Bigg Boss Telugu 7: తొలిసారి శివాజి విశ్వరూపం.. 50 ఏళ్ల ఏజ్‌లో ఇలానా.. నరికేయనీయండి అంటూ గౌతమ్..!

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కాన్సెప్టులతో షోలు ప్రసారం అవుతున్నాయి. అయితే, అందులో చాలా తక్కువ మాత్రమే ప్రత్యేకతను చాటుకుని ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి భారీ స్పందన దక్కింది. ఫలితంగా సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఏడో సీజన్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో శివాజి విశ్వరూపం చూపించాడు. ఆ వివరాలు చూద్దాం పదండి!

అనుకున్న దానికంటే ఎక్కువే: సాధారణంగా కంటెస్టెంట్ల మధ్య గొడవలు, కొట్లాటలు, గ్రూపులు, రొమాన్స్, లవ్‌తో పాటు బాధలు ఇలా అన్ని రకాల సన్నివేశాలను చూపిస్తుంటారు. ఇక, ఇప్పుడు జరుగుతోన్న ఏడో సీజన్‌లో వాటిని ఇంకాస్త ఎక్కువగా చూపిస్తున్నారు. దీనికితోడు ఉల్టా పుల్టా కాన్సెప్టుతో కొత్త కొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్ మరింత రెస్పాన్స్ అందుకుని సత్తా చాటుతోంది.

Sivaji Serious on Gautham Krishna in Bigg Boss Telugu 7 Captaincy Task

ఈ వారం కోసం ఓ బేబీ టాస్క్: బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి వారం కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేసేందుకు టాస్కులు ఇస్తుంటారని తెలిసిందే. ఇందులో భాగంగానే పదో వారంలో ఇంటి సభ్యులకు 'ఓ బేబీ' అనే టాస్కును ఇచ్చారు. దీని ప్రకారం.. కంటెస్టెంట్ల ముఖాలతో ఉన్న బొమ్మలను నిర్ణిత ప్రదేశానికి తీసుకెళ్లాలి. ఇలా ప్రతి రౌండ్‌లో లాస్ట్ వచ్చిన వాళ్ల దగ్గరున్న బొమ్మపై ముఖం ఉన్న వాళ్లు ఔట్ అవుతారు.

గొడవలతో రంజుగా సాగింది: 'ఓ బేబీ' టాస్కు మొదలు కాకముందే కొందరు కంటెస్టెంట్లు 'నువ్వు నా బొమ్మను తీసుకెళ్లు.. నేను నీ బొమ్మను తీసుకెళ్తా' అని మాట్లాడుకుని ఆడారు. అయినప్పటికీ కొన్ని అనుకోని సంఘటనలు జరగడంతో అమర్ - గౌతమ్, అమర్ - ప్రిన్స్ మధ్య గొడవలు జరిగాయి. దీంతో రౌండ్‌కు ఒకరు చొప్పున ఈ టాస్కు నుంచి కంటెస్టెంట్లు అందరూ వైదొలగాల్సి వచ్చింది.

50 ఏళ్ల వయసులో ఇలానా: 'ఓ బేబీ' టాస్కులో భాగంగా అందరి కంటే అదిరిపోయే ఆటతీరును కనబరిచాడు శివాజి. 50 ఏళ్ల వయసు ఉన్న కుర్రాళ్లకు ధీటుగా ఆడి ప్రతి రౌండ్‌లోనూ ముందే టార్గెట్ రీచ్ అయ్యాడు. అయితే, ఓ రౌండ్‌లో అతడికి గాయం కావడంతో ప్రియాంక ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇలా ఆరంభం నుంచి చివరి వరకూ సత్తా చాటి అర్జున్‌తో కలిసి కెప్టెన్సీ పోటీదారుగా నిలిచాడు.

ఓడిపోయాక ఆరోపణలతో: బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కులో చివరి రౌండ్‌లో గౌతమ్, శివాజి, అర్జున్‌లు ఉన్నారు. వీరిలో శివాజి బొమ్మను అర్జున్, అర్జున్ బొమ్మను గౌతమ్, గౌతమ్ బొమ్మను శివాజి తీసుకున్నారు. ఆయన కంటే ముందే వాళ్లిద్దరూ అందులోకి వెళ్లడంతో గౌతమ్ ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అతడిలో కోపం పెరిగిపోయింది. ఫలితంగా శివాజి, అర్జున్ అనుకుని ఆడారని ఆరోపించాడు.

శివాజి విశ్వరూపొ చూపిస్తూ: గౌతమ్ తనపై నిందలు వేయడంతో శివాజి తట్టుకోలేకపోయాడు. అయినప్పటికీ అతడికి 'నీకు గొడవ కావాలి చేస్తున్నావు. బొమ్మ పట్టుకోవడమే గేమ్ కదా. నీకు చాలాసార్లు చెప్పాను. ఊరికే గొడవ పట్టుకోకు. ఇది గేమ్' అంటూ సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా గౌతమ్ మాత్రం వినలేదు. దీంతో శివాజి 'నువ్వు అటెన్షన్ కోసం, కంటెంట్ కోసమే ఇలా చేస్తున్నావు' అన్నాడు.

గేట్లు తీయండి.. నరికేస్తారా: శివాజి అన్న మాటలతో గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. 'ఏం చేస్తారు? నరికేయనీయండి. బిగ్ బాస్ డోర్స్ తీయండి. నేను వెళ్లిపోతా' అంటూ మైక్ విసిరేశాడు. అనంతరం డోర్లను డబడబా కొట్టేశాడు. అప్పుడు కెప్టెన్ శోభా శెట్టి అతడిని కూల్ చేసింది. ఇలా చాలాసేపు సాగిన గొడవ చల్లబడింది. ఇందులో గౌతమ్ ఎప్పటిలాగే శివాజిపై నెగెటివ్‌గా ఆలోచించినట్లు అనిపించింది. అదే సమయంలో తొలిసారి శివాజి ఈ రేంజ్‌లో అరిచి విశ్వరూపం చూపించాడు. దీంతో నిన్నటి ఎపిసోడ్ ఫైర్‌తో సాగింది. ఇక, ఈ వారం ఆయనే కెప్టెన్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X