Bigg Boss Telugu 7: శివాజి సెన్సేషనల్ కామెంట్స్.. ఏంటీ ఆ ప్రొడ్యూసర్ పిచ్చకొట్టుడు కొట్టాడా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా అదిరిపోయే కాన్సెప్టులతో అందరినీ అలరిస్తున్న బిగ్ బాస్... అంతకు మించిన టాస్కులు ఇస్తూ.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. ఓవైపు టేస్టీ తేజ, మరోవైపు భోలె షవాళిలు తమ స్థాయిలో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. టాస్కులు పెద్దగా ఆడకపోయినా తమకు వచ్చిన కామెడీ చేస్తూ అందరినీ అలరిస్తున్నారు. వందకు వంద శాతం ఎంటర్ టైన్ చేస్తూ అందరికీ నచ్చేస్తున్నారు. ఇంట్లోని వాళ్లతో పాటు బయట ఉన్న బిగ్ బాస్ ప్రియులను కూడా కడుపుబ్బా నవ్విస్తున్నారు.

నామినేషన్ల తర్వాత టేస్టీ తేజ.. శోభా శెట్టితో చేసిన రొమాన్స్ కు అంతా ఫిదా అయ్యారు. అలాగే భోలె షవాళి కూడా అశ్వినీతో నేను హీరోను అంటూ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆయన మాట తీరు, చేసే చేష్టలు అన్నీ అందరినీ నవ్విస్తాయి. ఇక ఆయన కామెడీగా పాడే పాటలు అయితే హైలెట్ అని చెప్పొచ్చు. ఈ సీజన్ మొత్తంలో టేస్టీ తేజ, భోలె షవాళిలే 100 పర్సెంట్ ఎంటర్ టైన్ చేస్తున్నారు. మిగతా వారంతా చాలా సీరియస్ గా ఉన్న సమయంలో కూడా వీళ్లు కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తున్నారు.

Sivaji Sensational Comments on Bhole Shavali in Bigg Boss Telugu 7

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి అడుగు పెట్టిన భోలె షవాళి మొదటి నుంచి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, శివాజిల వెంటే ఉంటున్నాడు. వీరి గ్రూపులోనే ఉంటూ తన గేమ్ ఆడుతున్నాడు. ఎక్కువాగ వీరి వద్దే కూర్చుని కనిపిస్తున్న ఆయన.. అశ్వినీతో చేసే చిలిపి పనులు కూడా చాలా చక్కగా అనిపిస్తున్నాయి. అయితే తాజా ఎపిసోడ్ లో కూడా భోలె షవాళి... చాలా కామెడీ చేశాడు. ప్రిన్స్ యావర్, శివాజి, రతికా రోజ్ సోఫాపై కూర్చొని ఉండగా వారి వద్దకు వెళ్లాడు. అప్పటికే శివాజి తన కుటుంబ గురించి, తాను చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకున్న తీరు గురించి రతికా, యావర్లకు చెబుతున్నాడు.

అయితే అప్పుడే భోలె షవాళి ఓ ప్యాంట్, పైన షర్టు వేసుకొని ఓ పాటు పాడుతూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే షర్టు బటన్స్ పెట్టుకోకుండానే అలా సీరియస్ గా మాట్లాడుతుండగా.. కామెడీ చేసేందుకు బోలె వచ్చిన తీరు చూసి శివాజి షాక్ అయ్యాడు. అదొలా మొహం పెట్టి కింద నుంచి పై వరకు చూశాడు. ఆ తర్వాత సీరియస్ గా మాట్లాడుతున్నట్లుగానే మాట్లాడుతూ... ఓ మ్యూజిక్ డైరెక్టర్ టైంకు పాట ఇవ్వలేదని.. ప్రొడ్యూసర్ వచ్చి పిచ్చ కొట్టుడు కొడితే ఎలా ఉంటారో అలా ఉన్నావని అన్నాడు. దీంతో భోలె షవాళితో సహా రతికా రోజ్, ప్రిన్స్ యావర్, పక్కనే ఉన్న పల్లవి ప్రశాంత్ కడుపుబ్బా నవ్వారు.

Sivaji Sensational Comments on Bhole Shavali in Bigg Boss Telugu 7

దీన్ని భోలె షవాళి ఏమాత్రం సీరియస్ గా తీసుకోకుండా... తాను కూడా ఫుల్లుగా నవ్వాడు. బట్టలన్నీ చింపుకొని ఇలా వస్తే.. అలా అనేశారేంటి అంటూ నవ్వాడు. భోలె కొట్టిన డైలాగ్ తో మరోసారి అంతా ఘొల్లుమన్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది. బిగ్ బాస్ ప్రియులంతా భోలె షవాళి కామెడీకి ఫిదా అయిపోతున్నారు. కేవలం టేస్టీ తేజ, భోలె షవాళి తప్ప మెరవరూ అంతగా ఎంటర్ టైన్ చేయట్లేదంటూ కామెంట్ల రూపంలో చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి ముందు ముందు ఇంకా ఏ రేంజ్ లో వీరు అభిమానులను అలరిస్తారో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X