Bigg Boss Telugu 7: రేస్ నుంచి నలుగురు ఔట్... టాప్‌లో ఆ కంటెస్టెంట్... ఫినాలే అస్త్ర విన్నర్ అతడే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతుంది. ఇక 13వ వారం కూడా విజయవంతంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్స్ అనంతరం టికెట్ టు ఫినాలే టాస్క్ పోటీలు నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్. హౌస్ లో ఉన్నది 8 మంది కంటెస్టెంట్స్. వారి మధ్య పోటా పోటీగా ఈ టాస్కులు జరుగుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టికెట్ టు ఫినాలే టాస్క్ నుంచి నలుగురు కంటెస్టెంట్స్ ఔట్ అయ్యారు. ఇక టాప్ లో అమర్ దీప్ చౌదరి నిలిచాడు. మొత్తం 8 టాస్కులు జరగ్గా.. స్కోర్ ఎలా ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రియాలిటీ షోకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఇక చివరి అంకానికి చేరుకోవడంతో ఆట రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అవ్వగా.. 13వారాలుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తుంది. ఇక వారం వారం ఓ ట్విస్టు, షాక్ ఇస్తూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం హౌస్ లో 10మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శివాజీ, యావర్, ప్రశాంత్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్, గౌతమ్, అర్జున్ ఉన్నారు.

Sivaji, Shobha, Priyanka, Yawar Out From Ticket to Finale Race and Amardeep Top Bigg Boss Telugu 7 Full Details Here

ఇక వీరిలో ఈ వారం 7 మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఒక్క అమర్ దీప్ తప్ప ఇంట్లోని సభ్యులంతా నామినేషన్స్ లో ఉన్నారు. ఇక హౌస్ లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. ఇక ఈ టాస్కుల నుంచి మొదటగా శోభా శెట్టి, శివాజీ ఔట్ అయ్యారు. వీరి పాయింట్స్ ను అమర్ దీప్ కు ఇచ్చారు. ఇక ఆ తర్వాత ప్రియాంక ఔట్ అయింది. ఈమె తన పాయింట్స్ ను గౌతమ్ కు ఇచ్చింది.

తాజాగా ఈ రేస్ నుంచి యావర్ ఔట్ అయినట్లు తెలుస్తోంది. యావర్ తన పాయింట్స్ ను ప్రశాంత్ కు ఇచ్చాడు. ఇక ఈ టికెట్ టు ఫీనాలే నుంచి నలుగురు ఔట్ అయ్యారు. ఇక మరో నలుగురు రేస్ ఉన్నారు. మొత్తం 8 టాస్కులు నిర్వహించారు. 7వ టాస్కు విన్నర్ ప్రశాంత్ కాగా 8వ టాస్క్ విన్నర్ అమర్ దీప్ నిలిచాడు.

Sivaji, Shobha, Priyanka, Yawar Out From Ticket to Finale Race and Amardeep Top Bigg Boss Telugu 7 Full Details Here

మొత్తం స్కోర్ బోర్డ్ ఓ సారి చూస్తే.. అమర్ దీప్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో ప్రశాంత్ ఉన్నాడు. వీరిద్దరి పాయింట్స్ 100 తేడాతో ఉన్నాయి. ఇక మూడో స్థానంలో గౌతమ్, నలుగవ స్థానంలో అర్జున్ నిలిచాడు. ఇక ఈ టికెట్ టు ఫినాలే టాస్కులో అమర్ దీప్ అత్యధిక పాయింట్లతో ముందంజలో ఉన్నారు.

అయితే ఈ టికెట్ టు ఫినాలే అనేది డైరెక్టుగా గ్రాండ్ ఫినాలేకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ టికెట్ టు ఫినాలే అమర్ దీప్ గెలుచుకునే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే అమర్ దీప్ ఎలాగూ టాప్ 5 కంటెస్టెంట్స్ ఒకడు. అమర్ కంటే గౌతమ్, అర్జున్, యావర్ వంటి వాళ్లకు ఇది అవసరం. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X