోపే శివాజి అందుకుని దుబాయ్ కూడా వెళ్లాలని ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు కదా అంటూ వాళ్ల రొమాంటిక్ ట్రిప్ గురించి బయట పెట్టేశాడు. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియని ప్రిన్స్ యావర్ తల కిందకు దించుకున్నాడు. ఇదంతా చూస్తుంటే వీరిద్దరి మధ్య బంధం ఉందని తెలుస్తోంది. కానీ అది స్నేహమా, ప్రేమా అనేది తెలియాలంటే మాత్రం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X