Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ షోలో పెను సంచలనం.. గేట్లు తీస్తే వెళ్లిపోతానంటున్న శివాజి, అసలేమైందంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. రాత్రి 9 గంటల అయ్యిందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అంతా టీవీల ముందు వాలిపోయి మరీ ఈ షోను చూస్తున్నారు. పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్లకు సపోర్ట్ చేస్తూనే.. నచ్చని వారు ఎలిమినేట్ అయిపోతే బాగుండని అనుకుంటున్నారు. ఇప్పటికే విజయవంతంగా పది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోకు ఈరోజుటితో 11వ వారం కూడా పూర్తి చేసుకోబోతుంది. ఈక్రమంలోనే వీకెండ్ ఎపిసోడ్స్ లో భాగంగా బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

సండే.. ఫండేలో భాగంగా బిగ్ బాస్ టీం నిర్వాహకులు కోటబొమ్మాళి సినిమా టీంను బిగ్ బాస్ స్టేజీపైకి తీసుకొచ్చారు. అయితే హీరో మేక శ్రీకాంత్ తో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్ సహా శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ లు కూడా ఈషోకు వచ్చారు. ఈక్రమంలోనే స్టేజీపై ఫుల్ సందడి చేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ శివాజితో హీరో శ్రీకాంత్ ఫుల్ కామెడీ చేశారు. ముందుగా స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చిన కోటబొమ్మాళి టీంతో నాగార్జున మాట్లాడారు. ఈ సినిమా ఏంటసలు అని అడగ్గా.. ఇదో క్రైమ్ థ్రిల్లర్ అని శ్రీకాంత్ వివరించాడు.

Sivaji Shocking Comments About Bigg Boss Telugu 7 House in Latet Episode

ఏడు సీజన్లలో ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలేదట!:ఇక ఆ తర్వాత మీరు బిగ్ బాస్ చూస్తారా అని అడగ్గా... ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన బిగ్ ఏడు సీజన్లలో ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూశానని హీరో శ్రీకాంత్ చెప్పారు. అయితే ఆ విషయం తనకు ముందే తెలుసని నాగార్జున చెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇక ఆ తర్వాత గెస్టులు కనిపించకుండా.. ముందుగా హౌస్ మేట్స్ కు నాగార్జున కనిపించాడు. మీలో హుషారు పెంచాలని గెస్టులను తీసుకొచ్చానని చెబుతూ.. కోటబొమ్మాళి టీంను చూపించారు. శివాజికి అయితే బాగా ఫ్రెండ్ అనగానే అంతా ఎగ్జైట్ అయిపోయారు.

ఇక ఆ తర్వాత హీరో శ్రీకాంత్ ను చూడగానే.. ఫుల్ ఖుషీ అయ్యారు. ఈక్రమంలోనే శ్రీకాంత్.. శివాజి కొంచెం పక్కకు రామ్మా అంటూ పిలవగానే.. శివాజి వచ్చాడు. ఇన్ని రోజులు ఎలా ఉండగలిగావయ్యా ఇంట్లో అని అడగానే.. అదీ సోమవారం లేవగానే అంటూ మొదలు పెట్టాడు. మధ్యలోనే నాగార్జున అందుకొని అంతా శ్రీకాంత్ కు తెలియనిదే లేదని చెప్పాడు. ఆ వెంటనే శ్రీకాంత్.. ఏడు సీజన్లలో ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవకుండా చూశానని శ్రీకాంత్ మరోసారి చెప్పుకొచ్చారు. శివాజి చాలా బాగా ఆడతున్నావ్, ఫెంటాస్టిక్ అంటూ శ్రీకాంత్ చెప్పగా శివాజి ఫుల్ ఖుషీ అయ్యాడు. చాణక్యుడు, చంద్రగుప్తుడు అయ్యావంటూ తెగ పొగిడేశాడు.

Sivaji Shocking Comments About Bigg Boss Telugu 7 House in Latet Episode

గేట్లు తీయండి నేను వెళ్లిపోతా..!:అలాగే అమర్ దీప్ తో మాట్లాడు.. లక్ లేదనుకోకు, కష్టపడితే లక్ అదే వస్తుందని అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టి, శ్రీకాంత్ కన్నడలో మాట్లాడుకోగా.. ఆపండి నాగ్ ఆపేశాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ శివాజి మీకంటే పెద్దోడు అనుకున్నాం అంటే.. వెంటనే శ్రీకాంత్ అదేం లేదు కానీ బయట కూడా అలాగే అనుకుంటారు అన్నాడు. మీరు కూడా పెద్దయ్యా, పెద్దయ్యా అంటూ పెద్దోడిని చేసేశారుగా అనగానే.. శివాజి గేట్లు తీయండయ్యా నేను వెళ్లిపోతానంటూ ఫన్నీ కామెంట్లు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X