Bigg Boss Telugu 7: షాకింగ్.. రేస్ నుంచి శివాజీ, శోభా శెట్టి ఔట్... టాప్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్
బిగ్ బాస్ తెలుగు 7 ముగింపు దశకు చేరుకుంటుంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... డిసెంబర్ 17న ఎండ్ కానుంది. ఇక ఇప్పటికే గత వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇక ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అయినప్పటికీ.. నామినేషన్స్ లో ఉన్నది 7.. ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇక టికెట్ టు ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. తాజా బిగ్ బాస్ నిర్వాహకుల సమాచారం ప్రకారం ఈ టాస్కుల నుంచి శివాజీ, శోభా శెట్టి ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈస్టోరీలో ఉన్నాయి.
బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక 12వారాలు పూర్తి చేసుకున్న ఈ షో... 13వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది. నామినేషన్స్ లో ప్రశాంత్, శివాజీ, యావర్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉన్నారు. ఇక హౌస్ లో అమర్ దీప్ ఒక్కడు నామినేషన్స్ లో లేడు. ఈ వారం సేఫ్ అయిపోయాడు అమర్ దీప్. ఇక ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అవ్వడంతో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు అవుతుంది.

ఇదిలా ఉంటే.. నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో.. హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్కులు మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఇక ఈ టికెట్ టు ఫినాలే టాస్కులు 7 జరగనున్నాయి. ఈ 7 టాస్కుల్లో బెస్ట్ ఫెర్మామెన్స్ ఇచ్చిన వాళ్లు ఫైనల్స్ కు వెళ్లనున్నారు. అది కూడా ఈ వారం సేవ్ అయితేనే. నిన్నటి నుంచే ఈ టాస్కులు మొదలు కాగా.. మ్యాగ్జిమమ్ టాస్కుల్లో గెలిచిన వారికి టికెట్ టు ఫినాలే ఛాన్స్ దొరుకుతుంది.
మొత్తం 7 టాస్కులు ఉండగా.. అందులో ఫిజికల్ టాస్కులు, బ్రెయిన్ టాస్కులు, రన్నింగ్ ఇలా ఉండనున్నాయి. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో 3 టాస్కులు జరిగాయి. అందులో శివాజీ, శోభా శెట్టి లిస్ట్ ఫెర్మామెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరికి కలిపి కూడా బిగ్ బాస్ పోటీ నిర్వహించాలని డిసైడ్ చేశారట. వీరిలో ఎవరు గెలిస్తే మళ్లీ వారు టాస్కుల్లో పాల్గొననున్నారు.
ఇక ఈ టాస్కుల్లో మొదటి విజేతగా అర్జున్ అంబటి నిలిచాడు. ఆయనకు 200 పాయింట్స్ వచ్చాయి. ఇక రెండో టాస్కులో పల్లవి ప్రశాంత్ విజయ సాధించాడు. ఇక మూడో టాస్కులో అర్జున్ మళ్లీ విజయం సాధించాడు. ఇక ప్రశాంత్ 600 పాయింట్స్ తో ముందంజలో ఉన్నాడు. ఇక మొత్తం టాస్కులు నిర్వహించకే ఎవరు ఫైనల్ వెళ్లనున్నారో తెలియాల్సి ఉంది.

ఇక ఈ టికెట్ టు ఫినాలే గెలిచిన వాళ్లు డైరెక్టుగా ఫినాలేకి వెళ్లనున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న ఆదివారం రాత్రి 7 గంటలకు జరగనుంది. ఇక ఈ సీజన్ 7 కాబట్టి టాప్ 7 కంటెస్టెంట్స్ వెళ్లనున్నారు. ఇప్పుడు 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. 13వ వారంలో ఒకరు ఎలిమినేట్ అవ్వగా.. 14వ వారంలో ఎవిక్షన్ పాస్ తో ఒకరు సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫైనల్ కు టాప్ 7 కంటెస్టెంట్స్ వెళ్తారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











