Bigg Boss Telugu 7: శివాజి సంచలన వ్యాఖ్యలు.. సెల్ఫ్ ఎలిమినేషన్ కన్ఫార్మ్.. వాడిని కొట్టే వెళ్తానంటూ!

ఓ విలాసవంతమైన ఇల్లు.. అందులో కొందరు సెలెబ్రిటీలను ఉంచి.. వాళ్లకు చిత్ర విచిత్రమైన టాస్కులు ఇచ్చి.. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా అందులో ఒకరిని విజేతగా చేయడం అనే కాన్సెప్టుతో వచ్చిన షోనే బిగ్ బాస్. సరికొత్త కాన్సెప్టుతో వస్తున్న దీనికి ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా ఇది ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా ఇప్పుడు ఆరో సీజన్‌ను క్రేజీ కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న శివాజి సెల్ఫ్ ఎలిమినేషన్‌పై, కంటెస్టెంట్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

క్రేజీ కాన్సెప్టుకు ఫుల్ రెస్పాన్స్:బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ట్యాగ్‌లైన్‌కు తగ్గట్లుగానే ఇందులో ఎన్నో ఊహించని సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తూ షోను రంజుగా మారుస్తున్నారు. అలాగే, టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వంటి వాటిలో కొత్తదనం చూపిస్తూ సీజన్ మొత్తాన్ని రసవత్తరంగా నడుపుతున్నారు.

Sivaji Sensational Comments on Contestants In Bigg Boss Telugu 7 Show

టైటిల్ ఫేవరెట్‌ అనే దానికి:బిగ్ బాస్ ఏడో సీజన్‌పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇది నడుస్తోంది. ముందుగా ఈ సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు ఎంటర్ అయ్యారు. వీళ్లు అందరిలోనూ హీరో శివాజి ఆరంభంలోనే టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఆడుతూ ముందుకు సాగుతున్నాడు.

గాయంతో బాధపడుతున్నా:ఏజ్ ఎక్కువే అయినా శివాజి ఎందులోనూ తగ్గకుండా ఆడుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఓ టాస్కులో కింద పడడంతో గాయపడ్డాడు. అయినప్పటికీ ఫిజికల్‌గా ఆడకున్నా, మెంటల్‌గా బాగానే రాణిస్తున్నాడు. ఇక, రెండు వారాల క్రితమే అతడిని స్కానింగ్ కోసం బయటకు పంపించి.. వైద్య పరీక్షల అనంతరం లోపలికి తీసుకు వచ్చారు. అప్పటి నుంచి కాస్త స్లో అయ్యాడనే చెప్పాలి.

Sivaji Sensational Comments on Contestants In Bigg Boss Telugu 7 Show

వెళ్లిపోతానని.. నాగ్ సలహా:గాయపడినప్పటి నుంచి శివాజిపై మిగిలిన కంటెస్టెంట్లు వ్యతిరేకత వ్యక్త పరుస్తూనే ఉన్నారు. నామినేషన్స్ టాస్కులో గౌతమ్ కృష్ణ అతడిని ఆటగాడు కాదు.. కోచ్ అంటూ విమర్శిస్తూ నామినేట్ చేశాడు. ఆ తర్వాత కూడా ఇదే సీన్ రిపీట్ అవుతూ వస్తోంది. దీంతో శివాజి బయటకు వెళ్లిపోతానంటూ రిక్వెస్ట్ చేశాడు. కానీ, నాగార్జున మాత్రం అతడిని కంటిన్యూ అవమని సలహా ఇచ్చాడు.

నామినేషన్స్‌లో తన పేరు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎనిమిదో వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. ఇందులో ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఇక, ఈ నామినేషన్స్ టాస్కులో చాలా మంది శివాజి పేరును వాడుకున్నారు. కొందరేమో అతడికి పాజిటివ్‌గా, మరికొందరు అతడికి నెగెటివ్‌గా మాట్లాడారు. ఇలా ఇందులో హైలైట్ అయ్యాడు.

Sivaji Sensational Comments on Contestants In Bigg Boss Telugu 7 Show

సెల్ఫ్ ఎలిమినేషన్ కన్ఫార్మ్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటున్న హీరో శివాజి.. గాయపడినప్పటి నుంచి తరచూ ఇంటికి వెళ్లిపోతా అంటున్నాడు. ఈ క్రమంలోనే ఎనిమిదో వారం నామినేషన్స్ ముగిసిన తర్వాత అతడు రతికా రోజ్, ప్రిన్స్ యావర్‌తో 'ఇదే హౌస్‌లో నా లాస్ట్ వీక్. ఈ వారం తర్వాత నేను ఇంటికి వెళ్లిపోతాను' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాడిని మాత్రం కొడతాను:అదే సందర్భంలో శివాజి మాట్లాడుతూ.. 'ఆ నామినేషన్స్ ఏంట్రా? జనాలు నిజంగా చూస్తున్నట్లు అయితే ఇప్పుడు సరిగా తీర్పు చెబుతారు. ఈ సారి కరెక్ట్ నామినేషన్స్ పడ్డాయి. నేను ఎలాగో ఈ వారం సెల్ఫ్ ఎలిమినేట్ అవుతా. వెళ్లే లోపు ఎవడో ఒకడిని కొట్టే వెళ్లిపోతా' అంటూ చెప్పాడు. దీంతో షాకైన రతికా రోజ్ అతడిని ఆపబోగా.. శివాజి మాత్రం తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X